*🔹. ఇన్కమ్ టాక్స్ పై అవగాహన కొరకు ఒక సిరీస్ గా రోజుకు ఒక అంశం మీద తెలుసుకుందాం*
*👉 ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 192 ప్రకారం ప్రతి ఉద్యోగి తన వేతన ఆదాయం, ఇతర ఆదాయాలు కలిపి మొత్తం ఆదాయంపై ప్రతి సంవత్సరం నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి (01.04.2022 నుండి 31.03.2023 వరకు గల ఆదాయము) ఉద్యోగులు చెల్లింపు చేయవలసిన ఆదాయపు పన్ను లెక్కింపులోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాము*
*🔹2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను లెక్కింపు విధానము రెండు విధాలుగా వర్గీకరించారు*
*✔️1. మొదటి విధానం (సెక్షన్ 115 BAC):*
*ఈ విధానంలో మినహాయింపులు గాని, తగ్గింపులు గాని ఏవి అనుమతించబడవు. 80CCD2 (Allowed).*
*ఈ విధానంలో పన్ను లెక్కింపు అన్ని వయస్సుల వారికి ఒకే విధంగా ఉంటుంది*
*✔️2. రెండవ విధానం (Popular for Employees) :*
*ఈ విధానంలో మినహాయింపులు, తగ్గింపులు గతంలో మాదిరిగానే వర్తిస్తూ గత సంవత్సరం విధంగానే ఆదాయపు పన్ను రేట్లు కొనసాగింపు.*
*మన ఆదాయం నుండి తగ్గింపులు, మినహాయింపులు పోను, వచ్చిన నికర ఆదాయం పై టాక్స్ ను శ్లాబ్ రేట్ బట్టి చెల్లించాలి.*
*పై రెండింటిలో ఉద్యోగి తనకిష్టమైన దానిని ఎన్నుకోవచ్చు*
*✔️1. కొత్త టాక్స్ శ్లాబ్ విధానంలో ఆదాయ పన్ను 2022-23 శ్లాబ్ రేట్స్*
*👉ఆదాయం ➖ చెల్లించాల్సిన టాక్స్*
*👉2.5 లక్షల వరకు ➖ టాక్స్ లేదు*
*👉2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ➖ 5% టాక్స్ (రూ 12,500 వరకు టాక్స్ మినహాయింపు ఉంది.* కావున టాక్స్ పడదు)
*👉5 లక్షల నుండి 7.5 లక్షల వరకు ➖ 12500 + 5 లక్షలు దాటిన ఆదాయం పై 10%*
*👉7.5 లక్షల నుండి 10 లక్షల వరకు ➖ 37500 + 7.5 లక్షలు దాటిన ఆదాయం పై 15%*
*👉10 లక్షల నుండి 12.5 లక్షల వరకు ➖ 75000 + 10 లక్షలు దాటిన ఆదాయంపై 20%*
*👉12.5 లక్షల నుండి 15 లక్షల వరకు ➖ 125000+10 లక్షలు దాటిన ఆదాయంపై 25%*
*👉15 లక్షలపైన 187500+15లక్షలు దాటిన ఆదాయంపై 30%*
*✔️2. ప్రస్తుత ఉన్న ఐటీ 2022-23 గణన ప్రస్తుతం ఉన్న(Old) టాక్స్ శ్లాబ్లు*
*👉ఆదాయం ➖ చెల్లించాల్సిన టాక్స్*
*👉2.5 లక్షల వరకు ➖ టాక్స్ లేదు*
*👉2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ➖ 5% టాక్స్ (రూ 12,500 వరకు టాక్స్ మినహాయింపు ఉంది.* కావున టాక్స్ పడదు)
*👉5 లక్షల నుండి 10 లక్షల వరకు ➖ 12500 + 5 లక్షలు దాటిన ఆదాయం పై 20%*
*👉10 లక్షలపైన ➖1,12,500 + 10 లక్షలు దాటిన ఆదాయంపై 30%*
*💥ఆదాయ పన్ను 2022-23 - వేతనాదాయంగా పరిగణించే అంశాలు (Income)*
(1) *మూలవేతనము, డిఏ, హెచ్ఎస్ఏ, సిసిఏ, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, ఐ.ఆర్.*
(2) *వేతన బకాయిలు, వేతన అడ్వాన్స్*
(3) *పెన్షన్*
(4) *సరెండర్ లీవు*
(5) *బోనస్*
(6) *నూతన పెన్షన్ పథకంలో ప్రభుత్వ వాటా*
(7) *ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్,*
(8) *పిఆర్సి, స్టెప్ అప్, ఏఏఎస్ తదితర బకాయిలు*
*💥ఆదాయ పన్ను 2022-23 ఇతర ఆదాయ అంశాలు (Other Income)*
(1) *నివాస గృహాలు, వ్యాపార కాంప్లెక్స్ పై వచ్చే అద్దెలు,*
(2) *వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం,*
(3) *షేర్లు / మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం.*
(4) *భవిష్య నిధి ఖాతాలలో రూ.2.5లక్షల పైబడి చెల్లించే చందా మొత్తంపై వడ్డీ*
(5) *బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, పోస్టు ఆఫీసులలోని సేవింగ్స్ ఖాతా పై వడ్డీ, ఎన్.యస్.సి. సర్టిఫికెట్లపై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు*
(3) *ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షన్*
(4) *గత సంవత్సరం ఆదాయపు పన్ను రీఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ*
*💥ఆదాయ పన్ను 2022-23 వేతనాదాయంగా పరిగణించబడని అంశములు::*
(1) *గ్రాట్యుటీ*
(2) *కమ్యూటెడ్*
(3) *యల్టిసి*
(4) *పిఎఫ్ నుండి చెల్లింపులు*
(5) *టూర్ / ట్రాన్స్ఫర్, టిఏ, డిఏ*
(6) *రిటైరైన తదుపరి సంపాదిత, అర్ధజీతపు సెలవు నగదు*
(7) *వికలాంగుడైన ఉద్యోగికిచ్చే కన్వేయన్స్ అలవెన్స్*
(8) *ఎడ్యుకేషన్ అలవెన్స్*
(9) *మెడికల్ రీయింబర్స్మెంట్*
✔️1. ఫైనాన్షియల్ ఇయర్, అస్సెస్స్మెంట్ ఇయర్
✔️2. టీడీస్ అంటే ఏంటి
✔️3. సందేహాలు - సమాధానాలు
*✳️ . ఫైనాన్షియల్ ఇయర్ :*
*ఏప్రిల్ 1st న మొదలు అయ్యి 31st మార్చి న ముగిసే సంవత్సరాన్ని (ఫైనాన్షియల్ ఇయర్) ఆర్ధిక సంవత్సరం అంటాము.*
*దీనిని FY తో సూచిస్తారు*
*ఉదాహరణకు 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు గల కాలాన్ని 2022-23 ఆర్ధిక సంవత్సరం అంటారు.*
*సంపాదన, ఖర్చులు మొత్తం FY 2022-23 లో చూపిస్తారు.*
*✳️. అస్సెస్స్మెంట్ ఇయర్:*
*సాధారణంగా మనం ఫైనాన్షియల్ ఇయర్ పక్కన బ్రాకెట్ లో అస్సెస్స్మెంట్ ఇయర్ అని వచ్చే సంవత్సరాలు వేయడం ఇన్కమ్ టాక్స్ లో చూస్తూ ఉంటాము* [FY 2022-23 (AY 2023-24)]
*ఇందులో అస్సెస్స్మెంట్ ఇయర్ [AY] Assessment Year అనేది ఏంటి అని చాలా మందికి సందేహం ఉంది.*
*అస్సెస్స్మెంట్ ఇయర్ అంటే, ఫైనాన్షియల్ ఇయర్ తరువాత వచ్చే సంవత్సరం.*
*ఈ సంవత్సరంలో మనం గత సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి లెక్కలు సరిచూసే సంవత్సరం (మదింపు చేసే సంవత్సరం).*
*అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ లో సంపాదిస్తే, అడ్వాన్స్ టాక్స్ కడితే, దాని టాక్స్ లెక్కలు అన్నీ అస్సెస్స్మెంట్ ఇయర్ లో పూర్తి అవుతాయి*
👉 ఉదాహరణకు
*FY 2022-23 {అనగా 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 } లో పొందిన ఆదాయానికి సంబంధించి టాక్స్ గణన AY 2023-24 లో పూర్తి అవుతుంది. ఈ 2023-24 లో మనం ఈ ఫైలింగ్ కూడా పూర్తి చేసి, 2022-23 కు సంబంధించి ఆదాయ పన్ను వివరాలు పూర్తి చేస్తాము*
*ఇన్కమ్ టాక్స్ ITR లో ఎప్పుడు అస్సెస్స్మెంట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే, అది గత సంవత్సర ఆదాయాన్ని లెక్కించి ఈ సంవత్సరంలో గణన పూర్తి చేసునట్టు ఇచ్చే దృవీకరణ.*
*2022-23 Financial Year Means : The income earned in the present Financial Year (FY) 2022-23 is the income earned from April 1, 2022, to March 31, 2023 and Assessed in the Assessment Year 2023-24 [AY 2023-24]*
*✳️. కొన్ని సందేహాలు – సమాధానాలు*
👉. ప్రశ్న 1: *మన ఇన్కమ్ టాక్స్ లో నెలవారీ ఆదాయంలో మార్చి నుండి ఫిబ్రవరి వరకు గల నెలల ఆదాయం ఎందుకు వేస్తాము?*
సమాధానం: *ఏ ఆర్ధిక సంవత్సరంలో అయిన ఆ ఆర్ధిక సం లో 1 ఏప్రిల్ నుండి 31 మార్చి వరకు పొందిన మొత్తం ఆదాయాన్ని లెక్కించాలి. ఇక మన ఉద్యోగుల ఆదాయం వరకు వస్తే మార్చి జీతాన్ని ఏప్రిల్ లో అందుకుంటాము. ఫిబ్రవరి జీతాన్ని మార్చి నెలలో అందుకుంటాము. కాబట్టి ఏప్రిల్ లో అందుకొనే మార్చి జీతం మొదలు తరువాతి సంవత్సరం మార్చి లో అందుకొనే ఫిబ్రవరి జీతాలు వరకు మనం టేబుల్ రూపంలో వేయడం జరుతుంది.*
Ex; FY 2022-23
*1st April 2022 to 31st March 2023 = [March 2022 Salaries Paid in April 2022 to February Salaries Pain in March 2023]*
ప్రశ్న 2; *టీడీస్ అంటే ఏంటి. ?*
సమాధానం: *TDS అంటే ఆదాయ మూల వద్ద పన్ను. వచ్చే ఆదాయంలో ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో సూచించిన ప్రకారం ప్రతీ డీడీవో తన ఉద్యోగుల జీతాల నుండి టీడీస్ మినహాయించి ప్రభుత్వానికి ఆ ఉద్యోగి పాన్ నెంబర్ సూచిస్తూ చెల్లిస్తారు. మనకు సంవత్సర ఆదాయానికి ఎంత టాక్స్ పడవచ్చునో అది నెలవారీ లెక్కిస్తే వచ్చే సంఖ్యకు దాదాపు దగ్గరలో టీడీస్ ఉంటుంది.*
*ఆదాయం జీతాభత్యాల ద్వారా ఉన్నప్పుడు డీడీవో లు అందరూ తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో సూచించిన విధంగా TDS {ఆదాయ మూలం వద్ద పన్ను} కట్ చేయాలి. ఇలా మినహాయించిన టీడీస్ ను ప్రతీ క్వార్టర్ కు ప్రభుత్వానికి జమ చేయాలి.*
*జీతాలు మాత్రమే కాకుండా బ్యాంక్ లు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఫిక్సెడ్ డెపోసిట్ తదితర వాటి పై టీడీస్ వేస్తాయి.*
ప్రశ్న: 3 *అడ్వాన్స్ టాక్స్ , టీడీస్ ఒక్కటే నా ?*
సమాధానం: *Advance tax is applicable when an individual has sources of income other than his salary.*
*If you are a salaried employee, you need not pay advance tax as your employer deducts it at source, known as TDS (tax deducted at source).*
*అడ్వాన్స్ టాక్స్ అనేది వ్యక్తిగతంగా కట్టుకునేది, టీడీస్ అనేది మన డీడీవో జీతాల నుండి మినహించేది. రెండూ కూడా చివరకు, మన టాక్స్ లెక్కింపులో రిఫ్లెక్ట్ అవుతాయి.*
Q:4 *డీడీవో మన వద్ద ఎక్కువ టీడీస్ కట్ చేస్తే అది తిరిగి మనకు వస్తుందా ?*
సమాధానం: *ఆర్దిక సంవత్సరం ముగుసిన పిదప అస్సెస్స్మెంట్ ఇయర్ లో మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాము. అప్పుడు మనము కట్టవలసిన టాక్స్ కన్నా ఎక్కువ టీడీస్ మినహాయించినట్టు తేలితే, ఎంత ఎక్కువ టీడీస్ మనం పే చేసి ఉంటే అది మనకు రిటర్న్ వస్తుంది. ఒక వేళ ఆ రిటర్న్స్ లో మనం ఇంకా టాక్స్ పే చేయాల్సి ఉంటే మనం ఆన్లైన్ లో పే చేయాలి.*
*♻️ఆదాయపన్ను 2022-23 లో మినహాయింపులు
*💥Deductions U/s 16 of the Act from salaries
Standard Deduction: సెక్షన్ 16 (IA) కింద ప్రామాణిక తగ్గింపు: యాభై వేల రూపాయల తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్‌గా అనుమతించబడుతుంది*
*Tax on Employment [Section 16(iii)]: (ప్రొఫెషనల్ టాక్స్): ఈ ఆర్ధిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం వృత్తి పన్ను ఆదాయపన్ను నుండి మినహాయించబడుతుంది*
*💥Deductions Under Chapter VI-A of the Act*
*సెక్షన్ 80సి క్రింద తగ్గింపులు:*
(1) *ఎల్ఐసి ప్రీమియం (ఏప్రిల్ 1, 2022 నుండి మార్చి 31, 2023 మధ్యలో కట్టిన ప్రీమియం)*
(2) *పిఎఫ్ చందా (ZPPF/GPF/Provident Fund)*
(3) *సుకన్య సమృద్ది అకౌంటు కు చెల్లించిన ప్రీమియం Sukanya Samriddhi Account*
(4) *నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (8వ ఇష్యూ) Postal NSC Bonds*
(5) *యుటిఐ యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ULIP*
(6) *TSGLI Premium / GIS Premium*
(7) *ఎస్ఐసి ధనరక్ష మ్యూచువల్ ఫండ్*
(8) *సెక్షన్ 10 (23) ననుసరించి అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్* (Mutual Fund)
(9) *గృహ నిర్మాణము లేక కొనుగోలుకై ప్రభుత్వం / బ్యాంక్లు / ఎల్ఐసి / నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి పొందిన అప్పులు తీర్చుటకు తిరిగి చెల్లించిన అసలు* (Housing Loan Principal)
(10) *ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజు* (Only Tuition Fees for Any Full-Time Education Course allowed in India)
(11) *ఈక్విటి లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లలో పెట్టుబడి*
(12) *అనుమతించబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్*
(13) *పెన్షన్ ఫండ్*
(14) *పోస్టాఫీజులోగానీ లేదా ఏదైనా షెడ్యూల్ బ్యాంకులో కనీసం 5 సం||ల ఫిక్స్డ్ చేసిన టర్మ్ డిపాజిట్లు* (5 Year Term Deposits)
(15) *సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 2004.*
*80 CCC: సెక్షన్ 80సిసిసి క్రింద తగ్గింపులు : ఎల్ఎస్ఐసి / కేంద్ర ప్రభుత్వం గురించిన పెన్షన్ స్కీమ్కు చెల్లించిన కాంట్రిబ్యూషన్.*
*Section 80 CCD(1) సెక్షన్ 80సిసిడి (1) :* *నూతన పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) కు వేతనంలో చెల్లించిన 10% కాంట్రిబ్యూషన్.*
గమనిక : *80సి, 80 సిసిసి, 80 సిసిడి(1) సెక్షన్ల క్రింద కలిపి మొత్తం 1.5 లక్షల గరిష్ట పరిమితి వరకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది.*
Please give your comments....!!!