Guruvu.In

మహిళ ఉద్యోగినులు-ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

🌺 * మహిళ ఉద్యోగినులు-ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు:*🌺

💥 ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది
*(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)*
..
💥 ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
*(G.O.Ms.No.27 తేది:09-01-2004)*

💥 మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
*(G.O.Ms.No.350 తేది:30-07-1999)*

💥 అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
*(Memo.No.17897 తేది:20-04-2000)*

💥 పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ
ఉత్తర్వులు.
*(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)*

💥 ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
*(మెమో.నం.7679 తేది:14-09-2010)*

💥 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
*(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)*

💥 మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.374 తేది:16-03-1996)*

💥 జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
*(G.O.Ms.No.03 తేది:05-01-2011)*

💥వివాహం ఐన మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.
*(G.O.Ms.No.152 తేది:04-05-2010)*

💥 మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*

💥 మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*

💥 ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*

💥 మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*

💥 చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*

💥 మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
*(G.O.Ms.No.209 తేది:21-11-2016)*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts