Type Here to Get Search Results !

How to write cheque Book Register details in Telugu with screenshots

▶ *త్వరలో ఆడిట్ అవుతుంది. ఈ ఆడిట్ లో చెక్ బుక్ రిజిష్టర్ ను కూడా చెక్ చేస్తాము అని ఆడిటర్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . కావున ఈ పోస్ట్.*
*ఇప్పటి వరకూ చెక్ బుక్ రిజిష్టర్ మొదలు పెట్టకపోతే,  మీరు ఉన్నప్పటి నుండి ( పాత ) ఇప్పటి వరకూ చెక్ Book Register రాయడం ఎలా ? వివరాలు తెలుగు లో...*


మీరు ఇప్పటి వరకూ చెక్ బుక్ రిజిష్టర్ మొదలు పెట్టలే దా? పర్లేదు ఈ చిన్న ఉపాయంతో మొదటి నుండి ఇప్పటి వరకూ 5 సం రాల రికార్డ్ అర గంట లో రాయవచ్చు.
కావలసినవి : చెక్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, UC ల ఫైనల్ స్టేట్మెంట్ ( ఆడిట్ వారు ఇచ్చినది ), వీలు అయితే అన్ని UC లు.


1 ) పద్దతి: ( చెక్ బుక్ ద్వారా )

చెక్ బుక్ లో మొదటి పేజీ లో చెక్ బుక్ అక్కౌంట్ పత్రాలు ఉంటాయి. ఈ పత్రాలలో చెక్ తేదీ, డబ్బు, చెక్ నంబర్, బ్యాలెన్స్ వివరాలు మీరు రాసి ఉంటే వీటిని చూస్తూ ఈ వివరాలు రిజిష్టర్ లో రాయవచ్చు. కానీ అన్ని చెక్ ల వివరాలు ఈ పత్రం లో మీరు రాసి ఉండాలి. మిగతా చెక్ ద్వారా డ్రా చేసిన డబ్బు దేనికి ఖర్చు చేశారో ఆ వివరాలు మాత్రం యూసీ లని చూసి రాయల్సిందే.


2 ) పద్దతి : ( పాస్ బుక్ ద్వారా )

మీ స్కూల్ పాస్ బుక్ స్టేట్ మెంట్ ద్వారా సులభంగా , తప్పులు లేకుండా పూర్తి వివరాలతో ఈ చెక్ బుక్ రిజిష్టర్ ను రాయవచ్చు.
▶ మీరు ఎప్పుడు HM గా ఛార్జ్ తీసుకున్నారో ఆ తేదీ పాస్ బుక్ పేజి తీయండి.
▶ ఆ పేజీలో ఉన్న చెక్ నంబర్ అదే లైన్ లో ఉన్న చెక్ తేదీ, చెక్ నంబర్, డ్రా చేసిన డబ్బు, అదే లైన్ లో చివరన ఉన్న బ్యాలన్స్ డబ్బు వివరాలను  రిజిష్టర్ లోని సంబంధిత కాలం లో రాయండి.  ప్రీవియస్ బ్యాలన్స్ గా చెక్ బుక్ లోని ఈ చెక్ వివరాలు రాశారో ఒక పైన లైన్ లో చివరన ఉన్న బ్యాలెన్స్ ను రిజిష్టర్ లో ప్రీవియస్ బ్యాలన్స్ గా రాయండి.

▶ ఇలా ఆ రోజు నుండి ఇప్పటి వరకూ అన్ని చెక్ వివరాలు , చెక్ బుక్ రిజిష్టర్ లో రాయాలి.

▶ చివరగా , రిజిష్టర్ లో రాయవలసినవి చెక్ ఎవరికి ఇవ్వబడింది, దేని కొరకు డ్రా చేయబడింది వివరాలు రాయాలి. చాలా వరకు ఈ వివరాలు ఆ అమౌంట్ ను బట్టి తెలుస్తాయి. ఒక వేళ కొన్ని వివరాలు తెలియకపోతే యూసీ లని చూసి రాయ వలసి ఉంటుంది.

▶ సాధ్యమైన వరకు అన్ని పేమెంట్ లని చెక్ ద్వారానే ఇవ్వాలి. ముఖ్యంగా సివిల్ పనులు అనగా నిర్మాణాలు, బాత్ రూం ల రిపేర్, స్కావెంజర్, యూనిఫాం మొ నవి. గతం లో ఇలా ఇచ్చి ఉండకపోతే సంబంధిత కాలం లో సెల్ఫ్ అని రాయాలి.

▶ చివరి కాలంలో HM సిగ్నేచర్ చేసి HM స్టాంప్ వేయాలి.

▶ ప్రతి పేజీలో పైన స్కూల్ స్టాంప్ ( రౌండ్ కాదు ) ను వేయాలి.

▶ ప్రతి పేజీలో స్కూల్ యూ డైస్ కోడ్ ను బ్యాంక్ అకౌంట్ నంబర్ ను రాయాలి.

▶ చెక్ బుక్ రిజిష్టర్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.


View as Night