Type Here to Get Search Results !

Swachhata Pakhvaada day wise Schedule in Telugu

❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀❀

*🔊స్వచ్చతా పక్షోత్సవాలు (1-15 సెప్టెంబర్ 2019)*

✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺ ✺✺ ✺

*🍥2019 సంవత్సరమునకు గాను తేది 1 నుండి 15 సెప్టెంబర్ 2019 వరకు జరుపు “స్వచ్ఛతాపక్షోత్సవాలు"నిర్వహించుట కొరకు రోజు వారీ కార్యాచరణ ప్రణాళిక.*🔰

*♻01.09.2019 నుండి 03.09.2019 వరకు (గురువారం నుండి శనివారం వరకు)(స్వచ్చతా శపథం నిర్వహణ దినోత్సవము) (Swachhta shapath Day)*

```❀స్వచ్చతా పక్షోత్సవాల మొదటిరోజు 1.09.2018 నాడు ఉపాధ్యాయులు, విద్యార్థులందరితో ఒక కార్యక్రమము
ఏర్పాటు చేసి విద్యార్థులతో 'స్వచ్ఛతా శపథం' నిర్వహింపచేయాలి. మరియు ప్రార్థనా సమావేశములో
విద్యార్థులచే ‘స్వచ్ఛత' అంశం గురించి మాట్లాడింపచేయాలి.```

```✺విద్యార్థులు వ్యక్తిగతంగా మరియు తరగతి వారీగా ఏదైనా ఒక స్వచ్చతా కార్యక్రమము వ్యక్తిగత / పాఠశాల
స్థాయి / కమ్యూనిటీ స్థాయి | ఇంటి పరిశుభ్రతను నిర్వహిస్తామని శపథం చేయాలి..```

```✺రాష్ట్ర విద్యాశాఖమంత్రి / రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి / జిల్లా కలెక్టర్లు / జిల్లా విద్యాశాఖాధికారులు / మండలవిద్యాశాఖాధికారులు పాఠశాల విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించాలి.```

```✺స్వచ్ఛతా అవగాహన సందేశంను డిపార్ట్ మెంట్ / సంస్థ పాఠశాల వెబ్ సైట్లో పోస్ట్ చేయాలి.```

```✺ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయి
కార్యాలయానికి పంపాలి.
```

*🍥04.09.2019 (బుధవారం)(స్వచ్ఛతా అవగాహన దినోత్సవం) (Swachhata Awareness Day)*

``` ✺పాఠశాల యాజమాన్య కమిటీ / తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి శుభ్రత పరిశుభ్రత ఆవశ్యకతను
పిల్లలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల మరియు
ఇంటి వద్ద పరిసరాల పరిశుభ్రత గురించి విద్యార్థులకు ప్రేరణ కలుగజేసి పాటించేలా ప్రోత్సహించాలి.
పాఠశాలలో గల అన్ని గదులు, మరియు ఆవరణలోని అన్ని ప్రాంతాలలో పరిశుభ్రతాంశాలను ఉపాధ్యాయులు
పరీక్షించి తదనుగుణంగా పాఠశాల శుభ్రతను మెరుగుపరచే చర్యలకు ప్రణాళిక రూపొందించాలి.
పాఠశాల స్థాయి, “పెయింటింగ్, వ్యాసరచన, టాలెంట్ టెస్టు" నిర్వహించాలి.```

```✺మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వంటగది, తరగతి గదులు, ఫ్యాన్స్ కిటికీలు, పాఠశాల ఆవరణ మరియు
పరిసర ప్రాంతాలలోని పొదలు మొదలగు వాటిని ప్రత్యేకంగా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలి.
పరిశుభ్రత పట్ల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కొరకు, పరిసరాలను చెత్తరహితంగా ఉంచడానికి, ప్లాస్టిక్
వినియోగం తగ్గించడానికి బహిరంగ మూత్ర, మల విసర్జన చేయకుండా ఉండుటకు వివిధ రకాల కాలుష్యాలు
తగ్గించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయి
కార్యాలయానికి పంపాలి.
```
*🍥05.09.2019 గురువారం(సమాజానికి చేరువ అవడం(CommunityOutreach)*

✺```పాఠశాలలోని ఉపాధ్యాయులందరు సమీప గ్రామాలలోని ప్రజలకు మూత్రశాలల వినియోగం, వ్యర్థాల
నిర్వహణ, నీటి వృధా అరికట్టడంపై నీటి వనరుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
✺ 'ఉపాధ్యాయ దినోత్సవం' సరియైన స్ఫూర్తితో నిర్వహించాలి.
సమాజ భాగస్వామ్యంలో పాఠశాలలో, గ్రామంలో స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించాలి. అందరి సహకారంతో
స్వచ్చతా పక్షోత్సవాల ప్రాముఖ్యతను వివరించాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయి
కార్యాలయానికి పంపాలి.
```
*🍥06.09.2019 (శుక్రవారం)(హరిత దినోత్సవము) (Green School Drive)*

``` ✺ఎకో క్లబ్స్ (Eco clusbs) పట్ల విద్యార్థుల అవగాహన కల్పించాలి.
✺ప్రతి పాఠశాలలో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలి. చెత్తను వేరు చేసే విధానం (Recycling waste &
unrecyclable waste) పై విద్యార్థులకు అవగాహన కలగజేయాలి. ఆకుపచ్చ మరియు నీలిరంగు చెత్త
బుట్టలను ఉపయోగించే విధానం (తడిచెత్త, పొడి చెత్తను వేర్వేరుగా) తెలియజేయాలి.
పాఠశాల ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. చెట్లను సంరక్షించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.
చెత్త పునర్వినియోగంపై చర్యలు చేపట్టాలి. విద్యార్థులకు అవగాహన కలుగజేయాలి.
Greem House Effect నివారణ చర్యలను ప్రోత్సహించాలి. అవసరం లేని పాత రికార్డులు, ఫైళ్ళు నిబంధనల
మేరకు తొలగించాలి..
అన్ని రకాల పాత వస్తువులు వినియోగంలో లేని పరికరాలు, పనిచేయని స్థితిలో గల వస్తువులు, వాహనాలు
పాఠశాల ఆవరణ నుండి పూర్తిగా తొలగించాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయికార్యాలయానికి పంపాలి.```

*🧹07.09.2019 (శనివారం)(స్వచ్చతా పోటీల దినోత్సవము) (Swachhata Participation Day)*

```🍥పరిశుభ్రత, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల సమర్థవంతమైన నిర్వహణపై కాంప్లెక్సు స్థాయి, / మండల
స్థాయి పోటీలు నిర్వహించాలి.
పరిశుభ్రత మరియు పాఠశాల ఆవరణ శుభ్రత అంశాలపై మండల స్థాయిలో టాలెంట్ టెస్టు మరియు
పెయింటెంట్ పోటీలు వ్యాసరచన నిర్వహించాలి.
'స్వచ్ఛత' అంశంపై డిబెట్ నిర్వహణ
'స్వచ్ఛత' అంశంపై నాటికల పోటీలు, పద్యరచన ఉపన్యాస పోటీలు మొదలగు వాటిని నిర్వహించాలి.
మండల స్థాయిలో వివిధ అంశాలలో పోటీ పడిన పాఠశాలలు మరియు విద్యార్థుల వివరాలు, ఫోటోలు,
వీడియోలు స్కాన్ చేసిన ఉత్తమ వ్యాసరచనలు, పెయింటింగ్లు SPD కార్యాలయానికి పంపాలి.```

*🏈09.09.2019 సోమవారం(Hand Wash Day)*

```
🍥భోజనానికి ముందు మరియు భోజనానంతరం చేతులు శుభ్రపరచుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన
కలుగచేయాలి.```

```🍥పాఠశాల పరిసర ఆవాసంలో 'స్వచ్చతా వారోత్సవాలు” గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన కలుగజేయాలి.
దివ్యాంగులైన పిల్లల కొరకు మంచినీటి వసతి మరియు మరుగుదొడ్ల సౌకర్యం కలుగచేసే విషయంలోసమీక్షించి వారికి పై సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి.```

*🍥ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయికార్యాలయానికి పంపాలి.*

*★11.09.2019 (బుధవారం)(వ్యక్తిగతపరిశుభ్రతదినోత్సవము) (Personal Hygiene Day)*

*★శుభ్రతపాటించుటకువిద్యార్థులు / ఉపాధ్యాయుల కొరకు అడియో -విజువల్కార్యక్రమాలురూపొందించిప్రదర్శించాలి.*

*విద్యార్థుల వ్యక్తిగత అలవాట్లు, జుట్టు కత్తిరించుకొనుట, గోర్లు కత్తిరించుకొనుట మొ|| వాటిపై అవగాహనకలుగచేయాలి.*

*★వ్యక్తిగత పరిశుభ్రత-ఆరోగ్యంపై ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కలుగచేయాలి.*

*★వ్యాసరచన, పెయింటింగ్,ఉపన్యాస పోటీలుమండల స్థాయిలో నిర్వహించి ప్రతి అంశం నుండి ఇద్దరువిజేతలను జిల్లా పోటీలకు పంపాలి. (గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలు విద్యార్థులు మాత్రమే)*

*★వ్యక్తిగత పరిశుభ్రతను సంబంధించిన అనుబంధ పుస్తకాలు అందచేయాలి, చదివించాలి.*

*★'స్వచ్ఛతయే సేవ' దినోత్సవం1-5 తరగతుల విద్యార్థులకు Hand wash పై పూర్తి అవగాహన కల్పించాలి.*

*★6-12 తరగతుల విద్యార్థులు శ్రమదానం చేయాలి.*

*★ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలుమొదలైనవివరాలను రాష్ట్ర స్థాయికార్యాలయానికి పంపాలి.*

*🍥(సమాజ భాగస్వామ్య దినోత్సవము) (Swachhata SchoolExhibitionday)*

*★పాఠశాలలోస్వచ్చతాకార్యక్రమాల పట్ల సమాజం యొక్క భాగస్వామ్యమునుపెంపొందించాలి.విద్యార్థులు,ఉపాధ్యాయులతోకలిసిపరిసరప్రాంతాలలోఅవగాహనర్యాలీలునిర్వహించాలి.*

*★నినాదాలతో కూడిన 'పాఠశాల మార్చ్' నిర్వహించాలి.*

*★మరుగుదొడ్లు, మంచినీటి వసతిని పరిశుభ్రంగా వాడడంపై విద్యార్థులకు అవగాహన కలుగజేయాలి.*

*★మురుగునీరు, నీటి వృధా పర్యవేక్షించాలి.*

*★వృధా నీటిని చెట్లు, బడి తోటలోకి మళ్ళించేలా చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయికార్యాలయానికి పంపాలి.*

▁ ▂ ▄ ▅ ▆ ▇ █ 007 █ ▇ ▆ ▅ ▄ ▂ ▁

*🍥12.09.2019 (గురువారం)(ఎ). (స్వచ్చ నీటి దినోత్సవం)(Swachhata School Exhibition Day)*

*🍥స్వచ్ఛతకార్యక్రమాలకుసంబంధించినఫోటో,పెయింటింగ్స్, కార్టూన్స్, స్లోగన్ (నినాదాలు) మొదలగువాటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఈ ప్రదర్శనకు గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు,ప్రజాప్రతినిధులనుఆహ్వానించాలి.*

*🍥Electronic Banners తయారు చేసి డిపార్టుమెంట్/రాష్ట్ర వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి.*

*★ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా నుపయోగించి స్వచ్చతా అంశాలపైపబ్లిసిటీ మరియు అవగాహన కల్పించాలి.పాఠశాలExhibition Document చేయించాలి.*

*★స్థానికంగా లభ్యమయ్యే Recycled raw materialతో చెత్తకు జమచేయుటకు కళాఖండాలను ఉదా|| కళాకృతచెత్త బుట్ట స్థానిక నైపుణ్యాలతో తయారు చేసి స్థానిక సంస్కృతిని పెంపొందింపచేయాలి.*
*(స్వచ్చత అమలు దీనోత్సవము) (Swachhta Action Day)*

*★నీటి నిలువ, నీటి పంపిణీని పర్యవేక్షించాలి.*

*★పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమాలలో సమాజాన్ని భాగస్వాములను చేయాలి.*

*🍥నీటిలో గల కర్బన, అకర్బన వ్యర్థాలపైఅవగాహనకలుగచేయాలి.విద్యార్థులుఅరక్షితనీటినివినియోగించకుండాఅవగాహన కలుగచేయాలి.కలుషిత నీటి ద్వారాసంక్రమించేవ్యాధులగురించివిద్యార్థులకుఅవగాహన కలుగచేయాలి.*

*🍥రక్షితమంచినీటినివినియోగించేఅలవాట్లునుపెంపొదింపచేయాలి.రక్షిత మంచి నీటిని నిలువచేసేవిధానంపైవిద్యార్థులకుఅవగాహన వీలుగా చేయాలి.ఈకార్యక్రమానికిసంబంధించి ఫోటోలు, వీడియోలు మరియు పబ్లిసిటీ మెటీరియల్ SPD కార్యాలయానికి పంపాలి.జిల్లా స్థాయిలో, వ్యాసరచన, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు మరియు టాలెంట్ టెస్టు ఏర్పాటు చేసి ప్రతిఅంశంలో 3 విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలి. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలుఅందజేయాలి*

*🍥జిల్లా స్థాయిలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య, ఉత్తమ వ్యాసరచన, పెయింటింగ్ల స్కాన్కాఫీలువిజేతలవివరాలుSPD కార్యాలయానికి పంపాలి.*

*★13.09.2019 (శుక్రవారం)(Letter Writing Day)*

*🍥విద్యార్థులచే, గ్రామ సర్పంచ్ కు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ మరియు పాఠశాల యాజమాన్యకమిటీలు సభ్యులకు పాఠశాల మరియు పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ గురించి ఉత్తరాలు వ్రాయించాలి.*

*🍥స్వచ్చతాపక్షోత్సవాలసందర్భంగా విద్యార్థులు వారు నేర్చుకున్నఅంశాలనువివరిస్తూ, తల్లిదండ్రులు కూడావాటిని పాటించాలని సూచిస్తూ వారి వారి తల్లిదండ్రులకు ఉత్తరాలు వ్రాయించాలి.*

*🍥వాటిలో కొన్నింటినిడాక్యుమెంటేషన్ చేసిప్రతిజిల్లానుండిరాష్ట్రకార్యాలయానికి పంపించాలి.జిల్లా కలెక్టర్లు, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశము నిర్వహించిస్వచ్ఛతా కార్యక్రమాల సందేశాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చర్యలుతీసుకోవాలి.*

*🍥పాల్గొన్న విద్యార్థు సంఖ్య మరియు ఉత్తమమైన లేఖల స్కాన్కాఫీలనుSPDకార్యాలయానికి పంపాలి.*

*🏆16.09.2019 (సోమవారం)*

*🥇(బహుమతుల ప్రధాన దినోత్సవము)*

*🍥స్వచ్ఛతా పక్షోత్సవాల సందర్భంగా వివిధ పోటీలు, Painting, Essay, Debate, Quize మొదలగువాటిలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు బహుమతులు అందచేయాలి.*

*🍥స్వచ్ఛతా పక్షోత్సవాల సందర్భంగా పాఠశాలలోజరిగిన వివిధకార్యక్రమాలనుసమీక్షించిఉత్తమమైనవాటినిఎన్నుకుని జిల్లా మరియు రాష్ట్ర అధికారులకు వెబ్ సైట్లోఅప్లోడ్చేయుటకొరకుఅందచేయాలి.*

*★ జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ మరియు విజేతలకు మెరిట్ సర్టిఫికేట్స్ మరియుబహుమతులప్రధానం(గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు మాత్రమే).*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.