*సందేహాలు -- సమాధానాలు*
👉 ప్రశ్న: *ఐటీ లో వికలాంగ ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు ఉందా?*
*జవాబు:* *80U కింద డాక్టర్ ఇచ్చిన ధ్రువ పత్రం ను బట్టి 40% వైకల్యం గల వారికి 75000రూ, 80% కన్నా ఎక్కువ వైకల్యం కలవారికి 1,25,000రూ వరకు మినహాయింపు లభిస్తుంది.*
👉 ప్రశ్న: *నేను తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాను.నేను BA సంస్కృతం మరియు శిక్షా శాస్త్రి పాస్ అయ్యాను. నేను SA సంస్కృతం పోస్టుకి అర్హుడనేనా?*
👉 *జవాబు:* *అర్హులే.
👉 * ప్రశ్న: *ఒక టీచర్ ప్రసూతి సెలవు లో ఉంది.బదిలీల లో పాల్గొని మరో స్కూల్ కోరుకుంది.ఆమె నూతన స్కూల్లో ఎప్పుడు చేరాలి?*
👉 *జవాబు:* *ఆమె అందరితో పాటు relieve కావాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట స్కూల్లో జాయిన్ అవుతానని కొత్త స్కూల్ HM కి, MEO కి తెలియజేయాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలి.
👉 * ప్రశ్న: *పదోన్నతి కల్పిస్తే, ప్రస్తుతం మనకి ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు వస్తాయి?*
👉 *జవాబు:* *4385 లో 45% అనగా 1973 జూనియర్ లెక్చరర్ పోస్టులు పదోన్నతి పై టీచర్ల కి ఇవ్వాలి.
👉 * ప్రశ్న: *ఒక టీచర్ 2014 ఆగస్టు లో సస్పెండ్ అయి, 2016 నవంబర్ లో విధులలో చేరాడు.అతనికి fixation ఎప్పటి నుంచి చేయాలి?*
👉 *జవాబు:* *జీఓ.46 తేదీ:30.4.15 ప్రకారం కేవలం 1.7.13 నాడు సస్పెండ్ లో ఉన్న వారికి మాత్రమే తిరిగి నియామకం పొందిన తేదీ నుండి fixation చేస్తారు.మీరు 1.7.13 న విధులలో ఉన్నారు కాబట్టి మీకు 1.7.13 నుండే fixation చేయాలి.*
0 Comments
Please give your comments....!!!