Guruvu.In

GP ELECTIONS USEFUL FORM for POs Hand Copy in One Page General Instructions in Telugu

GP ELECTIONS USEFUL FORM for POs Hand Copy in One Page

Download

🌷🌲గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి phase-I, Phase-II, Phase-III లలో ప్రిసైడింగ్ అధికారులు (P.O's) గా నియమింపబడిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.💐💐🙏🏻🙏🏻🌲🌷💐🌲🌿💐💐

🌲మీరు గతంలో ఎన్నికల్లో PO's గా విధులు నిర్వహించిన అనుభవం ఉండవచ్చు లేదా ఇదే మొదటిసారి కావచ్చు... మీకు ఇందులో ఏదైనా ఒక అంశం అయ్యినా ఉపయోగపడుతుంది అనే ఆశతో మాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన అంశాలు సూచించనైనది.

👉🏻 ముందుగా మీకు  అలాట్ చేయబడిన మండలమునకు సూచించిన తేదీన సరియైన సమయానికి తప్పక వెళ్ళాలి.
👉🏻అక్కడ Attendance Counter నందు మీరు signature మరచిపోకుండా చేయాలి.

👉🏻 మీకు కేటాయించిన గ్రామపంచాయతీ పేరు, పోలింగ్ స్టేషన్ నంబరు, మరియు మీకు కేటాయించిన వార్డు నంబర్, ఓటర్ల సంఖ్య గల వివరాలు తెలుసుకోవాలి.

👉🏻 మీ గ్రా.పం. కి సంబంధించిన counter నందు సర్పంచ్ మరియు వార్డుకు సంబంచిన marked copy (ఓటరు జాబితా) తీసుకొని పరిశీలించవలెను.

👉🏻 Special counter నందు 1) Ballot papers (pink colour of Sarpanches)& (white colour of Ward Member).
2) Paper seals,
3) Address Tags,
4) Distinguished Mark seal, etc., సీరియల్ నంబర్స్ తప్పక సరిచూసుకొని తీసుకోవాలి.

👉🏻 మరొక కౌంటర్ నందు పోలింగ్ మెటీరియల్ (బ్యాలట్ బాక్స్ లు,ఓటరు లిస్టు మార్కుడ్ కాపీ, స్టేషనరీ etc.,) తీసుకోవాలి. వెంటనే check list ప్రకారం పరిశీలించు కోవాలి.

👉🏻మీకు కేటాయించిన Route Bus లో మీ పోలింగ్ క్లర్క్/అసిస్టెంట్ (OPO)తో సహా మీ గ్రామపంచాయతీ కి ఎన్నికల సామాగ్రి తో  వెళ్ళాలి.

👉🏻సాయంత్రం మీకు కేటాయించిన పోలింగ్ బూత్ కంపార్టుబుల్ గా ఉందొ లేదో చూసుకోవాలి.

👉🏻మీకు అందజేసిన బ్యాలెట్ పేపర్స్ వెనుక భాగంలో  counter file మీద మరియు బ్యాలెట్ పేపర్ మీద Distinguished Mark seal ఖచ్చితంగా వెయ్యాలి.

Ballot paper మీద ప్రిసైడింగ్ అధికారి (PO) సంతకం అవసరం లేదు. బ్యాలెట్ పేపర్ పై మాత్రం తప్పక చేయాలి.

👉🏻 ఒక చిన్న నోట్ బుక్ లో మీకు ఇచ్చిన (01) బ్యాలెట్ పేపర్స్ సీరియల్ నంబర్స్ (02)  పేపర్ సీల్ సీరియల్ నంబర్స్ నోట్ చేసుకోవాలి.

👉🏻 మరుసటిరోజు తెల్లవారు జామున (పోలింగ్ రోజు) 6.30 గం. లకు పోలింగ్ ఏజెంట్స్ మీ దగ్గరకు వస్తారు. P.O. Declaration form లో వారి సంతకాలు తీసుకోవాలి.

👉🏻ఖాళీ బ్యాలెట్ బాక్స్ ఏజెంట్స్ కు చూపించి,ఒక address tag (PO & ఏజెంట్స్ సంతకాలు దాని మీద చేసిన) అందులో వెయ్యాలి.

👉🏻బ్యాలెట్ బాక్స్ మూత కు లోపలి భాగంలో ఒక పేపర్ సీల్   PO & AGENTS సంతకాలు చేసినది లోపలి భాగంలో వచ్చునట్టు జాగ్రత్తగా చూసి,బ్యాలెట్ బాక్స్ మూసివేయాలి. మరొక address tag జోడించి లక్కతో సీల్ వెయ్యాలి. బ్యాలెట్ బాక్స్ కు ఒక అడ్రస్ లేబుల్ అతికించాలి.

👉🏻ఖచ్చితంగా పోలింగ్ సమయం 7.00 గంటల కు పోలింగ్ ప్రారంభించాలి

👉🏻ఓటింగ్ కంపార్టుమెంట్ లో ఇంక్ ప్యాడ్స్ లేదా స్వస్తిక్ మార్క్ ఉన్న సీల్ గాని ఏదేని ఉండకూడదు.కేవలం ఒక టేబుల్ మాత్రం ఉండాలి.
👉🏻 పోలింగ్ బూత్ నందు వాటర్ బాటిల్స్ కానీ రాళ్లు గాని మరేదైనా మా రణాయుధాలు గాని లేకుండా జాగ్రత్తగా చూడండి.

👉🏻స్సర్పంచ్ అభ్యర్థి కి ఏజెంట్ గా ఉండేవారు ఆ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓటరై ఉండాలి. కానీ వార్డు మెంబర్ అభ్యర్థి కి ఏజెంటుగా ఉండేవారు మీకు కేటాయించిన  వార్డు లోని ఓటరై ఉండాలి.

👉🏻Tender Votes ఎట్టి పరిస్థితి లో రాకుండా చూసుకోండి. ఒక టెండర్ ఓటు మీ పోలింగ్ బూత్ లో పడిన పోలింగ్ రద్దు(cancel) అయ్యే ప్రమాదం ఉంది.

👉🏻ఓటర్ ఎడమచేతి మధ్య వ్రేలు (middle finger) కు ఇంకు పెట్టాలి.

👉🏻🌷🌷ఓటర్లకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లు బాక్స్ లో బాక్స్ లో పడుతున్నాయో లేదో జాగ్రత్తగా గమనించాలి. బ్యాలెట్ బాక్స్ లు మీ టేబుల్స్ దగ్గర పెట్టుకోవడం మంచిది.

👉🏻 మరియు పోలింగ్ మధ్యాహ్నం 1.00 గంటలకు ముగించాలి.పోలింగ్ ముగిసిన తర్వాత, పోలింగ్ ముగిసినట్టుగా ఏజెంట్స్ తో మరోసారి మరచిపోకుండా P.O.Decleration లో సంతకాలు చేయించాలి.

👉🏻బ్యాలెట్ బాక్స్ పై address tag తొలగించి బ్యాలెట్ బాక్స్ ను టోటల్ క్లోజ్ చేసి తిరిగి అడ్రస్ ట్యాగ్ బిగించి లక్కతో సీల్ వెయ్యాలి.

👉🏻🌷🌷మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఇట్టి బాక్స్ లను సంబంధిత Returning Officer or Stage-II Officer కు అప్పగించాలి. ఆ తర్వాతే భోజనం కు వెళ్ళాలి. ఇది ముఖ్యం.

👉🏻Sarpanch కు Ward Member కు విడి విడిగా బ్యాలెట్ పేపర్ అక్కౌంట్ నింపాలి.

2.00 గంటల అనంతరం మీ Stage-II/Returning Officer   గారి ఆధీనంలో వార్డుల వారీగా కౌంటింగు చేసి రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది.

👉🏻మీకు కేటాయించిన రూట్ బస్ లో తిరిగి మండల కేంద్ర రిసివింగ్ సెంటరుకు వస్తారు.

👉🏻🌷🌷PO's ముఖ్యంగా ప్రత్యేక కౌంటర్ నందు అందజేయవల్సిన నమూనాలు:--
1)P.O.Dairy (02 copies)
2) P.O.Decleration form
    (పోలింగ్ ప్రారంభించడానికి ముందు,మరియు ముగించిన తర్వాత ఏజెంట్స్ తో సంతకాలు తీసుకున్న నమూనా)
3) Paper seal account
4) Ballot paper account
   (సర్పంచ్ కు వార్డు మెంబరుకు విడి విడిగా ఒక్కొక్కటిగా రెండు కాపీలు)
5) సందర్శన పత్రం.
ఈ (05)ఫారములు Brown colour cover లో పెట్టి సీల్ చేయకుండా సమర్పించాలి. మరచిపోకుండా రశీదు తీసుకోవాలి.

👉🏻 మిగతా పోలింగ్ మెటీరియల్ సంబంధిత కౌంటర్ లో ఇవ్వాలి.
👉🏻 ఇక మీ "ఎన్నికల విధి నిర్వహణ" పూర్తి అయ్యినట్టు..👏👏👏🌹🌹🌲🌹🌹👏👏👏

👍👍ఎన్నికల విధి నిర్వహణ లో అలసత్వం లేకుండా నూతనోత్సాహంతో పనిచేయాలని ప్రోత్సహిస్తూ "గ్రామ పంచాయితీ సాధారణ ఎన్నికల్లో భాగంగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల అందరికి,ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు  "" గ్రా మ పం చా య తి ఎ న్ని క ల శు భా కాం క్ష లు"" తెలియ జేస్తున్నాము.
🙏🏻🙏🏻🙏🏻💐💐🌷💐💐

🙏🏻🙏🏻🙏🏻🌿🌿🌷🌲🌲

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts