Guruvu.In

FAQs On Service Matters

*సందేహాలు -- సమాధానాలు*

ప్రశ్న:
*నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?*

*జవాబు:*
*మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.*

ప్రశ్న:
*నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?*

*జవాబు:*
*వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.*

ప్రశ్న:
*11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా?*

*జవాబు:*
*జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.*

ప్రశ్న:
*సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి?*

*జవాబు:*
*జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంటులు, స్పెషల్ పేలు చెల్లించబడతాయి. I R మాత్రము చెల్లించబడదు.*

ప్రశ్న:
*ఐటీ లో రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం కింద ఎంత పన్ను మినహాయింపు పొందవచ్చు?*

*జవాబు:*
*వార్షిక ఆదాయం 12 లక్షల లోపు గలవారు గరిష్ఠ0గా 50,000/- వరకు పొదుపు చేసి 25,000/- వరకు మినహాయింపు పొందవచ్చు.*

ప్రశ్న:
*బయోమెట్రిక్/ఐరిష్ సాఫ్ట్వేర్ ను ఎవరు రూపొందించారు?*

జవాబు:
*వేలిముద్రలు "కార్వే డేటా మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్" వారికి, ఐరిష్ ను "అనాలజీస్ టెక్ ఇండియా లిమిటెడ్"వారికి అప్పగించారు.*

ప్రశ్న:
*నేను FAC HM గా 2 ఇయర్స్ పని చేశాను.3 నెలల కాలానికి FAC అలవెన్సు RJD గారు మంజూరు చేసారు. మిగిలిన కాలానికి అలవెన్సు ఎవరు ఇస్తారు?*

*జవాబు:*
*మీరు DSE గారికి దరఖాస్తు చేసుకోవాలి.*

ప్రశ్న:

*స్కూల్ కాంప్లెక్స్ లో TLM గ్రాంట్ కింద ఎంత ఖర్చు చేయవచ్చు?*

*జవాబు:*
*7000/- వరకు ఖర్చు చేయవచ్చు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts