*సందేహాలు -- సమాధానాలు*
సందేహం:
*స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?*
సమాధానం:
*ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.*
సందేహం:
*వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు?*
సమాధానం:
*వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.*
సందేహం:
*ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా?*
సమాధానం:
*2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.*
సందేహం:
*నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా? చెయ్యరా?*
సమాధానం:
*జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.*
సందేహం:
*సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది?*
*సమాధానం:*
*జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.*
సందేహం:
*జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా?*
*సమాధానం:*
*జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి.*
సందేహం:
*ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము. డబ్బులు ఎంత ఇస్తారు?*
*సమాధానం:*
*ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు. అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.*
సందేహం:
*కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా?*
*సమాధానం:*
*జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.*
సందేహం:
*వేసవి సెలవులు మరియు వ్యక్తిగతంగా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది?*
*సమాధానం:*
*జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.*
*ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?*
జ।। చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ
*సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)*
*టాక్స్ టేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*
2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)
2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%
10,00,000 పైబడిన 30%
7,00,000 కు టాక్స్ గణిస్తే
2,50,000 వరకు పన్ను లేదు
2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
*అంటే 2,50,000 X 10% = 25,000/-
5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%
అంటే 2,00,000 X 20% = 40,000/-
చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు.*
*CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.*
*ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.*
*అదనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది*
*ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN) ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.*
*అదనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*
*ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.*
*ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.*
0 Comments
Please give your comments....!!!