Type Here to Get Search Results !

Income Tax E Filing, Procedure In Telugu text, Telugu Video, Step by step process with Direct Liks

Income Tax E Filing, Procedure In Telugu text, Telugu Video, Step by step process, Direct Liks
*మిత్రులారా ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ ను మీ మొబైల్లోనే చేయవచ్చు...తెలుసా...అదెలాగో చూద్దాం..*
ఇన్ కమ్ టాక్స్ 2017-18 నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు తమ ఆదాయానికి సంబంధించినటువంటి రిటర్న్స్ ను ఇన్కంటాక్స్ వెబ్ సైట్ నందు సమర్పించాల్సి ఉంటుంది. కావున ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇన్ కం టాక్స్ రిటర్న్స్ సమర్పించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని తయారుచేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రిటర్న్స్ ఇప్పుడే ఆన్లైన్లో సబ్మిట్ చేయండి.
సబ్మిట్ చేసే ముందు మీరు ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోవలసిన విషయాలు
●మీ పాన్ అకౌంట్ నెంబరు
●మీ ఆధార్ కార్డ్ నెంబరు
●పుట్టిన తేదీ
●మీ మొబైల్ నెంబర్
●మీ ఈమెయిల్ ఐడి
●అడ్రస్
●బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
వీటితోపాటుగా మీరు మీ ఆధార్ నెంబర్కు మీ వ్యక్తిగత మొబైల్ నెంబర్ను అనుసంధానం చేసుకుంటే ఈ వెరిఫికేషన్ త్వరగా పూర్తవుతుంది. లేనట్లయితే రిటర్న్స్ సబ్మిట్ చేసిన తరువాత ప్రింట్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా ఇన్కమ్ టాక్స్ కార్యాలయం బెంగుళూరుకు పంపాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ ను లింక్ చేయడానికిగాను మీ సమీప ఆధార్ మార్పులు చేర్పులు చేసే సెంటర్ని సంప్రదించండి ఇలా ఆధార్ కు మొబైల్ నెంబర్ ను చేయలేని పక్షంలో కనీసం ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయం అయినా మీ అకౌంట్ కు కలిగి ఉండాలి వివరాలకు ఈ వీడియో చూడండి.

*_e-filing ఆంటే ?_*
*electronic file*
భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిభందనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file
         
e-filing ను Pan No తో Register చేసుకోవాలి.
రిజిష్టర్ చేసుకోవడం కోసం క్రింద క్లిక్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు సంస్ధలు, వ్యక్తులు  e-filing   ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక సాదనం.
*_ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:_*
*_పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు జులై 31 లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది
*_ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి_*.
*_దాఖలు చేయవలసిన విధానం:
*_వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి_.*
*_ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం._*
*_పేరు రిజిస్టర్ చేసుకొనుట:
Register ఇక్కడ క్లిక్ చేయండి. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి
*_ఫారం 26 AS:
*_ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. ఇక్కడ VIEW FORM 26
క్లిక్ చేయండి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి._*
*_ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:_*
ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది
*_ఇ- ఫైలింగ్ చేయడం:_*
*_ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి._*
*_PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు._
*_అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత, ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
*తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
*ఎకనాలెడ్జ్మెంట్:*
*ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి.  ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.
తక్షణ పాన్ కార్డు కోసం క్రింద క్లిక్ చేయండి
PAN CARD Download
PAN కార్డ్ కు ఆధార్ లింక్ చేయడం కోసం క్రింద క్లిక్ చేయండి
మీ పాన్ కార్డు నంబర్ మర్చిపోయారా ???
ఈ క్రింద క్లిక్ చేసి పాన్ కార్డు నంబర్  వివరాలు తెలుసుకోండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night