*మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం*
🇬🇸🇷🇦🇴🌎
*మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులు అందరికీ శుభాకాంక్షలు తేలియజేస్తూ ...*
*మహిళల సంరక్షణకు పార్లమెంట్ చేసిన చట్టాలు*
👭 *వ్యభిచార నిరోధక చట్టం* (The Prostitution Prohibition Act), 1956
👭 *మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం* (The Indecent Representation of Women (Prohibition) Act), 1986
మహిళలను కించపరిచేవిధంగా అడ్వైర్టెజ్‌మెంట్, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి ఈ చట్టం ద్వారా నిరోధించారు.
👭 *సతి నిరోధక చట్టం* (The Sati Prohibition Act), 1987
👭 *వరకట్న నిషేధ చట్టం* (The Dowry Prohibition Act), 1961
వివాహానికి ముందుకాని, వివాహం తర్వాత కాని, మరెప్పుడైనా కాని వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది.
👭 *గర్భ నిరోధక నివారణ చట్టం* (The Medical Termination of Pregnancy Act), 1971
👭 *ముస్లిం వివాహాల రద్దు చట్టం* (The Dissolution of Muslim Marriages Act), 1939
తన వివాహాన్ని రద్దు చేసుకొనే హక్కుని ముస్లిం స్త్రీలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
*_విడాకులు పొందిన ముస్లిం మహిళ రక్షణ చట్టం_*, 1939
భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీల హక్కులు కాపాడేందుకు ఈ చట్టం చేశారు.
👭 *కుటుంబ న్యాయస్థానాల చట్టం* (The Family Courts Act), 1984 : కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు.
👭 *లీగల్ సర్వీసెస్ ఆథారిటీ చట్టం* (The Legal Services Authorities Act), 1987
మహిళ చట్టం ద్వారా రాజ్యం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది.
👭 *హిందు వివాహ చట్టం* (The Hindu Marriages Act), 1955
ఈ చట్టం ప్రకారం హిందూ మహిళ వివాహ, విడాకుల విషయంలో పురుషుడితో సమాన హక్కులు కలిగి ఉన్నాయి. ఈ చట్టం ఏకపత్ని విధానం, కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్త నుంచి విడాకులు పొందే హక్కు కల్పిస్తుంది.
👭 *కనీస వేతన చట్టం* (The Minimum Wages Act), 1948
లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుని కంటే కనీస వేతనం కంటే తక్కువ నిర్దేశించరాదు
👭 *గనుల చట్టం* (The Mines Act), 1952
*_ఫ్యాక్టరీస్ చట్టం_*(The Factories Act), 1948
గనుల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే స్త్రీలతో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పనిచేయించరాదు.
👭 *హిందూ వారసత్వ చట్టం* (The Hindu Succession Act), 1956
ఈ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషుడితో సమానహక్కు ఉంది.
👭 *Indian Christian Marriages Act* (1872)
క్రైస్తవ వివాహాలకు, విడాకులకు సంబంధించిన అంశాలు పొందుపర్చారు.
👭 *సమాన వేతన చట్టం* (The Equal Wages Act), 1976
స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు.
👭 *మాతృత్వ ప్రయోజనాల చట్టం* (The Maternity Benefits), 1961
పని చేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
👭 *గృహ హింస నిరోధక చట్టం* (The Domestic Violence Prohibition Act), 2005
ఎవరైనా కుటుంబసభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక, మానసిక, మాటల ద్వారా వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
కింద పేర్కొన్న చట్టాల్లో స్త్రీల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
అవి...
1. రాష్ట్ర ఉద్యోగుల బీమా చట్టం – 1948
2. Plantation Labour Act – 1951
3. కట్టుబానిసత్వ నిరోధక చట్టం – 1976
4. Legal Practitioners (Women) act – 1923
5. భారత విడాకుల చట్టం (1869)
6. ప్రత్యేక వివాహాల చట్టం (1954)
7. విదేశీ వివాహాల చట్టం (1969)
8. పార్శీ వివాహ విడాకుల చట్టం (1936)
9. భారత సాక్ష్యాల చట్టం (Indian Evidence Act 1972)
10. హిందూ దత్తత, వివాహ చట్టం (1956)
11. జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1990
12. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013
ప్రైవేట్, ప్రభుత్వ, సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు లైగింక వేధింపుల నుంచి ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చు.
*_కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ_* (Central Social Welfare Board) : 1953లో ఈ బోర్డును నెలకొల్పారు. కేంద్ర కార్యనిర్వాహకవర్గ తీర్మానం ద్వారా కంపెనీల చట్టం 1956 కింద ఈ సంస్థను 1969లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ న్యాయపరమైన హోదా కలిగి ఉంది. ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం మహిళలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల అమలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఈ బోర్డుకు ప్రథమ చైర్మన్‌గా వ్యవహరించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Please give your comments....!!!