*2018 -19 UDISE నమోదు చేయుట కు సూచనలు...*
👉మండల విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో ప్రభుత్వ ప్రవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు UDISE DCF నింపడానికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలి.
మండల స్థాయి మీటింగ్ కు ముందే DCF ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి.
మండల స్థాయి మీటింగ్ ను ఆన్లైన్ లో ఒక్కొక్క ఫీల్డ్ చూపిస్తూ సాధ్యమైనంత వరకు ఆమీటింగ్లోనే DCF లో మార్పులు.. చేయించాలి.(అవసరమైన చోట).
MEO గారి ద్వారా మండలంలో అన్ని స్కూళ్ళ డేటా నమోదుకు టైం టేబుల్ ఇవ్వాలి.
ఎంఎస్ కోఆర్డినేటర్లు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రధానోపాధ్యాయులకు DCF పై పూర్తిగా అవగాహన కల్పించాలి.
డైనమిక్ అంశాలను DCF యొక్క లైవ్ ఫార్మాట్ ద్వారా వివరించాలి.
మండలంలోని ఎంఎస్ కోఆర్డినేటర్లు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లు కేటాయించిన సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సమక్షంలోనే UDISE ఆన్లైన్ నందు నమోదు చేయాలి .
పూర్తి చేసిన తర్వాత ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు మరియు సంబంధం MIS/DEO ఆ DCF పై సంతకం చేయాలి.
మండల విద్యాశాఖ అధికారులు తర్వాత సంతకం చేయాలి.
ఎంఈఓ గారు మొత్తం DCF లలో 20 శాతం ను వెరిఫికేషన్ చేయాలి.
అలాగే ప్రతి డి.ఎల్.యం.టి వారి కేటాయించవివరాలుల్లోని UDISE 2018 డేటా ఎంట్రీ కు సంబంధించి ప్రతి రోజు ఒక మండలం సందర్శించి DCF లను నమోదు చేసే అంశాలను CRP లతో కలిసి సమన్వయం చేసుకొని MEO , MIS, DEO లకు సహకరించాలి ,డే వైస్ రిపోర్ట్ ను MIS సెక్షన్(DPO) కు అందచేయాలి .
డి.ఎల్.యం.టి వారికి కేటాయించిన మండలాల్లోని ప్రతి రోజు మోనిటరింగ్ చేసుకొని రాష్ట్ర కార్యాలయం ఇచ్చిన సమయం లోనే UDISE 2018 -19 పూర్తి అయ్యే లాగ కృషి చేయాలి.
CRP లు తమ కాంప్లెక్స్ పరిధి లోని ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని MEO గారు ఇచ్చిన సమయం లో MEO ఆఫీస్ లో హాజరు అయి UDISE నమోదు చేసుకునేలా కృషి చేయాలి.
ఆన్లైన్లో ముందుగా నమోదు చేయాలనే ఆతృతతో కాకుండా, తగు జాగ్రత్తలు తీసుకుని, తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారంను నిర్దేశించిన సమయానుసారం సకాలంలో , చక్కటి ప్రణాళికతో, పూర్తిచేయాలి.
ఆన్లైన్లో సమాచారాన్ని ముందుగా పూర్తీ చేయాలనే లక్ష్యముతో కాకుండా, ఖచ్చితమైన సమాచారాన్ని నింపడమే లక్ష్యంగా రాష్ట్ర అధికారులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారము పూర్తీ చేయుటకు ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి.
ప్రతి మండలము లో MIS/DEO మాత్రమె డేటా నమోదు చేయాలి.
CRP లు ఆన్లైన్ లో UDISE డేటా నమోదు చేయరాదు.
ఏ మండలము లో నైన MIS /DEO అవసరం అయితే జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయము ను సంప్రదించాలి .
IMPORTANT INSTRUCTIONS FOR FILLING THE SCHOOL PROFILE DATA FORM
A.SCHOOL PROFILE - PART A
పాఠశాలకు సంబందించిన ప్రాథమిక సమాచారాన్ని అనగా పాఠశాల పేరు, చిరునామా, ప్రధానోపాధ్యాయుని చరవాణి సంఖ్య, పాఠశాల కేటగిరి అనగా (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల) తరగతి వారీగా సెక్షనుల సంఖ్య, పాఠశాల స్థాపించిన సంవత్సరం, పాఠశాలలో బోధించే మాధ్యమం, పాఠశాల భౌగోళిక సూచికలు (Geographical Information –Latitude-Longitude) తదితర 35 అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
A(I).School Profile - Part B.
ఇందులో ప్రి ప్రైపరి పాఠశాలలు అనగా అంగన్వాడి పాఠశాలల వివరాలు నమోదుచేయాలి. అనగా పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడి పాఠశాలలు ఉన్నాయా లేదా. ఒకవేళ పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడిలు ఉంటే ఎంతమంది పిల్లలు నమోదు అయినారు వంటి వివరాలు నమోదు చేయాలి
A(II).SMC & SMDC(RTE)
ఈ ట్యాబ్ నందు మనము ఈ క్రింది విషయాలను నమోదు చేస్తాము
పాఠశాల యొక్క పనిదినములు (గత విద్యాసంవత్సరంనకు చెందినది)
సరాసరి పనిగంటలు (ఉపాధ్యాయులు)
సరాసరి పనిగంటలు (విద్యార్థులు)
పాఠశాలలో CCE (Continuous and Comprehensive evaluation) అమలు జరుగుతోందా లేదా?
ఒకవేళ సీసీఈ అమలులో ఉంటే వాటికి సంబందించిన రికార్డులు వాడుతున్నారా లేదా?
పాఠశాల యందు పాఠశాల యాజమాన్య కమిటీ (School Management Committee) ఏర్పడినదా లేదా?
School Management Committee ఉన్నట్లైతే సభ్యుల వివరాలు నమోదు చేయాలి.
School Management Committee ఎన్నిసార్లు సమావేశం నిర్వహించారు.
School Management Committee యొక్క భవిషత్ ప్రణాళిక రచిస్తున్నారా లేదా?
School Management Committee యొక్క బ్యాంకు అకౌంట్ ఉందా లేదా? ఉంటే వాటి వివరాలు నమోదు చేయాలి.
విద్యార్థలు ఏవేని ప్రత్యేక శిక్షణా తరగతులు పోందినారా లేదా?
విద్యాసంవత్సరం ప్రారంభ వివరాలు నమోదు చేయాలి.
పాఠ్యపుస్తకాల వివరాలు నమోదు చేయాలి.
ఎం.ఈ.ఓ/కాంప్లెక్సు చైర్మెన్/పైఅధికారులు పాఠశాల సందర్శన వివరాలు నమోదు చేయాలి.
B(I). Infrastructural Details
పాఠశాల భౌతిక వివరాలు ; పాఠశాల భవనం, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటి వివరాలు నమోదు చేయాలి.
పాఠశాల భవన స్థితి :
ఇందులో పాఠశాల భవనం సోంత భవనమా లేక అద్దేకు వాడుతున్నారా, మొత్తం ఎన్ని తరగతి గదులు ఉన్నాయి, అందులో ఎన్ని తరగతి గదులు పూర్తిస్తాయిలో వాడుతున్నారు. ఎన్ని తరగతి గదులు ఇంకా కట్టడం పనుల్లో ఉన్నాయి (under Construction). తరగతి గదుల స్థితి అనగా మైనర్ రిపేరిలు ఎన్ని, మేజర్ రిపేరిలు ఎన్ని, పడిపోవడానికి సిద్దంగా (Dipliated construction) ఉన్న గదుల వివరాలను నమోదు చేయాలి.
Toilets and urinals details :
మరుగుదొడ్లు మరియు అందలి యూరినల్స్ వివరలను నమోదు చేయవలెను.
త్రాగునీటి సౌకర్యం వివరాలు : త్రాగునీరు సౌలభ్యం ఏ విధంగా పాఠశాలకు అందుతోంది మరియు త్రాగునీరు శుద్ది యంత్రాలు అందుబాటులో ఉన్నాయా లేదా? వంటి వివరాలు నమోదు చేయాలి.
పాఠశాలకు ఎలక్ర్టిసిటీ సౌలభ్యం ఉందా లేదా?
పాఠశాలలో లైబ్రరీ సౌకర్య ఉందా ఉంటే ఎన్ని పుస్తాకలు ఉన్నాయి వాటి సంఖ్య
పాఠశాలలో ఆట స్థలం ఉందా ?
పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నాయా ఉంటే ఎన్ని పనిచేస్తున్నాయి. ?
పాఠశాలలో Computer Aided Learning (CAL) ల్యాంబ్ ఉన్నాదా?
పాఠశాలలో smart classroom సౌకర్యం కలిగియున్నాదా లేదా
పాఠశాలలో ఇంటర్నెట్ కలిగియున్నదా లేదా?
పాఠశాలలో గత విద్యాసంవత్సరలో మెడికల్ చెకప్ కార్యక్రమం జరగినదా లేదా
పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ర్యాంప్ సౌకర్యం ఉందా లేదా
పాఠశాలలో సైన్సుకిట్, గణితకిట్, ఆడియో/విడియో సిస్టంలు ఉన్నాయా లేదా
పాఠశాలలో బయోమెట్రిక్ పరికరం ఉన్నదా లేదా
V.Additional Variables on Hygiene Facilities & Health Practices
Sanitation Facilities
పాఠశాలలో గల మరుగుదొడ్ల వివరాలు ఇక్కడ నమోదు చేయావలసి ఉంది. అది కూడా అమ్మాయిల మరుగుదొడ్లు మరియు అబ్బాయిల మరుగుదొడ్లు వివరాలను ప్రత్యేకంగా నమోదుచేయాలి
Cleaning of Toilets:
పాఠశాలలో మరుగుదొడ్లు ఉంటే వాటిని ఎవరిచే శుభ్రపరుస్తారు. ఈ మరుగుదొడ్ల పరిశుభ్రత చర్యలను ఎవరు మనిటరింగ్ చేస్తారు. మరుగుదొడ్లను ఎన్నిరోజులకు ఒకసారి శుభ్రపరుస్తారు వగైరా వివరాలను నమోదుచేయవలెను.
School Maintenance:
ఇందులో పాఠశాలలలో గల Maintenance సంబందించిన అంశాలను నమోదు చేయాలి అనగా
పాఠశాల గోడలకు లేదా సీలింగ్ (పైకప్పుకు) ఏవేని చీలికలు ఉన్నాయా?
పాఠశాలలో ఏవేని చెదలు కనిపించాయా లేదా?
పాఠశాలలో గల కిటికీలు, తలుపులకు ఏవేని మైనర్ రిపేరిలు అనగా గడులు, చిలకలు ఏర్పాటుచేయాలా
టాయిలెట్ మ్యాన్‌హోల్‌నకు పైకప్పు సరిగా ఉన్నదా లేదా?
పాఠశాలలో గల ఫస్ట్ ఎయిడ్ పెట్టి నందు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనగా ఏవేని సమయం మించిపోయిన మందులు ఉన్నాయా లేదా వంటి వివరాలను నమోదుచేయాలి.
V.Additional Variables on Hygiene Facilities & Health Practices
Solid waste management practices:
ఇందలో చెత్తబుట్ట వివరాలు నమోదుచేయాలి అంటే పాఠశాలలో ప్రతీ తరగతి గదికి చెత్తబుట్ట ఉన్నదా లేదా వంటివి.
Water safety and security:
పాఠశాలకు త్రాగునీటి ఏవిధంగా సరఫరా అవుతోంది. ఒకవేళ ఓవర్‌హెడ్ ట్యాంకు నుండి అయితే ఆ ట్యాంకును ఎన్ని రోజుకు ఒకసారి శుభ్రపరుస్తారు. ఆ త్రాటునీటిని పరిక్షిస్తారా లేదా వంటి వివరాలు నమోదు చేయాలి.
Hand washing facilities
పిల్లలు భోజనానికి ముందు మరియు భోజన తర్వాత చేతులను శుభ్రపరుకుంటున్నారా లేదా? పాఠశాలలో హ్యండ్ వాష్ సౌకర్యం ఉందా లేదా ? పిల్లలు చేతులను శుభ్రపరుచుకున్న తర్వాత ఆ నీరు ఏవిధంగా పాఠశాల నుండి బయటకు వెళుతోంది. వంటి వివరాలు నమోదు చేయాలి
VII.School Health :G. School Health :
ఇందులో పాఠశాల మధ్యాహ్న భోజనంకు సంబందించిన వివరాలు నమోదు చేయాలి
పాఠశాలకు బియ్యం సరఫరా చేయు FP SHOP (స్టోర్ డిలర్) పేరు FP SHOP (స్టోర్ డిలర్) కోడు వివరాలు నమోదు చేయాలి.
మధ్యహ్న భోజన సమయంలో ఎండిఎం ఏజెన్సీ మరియు హెల్పర్ వారు వంటచేయు సమయంలో సరియైన జాగ్రత్తలు అనగా చెతికి గ్లౌజులు, తలకు క్యాప్ వంటి వాటిని వాడుతున్నారా లేదా వంటి వివరాలు నమోదు చేయాలి.
పిల్లలు భోజనానికి ముందు తర్వాత చేతులను శుభ్రపరుచుకుంటున్నారా లేదా? వంటి వివరాలను నమోదు చేయాలి.
H. SCHOOL HEALTH (RBSK-RKSK)
ఇందులో ఈ క్రింది వివరాలు నమోదుచేయాలి
1. Details of the institution coordinator
పాఠశాల ఆరోగ్య కోఆర్డినేటర్ వివరాలు నమోదుచేయాలి.
2. Details of the Health coordinator from Health Dept.
అంటే ANM వివరాలు నమోదుచేయాలి.
WHETHER TEACHERS TRAINED ON FOLLOWING.
పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులకు శానిటేషన్ పై ఏవేని స్పెషల్ ట్రైనింగ్ పోందినట్లైతే వాటి వివరాలను నమోదుచేయాలి.
H. SCHOOL HEALTH (RBSK-RKSK)
ఇందులో పాఠశాల మధ్యాహ్న భోజనమునకు సంబందించిన వివరములు నమోదు చేయాలి.
1. పాఠశాలకు బియ్యము సరఫరాచేయు FPShop(రేషన్ డీలర్) పేరు FPShop (రేషన్ డీలర్ )కోడ్ వివరములు నమోదు చేయాలి.
2. మధ్యాహ్న భోజన సమయం లో MDM Agency మరియు హెల్పర్ వారు వంట చేయు సమయములో సరైనా జాగర్తలు అనగా చేతికి గ్లౌజులు ,తలకు కాప్లు వంటివి వాడుతున్నార లేదా వంటి వివరములు నమోదు చేయాలి.
3. విద్యార్దులు భోజనమునకు ముందు తర్వాత చేతులు శుబ్ర పరుచు కుంటున్నారా లేదా? వివరములు నమోదు చేయాలి.
G. RBSK/RKSK : ఇందులో ఈ క్రింద వివరములు నమోదు చేయాలి.
1. Details of the Instruction Coordinator
పాఠశాల ఆరోగ్య కో-ఆర్దినేటర్ వివరాలు నమోదు చేయాలి.
2. Details of the Health coordinator from Health Dept
అంటే ANM వివరాలు నమోదు చేయాలి.
3. Whether Teacher trained on following
పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయులకు శానిటేషన్ పై ఏవేని స్పెషల్ ట్రైనింగ్ పొంది వున్నట్లు అయితే వాటి వివరాలను నమోదు చేయాలి......
0 Comments
Please give your comments....!!!