🔷పాస్ పోర్ట్ కు కాని,విదేశాలకు వెళ్ళడానికి అనుమతి పొందేందుకు ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి.అది ఎవరు మంజూరుచేస్తారు.ఏమేమి ధృవపత్రాలు సమర్పించాలనే దానిపై కొంత సమాచారం......
♦SA,SGT,LP,PET తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారిచేయు అధికారం జిల్లా విద్యాశాఖాధికారి గారికి,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,యం.ఈ.వో ల విషయంలో RJD లకు అధికారమిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆర్.సి.నం.212/SER-IV-2/2014;తేది:26-2-2015 ను జారీచేసింది.
♦ పాస్ పోర్ట్ పొందుటకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి 1 ఒరిజినల్ సెట్,ఒక జిరాక్స్ సెట్ సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD కార్యలయంలో సమర్పించాలి. *3* పాస్ పోర్ట్ ఫొటోలు అదనంగా జత చేయాలి.
♦ విదేశాలకు వెళ్ళుటకు అనుమతి కొరకు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి 3 ఒరిజినల్ సెట్లు,సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD కార్యలయంలో సమర్పించాలి.
0 Comments
Please give your comments....!!!