Type Here to Get Search Results !

FAQs

💥సందేహాలు -- సమాధానాలు★🌿🌸

*★ప్రశ్న:★*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??

*జవాబు:*
*ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.*

*★ప్రశ్న:★*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??

*జవాబు:*
*అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.*

*★ప్రశ్న:★*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??

*జవాబు:*
*103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.*

*★ప్రశ్న:★*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

*జవాబు:*
*చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*

*★ప్రశ్న:★*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??

*జవాబు:*
*అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.*

*🌼🥀సందేహాలు -- సమాధానాలు🌼🥀*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

★ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?

*🌼జవాబు:*
*G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*

°°°°°

★ప్రశ్న:
ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?

*🌼జవాబు:*
*A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.*

°°°°°

★ప్రశ్న:
సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?

*🌼జవాబు:*
*FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.*

°°°°°

★ప్రశ్న:
కారుణ్య నియామక  పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?

*🌼జవాబు:*
*కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని  G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.*

°°°°°

★ప్రశ్న:
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

*🌼జవాబు:*
*జమ  చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.*

°°°°°

★ప్రశ్న:
నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైం చేసుకోవచ్చు.

*🌼జవాబు:*
*మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.*

°°°°°

★ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు??

*🌼జవాబు:*
*వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.*

°°°°°

★ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది??

*🌼జవాబు:*
*కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.