*ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ అఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్షా హైదరాబాద్ విజయ్ కుమార్ గారి ఉత్తర్వులు*
TS Proc.Rc.No.3825/TSS/T6 DT 22/10/2018 Guidelines for Supply and Distribution of CCE Records, Registers and progress cards
ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులకు తెలియజేయు సమాచారం ఏమిటనగా ప్రింటింగ్ పూర్తయిన నూతన CCE.. నిరంతర సమగ్ర మూల్యాంకనం రిజిస్టర్స్, రికార్డ్స్ అన్ని జిల్లాల విద్యాధికారుల కు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ textbooks ప్రెస్ ద్వారా 22/10/2018 నుండి పంపిణీ చేయబడును.
CCE రికార్డులు మరియు రిజిస్టర్స్ ఒకటి మరియు ఆరవ తరగతి తరగతులకు మాత్రమే UDISE 2017-18 ప్రకారము నమోదైన విద్యార్థుల సంఖ్య కనుగుణంగా మరియు 10% ఎక్కువగా ప్రింట్ చేయబడ్డాయి.
అన్ని జిల్లాల విద్యాధికారులు కింది సూచనలు పాటించాలి
1) ANNEXURE I ప్రకారము జిల్లా విద్యాధికారులు వారి కందిన CCE రికార్డ్స్ రిజిస్టర్స్ వివరాలను తెలియజేయాలి
2) రికార్డ్సు మరియు రిజిస్టర్ లు జిల్లా డి పి ఓ లకు చేరును. లోడింగ్,అన్లోడింగ్ చార్జీలు వారే భరిస్తారు
3) అన్ని పాఠశాల విద్యార్థులకు CCE రిజిస్టర్లు అందేలా ఎంఈవోలకు, సిఆర్పి లకు తగిన సూచనలు ఇవ్వాలి
4) ఎవరైనా పాఠశాలలో ఒకటో తరగతి మరియు ఆరో తరగతి కాకుండా వేరే తరగతిలో నూతనంగా అడ్మిషన్ పొందితే వారిని తమ పాత పాఠశాల నుండి CCE రిజిస్టర్ తీసుకురమ్మని ఆ విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు తెలియ చేయాలి
పాఠశాలలకు క్రింది రికార్డ్స్ అందజేస్తారు
1) క్యుములేటివ్ రికార్డ్స్ ..విద్యార్థికి ఒకటి చొప్పున ఒకటవ మరియు ఆరవ తరగతికి మాత్రమే అందజేయబడును
2)CCE ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్టర్లు..50 పేజీ లు..PS-5 మరియు UPS-5 అందజేయబడును
3)CCE ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్టర్స్..100 పేజీలు..HS-5 మరియు UPS-2 ఇవ్వబడును
4) సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్..50 పేజీలు.. ప్రతి ప్రాథమిక పాఠశాలకు 1
5) సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్..50 పేజీలు.. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు 1
6) సెంట్రల్ మాక్స్ రిజిస్టర్.. వంద పేజీలు.. ప్రతి ఉన్నత పాఠశాలకు 1 అందజేయబడును
జిల్లా విద్యాధికారులు ఎక్స్ అఫిషియో DPO డెలివరీ చాలాన్ను జిల్లా విద్యాధికారి ధృవీకరణతో వారికి అంద చేయబడిన రిజిస్టర్స్ రికార్డ్స్ వివరాలను 15/11/2018 లోగా DSE హైదరాబాద్ కి పంపించాలి
ఈ ఉత్తర్వుల తో పాటు జతపరచబడిన ANNEXURE లో జిల్లాల వారీగా పంపిన రిజిస్టర్ల, రికార్డుల వివరాలు కలవు.
Please give your comments....!!!