*G.O MS No 16, 06.06.2018 తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు - 2018 ముఖ్యాంశాలు తెలుగు లో*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (పాఠశాల విద్యాశాఖ) జిఓ.ఎం.ఎస్.నెం.16 తేది:06.06.2018 ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలను విడుదల చేసింది.
అందులోని *ముఖ్యాంశాలు:*
👉బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే నిర్వహించబడతాయి.
👉పాత పది జిల్లాలు/ 2 జోన్లు యూనిట్ గా బదిలీలు నిర్వహిస్తారు
👉పాఠశాల విద్యాడైరెక్టరు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
👉కౌన్సెలింగ్ కమిటీ ఆమోదం మేరకు సంబంధిత నియామకపు అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.
👉2018 మే 31 నాటికి 2 సం|| నిండిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉2018 మే 31 నాటికి ఒకే స్టేషన్‌లో 5 సం|| సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉రిటైర్మెంటుకు 2 సం|| లోపు సర్వీసు కలిగిన వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.
👉బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 సం|| లోపు వయస్సుగల పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
👉బాలికోన్నత పాఠశాలలో పనిచేయటానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యం కాని సందర్భంలో 50 సం|| పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం కల్పిస్తారు.
👉ఎన్‌సిసి అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు (5 సం||, 8సం||) ఒక పాఠశాలలో పూర్తి అయితే మరొక ఎన్‌సిసి పాఠశాలకే బదిలీ చేయాలి.
👉బదిలీలు ప్రస్తుత యాజమాన్యంలో ఏజన్సీ నుండి ఏజన్సీకి, మైదాన ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికే చేయాలి.
*బదిలీకి అర్హతా పాయింట్లు*
🔹4వ కేటగిరి పాఠశాలలకు (12 శాతం ఇంటిఅద్దె పొందుతూ గ్రామానికి ఏ విధమైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) ప్రతి 1 సం|| సర్వీసుకు 5 పాయింట్లు
ప్రతి 1 నెల సర్వీసుకు 0.416 పాయింట్లు.
🔹3వ కేటగిరి పాఠశాలలకు (12 శాతం ఇంటిఅద్దె పొందుతూ రోడ్డు సౌకర్యం ఉన్న అన్ని గ్రామాలు)
ప్రతి 1 సం|| సర్వీసుకు 3 పాయింట్లు
ప్రతినెల సర్వీసుకు 0.25 పాయింట్లు.
🔹2వ కేటగిరి పాఠశాలలు (14.5 శాతం ఇంటిఅద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు)
ప్రతి 1 సం|| సర్వీసుకు 2 పాయింట్లు
ప్రతి 1 నెల సర్వీసుకు 0.16 పాయింట్లు.
🔹1వ కేటగిరి పాఠశాలలు
(20% ఆపైన హెచ్‌ఆర్‌ఎ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు)
ప్రతి 1 సం|| సర్వీసుకు 1 పాయింటు
ప్రతి 1 నెల సర్వీసుకు 0.083 పాయింట్లు.
పనిచేస్తున్న పాఠశాలల కేటగిరిని బట్టి ఉపాధ్యాయుల సర్వీసుకు అనుగుణంగా పై పాయింట్లు కేటాయిస్తారు.
🔹4వ కేటగిరి పాఠశాలల్ని జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు.
🔹ఉపాధ్యాయుల మొత్తం సర్వీసుకు ప్రతి ఒక నెల సర్వీసుకు 0.041 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.
*అదనపు పాయింట్లు :-*
♦రాష్ట్ర ప్రభుత్వం నుండి జిఓ నెం.515 జిఏడి తేది 16.03.2018 ద్వారా ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించబడిన ఉపాధ్యాయ సంఘాలు మరియు 2013 బదిలీల సందర్భంగా పాయింట్లు కెటాయించబడిన గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్రమరియు పాత 10 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్లు, అవివాహిత మహిళలకు 10 పాయింట్లు కేటాయిస్తారు.
♦భార్యా భర్తలిరువురిలో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు కేటాయిస్తారు. అయితే ప్రధానోపాధ్యాయులకు 5 సం|| ఒకసారి, ఇతర ఉపాధ్యాయులకు 8 సం|| ఒకసారి మాత్రమే వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. వారు ఇరువురు ఉపాధ్యాయులే అయితే ఒక్కరికి మాత్రమే పాయింట్లు కెటాయిస్తారు.
♦ఎస్‌ఎస్‌సిలో 100 శాతం ఫలితాలకు 2.5, 95%పైబడిన వారికి2, 90 నుండి 94 శాతం వరకు 1 పాయింట్లు ఉంటాయి.
*ప్రాధాన్యతా కేటగిరీలు*
🔸70 శాతం పైబడిన వికలాంగులు,
వితంతువులు, విడాకులు పొందిన మహిళలు,
ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి దీర్ఘరోగ పీడితులైతే,
మానసిక వైకల్యం, బ్లడ్ క్యాన్సర్, గుండెకు రంధ్రం, జువైనల్ డయాబిటీస్ వంటి వ్యాధులతో బాధపడే పిల్లల తల్లిదండ్రులకు, ప్రాధాన్యతా క్రమంలో కౌన్సెలింగ్‌లో ముందుగా బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాధాన్యతా బదిలీలు ప్రధానోపాధ్యాయులకు 5 సం||లకు ఒకసారి, ఉపాధ్యాయులకు 8 సం||లకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు.
పై వ్యాధుల పిల్లల తల్లి లేదా తండ్రి ఒక్కరు మాత్రమే ప్రాధాన్యతా బదిలీకి అర్హులు.
🔸పాఠశాలల కేటగిరీలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల జాబితాలు ముందుగానే ప్రకటిస్తారు. అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాలు ప్రకటిస్తారు.
🔸బదిలీ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.
*బదిలీల నిర్వహణ కొరకు కమిటీలు :-*
-ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీల కొరకు జోనల్ స్థాయిలో డిఎస్‌ఇ కార్యాలయం నుండి నియమించబడిన ఒక సీనియర్ అధికారి చైర్మన్‌గా, ఆర్‌జెడి మెంబర్ కన్వీనర్‌గా, సంబంధిత డిఇఓ సభ్యునిగా కమిటీ ఉంటుంది.
-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీల కొరకు జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ ఉపాధ్యక్షునిగా, జాయింట్ కలెక్టరు, జెడ్‌పిసిఇఓ సభ్యులుగా ఆర్‌జెడి లేదా ఆయనచే నియమింపబడిన వారు మెంబర్ కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు కలెక్టర్ చైర్మన్‌గా, జె.సి., సి.ఇ.ఓ. సభ్యులుగా, డిఇఓ కన్వీనర్‌గా కమిటీ ఉంటుంది.
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు జెడ్‌పి చైర్మన్ చైర్మన్‌గా, కలెక్టర్ ఉపాధ్యక్షునిగా, జె.సి., సిఇఓ, సభ్యులుగా, డిఇఓ కార్యదర్శిగా ఉన్న కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది.
-బదిలీ అయిన వెంటనే ఉపాధ్యాయులకు వ్యక్తి గతంగా ఉత్తర్వులు అందజేయాలి.
*-ఒకే గ్రామ పంచాయతీలో గరిష్ట సర్వీసు (5/8) నిండిన వారిని తిరిగి అదే గ్రామ పంచాయతీలో బదిలీకి అవకాశం లేదు.*
ఒకసారి అయిన బదిలీని మార్చటానికి వీలులేదు.
*తప్పనిసరి బదిలీలో ఉండి బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీలలో బదిలీ చేస్తారు.*
-బదిలీ ఉత్తర్వులన్నీ నోటీస్ బోర్డుపైన, ఆన్‌లైన్‌లోనూ ప్రదర్శించాలి.
-బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే రిలీవై కొత్త పాఠశాలలో మరుసటిరోజే చేరిపోవాలి.
-బదిలీలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను అప్పీలేట్ అధికారికి 10/15 రోజులలోగా పంపుకోవచ్చు. వారు రికార్డులు పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తారు.
-బదిలీల కొరకు తప్పుడు సమాచారం సమర్పించిన, నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులు, అధికారులపై సిసిఎ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
జి.ఓ. 16 ద్వారా ఇచ్చిన బదిలీ నిబంధనలు ఒకటి, రెండు మినహా అన్నీ 2015లో జి.ఓ. నెం.12 ద్వారా విడుదల చేసిన నిబంధనలే.
👉జూన్ 7 నుండి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉షెడ్యూల్ మరియు
వెబ్ కౌన్సెలింగ్ మార్గదర్శకాలు 7వ తేదీ మధ్యాహ్నం వెలువడనున్నాయి.
Please give your comments....!!!