*🌻సందేహం--సమాధానం🌻*
📚ప్రశ్న:
*మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?*
✍జవాబు:
పింఛనులో బేసిక్, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది.కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు.ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.
🍏🍏🚶
📚ప్రశ్న:
*నేను డిగ్రీలో జువాలజీ, డైరి సైన్స్ మరియు కెమిస్ట్రీ మరియు బిఇడిలో బయాలజీ, తెలుగు మెథడాలజీలను కలిగి ఉన్నాను.నేను స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) ప్రమోషన్ కు అర్హుడనేనా?*
✍జవాబు:
జిఓఎంఎస్ నం.12 విద్య; తేది.23.01.2009 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) గా పదోన్నతి పొందాలంటే డిగ్రీలో బోటనీ మరియు జువాలజీ చదివి ఉండాలి.
🍏🍏🚶
📚ప్రశ్న:
*నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను. మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది.మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది.మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు.వాస్తవమేనా?*
✍జవాబు:
మొదటి ఇద్దరి పిల్లలకు శిశు సంరక్షణ సెలవు వాడుకోవాలనేది పే కమీషన్ రికమండేషన్ మాత్రమే.ఆ విషయం మాత్రమే జి.ఓ.132; తేది.06.07.216 పేర్కొనడం జరిగింది.కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు.ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది.కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వవచ్చు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments
Please give your comments....!!!