Type Here to Get Search Results !

About GPF in Telugu

*జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ (GPF) ఉత్తర్వులతో:*

✴ GPF రూల్స్ 1-4-1935 నుండి అమలులోకి తీసుకురావడం జరిగింది.

✴ ఈ స్కీం ప్రభుత్వ ఉద్యోగులకు 1-3-1963 నుండి తప్పనిసరి చేయబడినది.

✴ తేది 1-9-2004 తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వారికి ఈ రూల్స్ వర్తించవు.
*(G.O.Ms.No.654 Fin Dt:22-09-2004)*

✴ చందాదారుడు ఈ ఫండ్ లో చేరే సమయంలో తప్పక తన నామినేషన్ సమర్పించాలి *(రూల్-7)*

✴ ప్రతి చందాదారునికి ఒక అకౌంట్ నెం.అలాట్ చేస్తారు.అందులో చందా వివరాలు మరియు ఆర్జించిన వడ్డీ మొదలగు విషయాలు ఉంటాయి. *(రూల్-8)*

✴  ప్రతి చందాదారుడు నెలనెలా చందా చెల్లించాలి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులు చందా చెల్లించనవసరం లేదు.

✴ జీతం లేని సెలవు,అర్ధజీతపు సెలవు సందర్భాలలో చందా చెల్లించాలా వద్దా అన్నది ఉద్యోగి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
*(G.O.Ms.No.199 F&P Dt:11-07-1969)*

✴ రిటైర్మెంట్ కంటే నాలుగు నెలల ముందు నుండి చందా చెల్లించనవసరం లేదు.
*(G.O.Ms.No.98 F&P Dt:19-06-1992)*

✴ చందా రూల్-10 లో తెలిపిన రేట్ల ప్రకారం చెల్లించాలి.అంతకంటే ఎక్కువగా అయినా చెల్లించవచ్చు కాని అతను పొందే జీతభత్యాలు (Pay+DA) కు మించరాదు

✴ చందాదారుడు తన చందాను సం॥లో రెండుసార్లు పెంచుకోవచ్చు. అలాగే ఒకసారి తగ్గించుకోవచ్చు.
*(G.O.Ms.No.21 F&P Dt:24-01-1981)*

✴ నాల్గవ తరగతి ఉద్యోగులు బేసిక్ పే పై 4%;  ఇతరులు భీమా కలవారు 6%; భీమా లేనివారు 12% చెల్లించాలి.

✴ నెలసరి చందా ఉద్యోగి జీతభత్యాల నుండి రికవరీ చేయాలి.అలగే డిప్యూటేషన్ లో పనిచేసే వారి జీతాల నుండి చందా రికవరీ చేసి చలానా ద్వారా వారి ఉద్యోగి అకౌంట్లో
జమచేయాలి. *(రూల్-12)*
*(G.O.Ms.No.359 F&P Dt:25-10-1993)*

✴  ఉద్యోగి ఖాతాలో నిల్వయున్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం తెలిపిన రేటు ప్రకారం వడ్డీ లెక్కగట్టి చందాదారుని అకౌంట్లో జమచేస్తారు. *(రూల్-13)*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night