Type Here to Get Search Results !

*డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము - MOCK TESTS*

*డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము - MOCK TEST*

*అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి.

* పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి.

* రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు.

*మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి.

*10 నిమిషాల ముందు మీరు "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది.

*లాగిన్ ఐడి = రోల్ నంబర్ (మీ హాల్ టికెట్ నెంబర్).

*పాస్ వర్డ్ = పరీక్ష రోజు మాత్రమే ఇవ్వబడుతుంది.

*ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.

*ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును.

*లాగిన్ అయిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm పై క్లిక్ చేయాలి.

* Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.

* ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి మౌస్ ను మాత్రమే వాడాలి.

*ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో అది సూచిస్తుంది.

*మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది.

White (Square) - మీరు ప్రయత్నించని ప్రశ్నలు.
Red(Inverted Pentagon) - మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు.
Green (Pentagon) - మీరు జావాబులు పూర్తి చేసిన ప్రశ్నలు.
Violet (Circle) - ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు ( marked for Review).
Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించారు కాని Review కొరకు మార్క్ చేశారు.

*ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.

*Review & Next బటన్ నొక్కిన ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది.

*ఒక ప్రశ్నకు జవాబు తీసేయాలని అనుకుంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి.

*SECTION NAME పై కర్సర్ ను ఉంచిన ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .

*ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఎంపిక చేసుకొని పెద్దవిగా చూడవచ్చు.

 

*PWD అభ్యర్ధులకు 120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది.

*ఏ విధంగానైనా system log out అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.

*ప్రతీ తప్పు జవాబుకు మైనస్ మార్కులు ఉంటాయి. గుర్తుంచుకోండి.

* పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది దానిపై లాగిన్ ఐడి , పాస్ వర్డ్ రాయాలి.

*ఎట్టి పరిస్థితిలో key board ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.

*డిపార్టుమెంటు పరీక్షల మాక్ టెస్ట్(మాదిరి పరీక్షలు) ల కొరకై కింది లింక్ ఓపన్ చేయండి*

Mock_Test

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Recent Posts