సర్వీసు రిజిస్టరు నిర్వహణ - అంశాలు
ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే సర్వీసు రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి అందులో ఏయే అంశాలను పొందుపరచాలి అను విషయంలో కొంత సమాచారం.
 ఫండమెంటల్ రూల్ 74కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 లో తెలియజేసిన పద్దతిలో సర్వీసు రిజిస్టరు నిర్వహించాలి.
(G.O.Ms.No.200 తేది:10-12-1999)
 మొదటిపేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు తండ్రి పేరు, నివాస స్థలం, జాతీయత, పాస్ పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే అటేస్టేషన్ చేయించాలి.
 భవిష్యత్లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
(G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)
 మొదటపేజీ నందు ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ నమోదుచేయాలి.
(G.O.Ms.No.80 తేది:19-3-2008)
 మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)
 ఉద్యోగి వైవాహిక వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేయాలి.
 సర్వీసు 2,3వ పేజీలలో ఉద్యోగి యొక్క వివరాలతో పాటు ఎత్తు,విద్యార్హతలు,సర్వీసులో చేరిన తర్వాత సంపాదించిన విద్యార్హతలు నమోదుచేయాలి.
 పదోన్నతి,ప్రమోషన్,ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం,పే ఫిక్సేషన్ తదితర వివరాలు నమోదుచేయాలి.
 ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(APLTC Rule.No.8 of clause (b)(i)
 ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(Govt.Memo.No.51073 తేది:19-12-2002)
 ఉద్యోగి గుణగణాలు, శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
 ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
(G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)
 NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.
(G.O.Ms.No.722 తేది:30-07-1966)
(G.O.Ms.No.391 తేది:07-11-1978)
 సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.
(Govt.Memo.No.72246 తేది:30-07-1966)
0 Comments
Please give your comments....!!!