Type Here to Get Search Results !

*🌻మన ఊరు - మనబడి షెడ్యూల్ మరియు ప్రచారము కొరకు ఉపయోగకరమైన బడులు విశిష్టతను తెలిపే గీతాలు, నినాదాలు , స్లోగన్ లు ...⤵*

మన ఊరు - మన బడి.
Slogans:

🔹ప్రభుత్వ బడి- అమ్మ ఒడి
🔹ప్రభుత్వ విద్య - ఉచిత విద్య
🔹సర్కారు బడి పిల్లలు -సత్తా కలిగిన పిడుగులు
🔹ప్రభుత్వ బడిలో చేర్చు - మీ పిల్ల వాడి తలరాత మార్చు
🔹సర్కారు బడిలోనే చదివించండి....
పిల్లల జీవితాలలో వెలుగుని పెంచండి.....
🔹ఎక్కడికో ఎందుకు దండగ- ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగ
🔹ప్రభుత్వ బడులే మిన్న -ప్రయివేటు బడులు సున్న
🔹ప్రభుత్వ బడులు ముద్దు....
ప్రవేటు బడులు వద్దు.....
🔹ప్రభుత్వ బడి - చదువుల గుడి
🔹ప్రభుత్వ బడిలో చదువు - మీ పి�ల్లల జీవితానికి మలుపు
🔹గ్రామాల లో పాఠశాలలు
దేశానికి పట్టు గొమ్మలు.
🔹ప్రభుత్వ పాఠశాలలను
పరిరక్షించుకుందామ్.
🔹ప్రభుత్వ పాఠశాలలు
మీ పిల్లల భవితకు పునాదులు
🔹మన వూరు మన బడిని
మనమే కాపాడుకుందామ్
🔹ప్రభుత్వ బడులులో చదువులు
మీ పిల్లల జీవితానికి వెలుగులు.
🔹ప్రభుత్వం పాఠశాలలు వర్ధిల్లాలి.

*🌻మన ఊరు - మనబడి ప్రచారము కొరకు ఉపయోగకరమైన బడులు విశిష్టతను తెలిపే గీతాలు...⤵

Song_1

Song_2

Song_3

*💱మన ఊరు--మన బడి కార్యక్రమం షెడ్యుల్*💱

🌷24వ తేదీన అంగన్‌వాడీలలోని అర్హత గల పిల్లలుని మన స్కూల్లో 1వ తరగతిలో చేర్చాలి.

🌷25న ఐదో తరగతి పూర్తిచేసిన పిల్లలను UP, HS లలో 6వ తరగతిలో చేర్చాలి.

🌷26వ తేదీన 7,8 తరగతులు పూర్తిచేసుకున్న విద్యార్థులను గుర్తించి, వారిని 8, 9 తరగతుల్లోకి చేర్పి0చాలి.

🌷27న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకుగాను తల్లిదండ్రులకు అవగాహన కల్పి0చటానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలి.

🌷28వ తేదీన డ్రాప్ ఔట్, never enrolled పిల్లలుని గుర్తించి, వారిని స్కూళ్ళులో చేర్పించాలి.

🌷29న మురికివాడల్లో నివసిస్తూ బడికి దూరమవుతున్న విద్యార్థులను గుర్తి0చి స్కూళ్ళు లో చేర్పించాలి. ఇదేరోజు జ్ఞానధార కార్యక్రమ0 కోసం గుర్తించిన పిల్లలుని వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు వారిని పంపేలా చర్యలు తీసుకోవాలి.

🌷30వ తేదీన మనబడి--మన ఊరు కార్యక్రమం మొత్తం వివరాలు CSE వెబ్సైట్ లో అప్ లోడ్ చెయ్యాలి.

🌷23న ఉదయం 9 నుంచి 11 గంటల లోపు ఈ కార్యక్రమం ప్రారంభించాలి.

🌷24 నుంచి 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలి.

🌷ప్రతి రోజు HM, 1 అసిస్టెంట్ విద్యార్థులకి అడ్మిట్ కార్డు ఇవ్వటానికి ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉండాలి.

🌷ఈ కార్యక్రమం కోసం గ్రామంలోని అందరినీ involve చెయ్యాలి

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.