Guruvu.In

FAQs On Volunteery Retirement Related Matters

*సందేహాలు -- సమాధానాలు*

*ఉద్యోగ, ఉపాధ్యాయులు వాలంటరీ రిటైర్మెంట్ (VR) తీసుకునే విధానంపై కొన్ని ప్రశ్నలు వేసి... గ్రూపు ద్వారా జావాబులివ్వాలని కోరారు. కాబట్టి ఈ స్పందన:*

13. *VR  తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?*

సమాధానం:
*VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.*

సందేహం:
*VR  ఏయే కారణాలపై తీసుకోవచ్చు?*

సమాధానం:
*వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.*

సందేహం:
*ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?*

సమాధానం:
*20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు*.

సందేహం:
*ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?*

సమాధానం:
*క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.*

సందేహం:
*Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?*

సమాధానం: Yes.

సందేహం:
*Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?*

సమాధానం:
*సెలవులో ఉండి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది*

సందేహం:
*అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?*

సమాధానం:
*11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!*

సందేహం:
*VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?*

సమాధానం:
*VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.*

సందేహం:
*చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?*

సమాధానం:
*వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....*
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
*(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది)*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts