Type Here to Get Search Results !

Vidyarthi Vignan Manthan Science Test guideLines in Telugu and English

*🌳విద్యార్థి విజ్ఞాన మంథన్*

♦దేశ వ్యాప్తంగా సమస్త పాఠశాలల్లో 6వ తరగతి నుండి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో
దాగియున్న ప్రతిభను వెలికి తీసి, అట్టి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించుటకు ఉద్దేశించిన,"విద్యార్థి విజ్ఞాన మంథన్ - 2019-20లో ప్రతిభ పరీక్ష "విజ్ఞాన భారతి" మరియు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్.సీ.ఇఆర్.టి.) న్యూ ఢిల్లీ, (కేంద్ర మానవ వనరుల అభివృద్ధి
శాఖ) మరియు విజ్ఞాన ప్రసాద్ (కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వతంత్ర్య ప్రతిపత్తి గల - సంస్థ) సంయుక్తంగా దేశ వ్యాప్తంగా సమస్త పాఠశాలల్లో నిర్వహించతలపెట్టినాయి.

*♦విద్యార్థి విజ్ఞాన మంథన్ - (ప్రతిభాన్వేషణ పరీక్ష-లక్ష్యాలు*
సైన్స్ పట్ల పిల్లలు ఆసక్తి కల్పించుట,ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక
👇👇👇👇👇👇
శాస్త్ర సాంకేతిక ప్రపంచ అభివృద్ధిలో భారతీయుల కృషిని,పాఠశాల విద్యార్థులకు తెలియజేయుట.
పిల్లలు ఉన్నత స్థాయి వైజ్ఞానిక విద్యను అభ్యసించుటకు అవసరమైన మార్గదర్శకులు ఏర్పాటు
చేయుటకు.
పోటీ పరీక్ష నిర్వహించిన ద్వారా శాస్త్రీయ వైఖరి గల పాఠశాల స్థాయి విద్యార్థులను గుర్తించుట మరియు వారికి సదస్సులు, కార్యశాల ద్వారా ప్రయోగక నైపుణ్యాలను పెంపొందించుటకు అవకాశాలు కల్పించుట,
జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రోత్సాహక,బహుమతులు మరియు అభినందన పత్రం ద్వారా సత్కరించి ప్రోత్సహించుట.
విజేతలైన విద్యార్థులకు జాతీయ స్థాయిలో గల వివిధ పరిశోధన సంస్థలను సందర్శించుటకు
అవకాశం కల్పించుట.

*♦పరీక్ష విధానం:*
1) పాఠశాల స్థాయి,జిల్లా స్థాయిలో:
- బహుళైచ్చిక ప్రశ్నలు విధానం
- డిజిటల్ విధానం లో మాత్రమే (సెల్ ఫోన్స్,ట్యాబ్, ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్)
2) రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో
లక్ష్యాత్మక ప్రశ్నలు
విస్తృత అవగాహన
బృంద చర్చలు మరియు ప్రదర్శన
నాటకీకరణ
ప్రయోగ పరీక్ష - విజ్ఞాన శాస్త్ర పద్ధతులు

*జిల్లా స్థాయి పరీక్ష(జూనియర్స్ & సీనియర్స్)*
6 వ - 8వ తరగతి విద్యార్థులు : జూనియర్ విభాగం
9వ - 10వ తరగతి విద్యార్థులు : సీనియర్ విభాగం

ఒకే పరీక్ష 100 బహుశ్చిక ప్రశ్నలు,
సమయం: 2 గంటలు,
ప్రతి ప్రశ్నకు 1 మార్కు
పరీక్ష మాధ్యమం: తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ

*♦పరీక్ష సిలబస్:*
సైన్స్ మరియు గణిత (పాఠ్య పుస్తకాల) సుండి 50% (50 ప్రశ్నలు - ప్రశ్నకు 1 మార్కు)ఎస్.సి.ఆర్.టి. సిలబస్,విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో భారతీయులు పాత్ర, 20%(20 ప్రశ్నలు - ప్రశ్నకు-1మార్కు),వి.వి.యం.స్టడీ మెటీరియల్,జగదీశ్ చంద్రబోస్ మరియు ఇకే, జానకి అమ్మల్ శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు - 20% (20 ప్రశ్నలు - ప్రశ్నలు 1 మార్కులు), వి.వి.యం. స్టడీ మెటీరియల్,
కార్మిక చింతన & కార్యకారణ సంబంధాలు - 10 (10 ప్రశ్నలు - ప్రశ్నలు 1 మార్కు),సాధారణ సిలబస్

*నోట్:* VVM స్టడీ మెటీరియల్ website నుండి PDF రూపంలో పొందవచ్చు.

*♦విద్యార్థులకు అవార్డుల వివరాలు:*
పాఠశాల స్థాయి జిల్లా స్థాయి పరీక్ష ఆయా జిల్లాల్లో ముందుగా నమోదు చేసుకున్న పిల్లలు డిజిటల్ పరికరం ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది.

*♦పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి*
పరీక్షలు పూర్తిగా బహుళైచ్చిక ప్రశ్నలు (100) ఉంటాయి, సమయం 120
నిమిషాలు. ఆ యా జిల్లాలో ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు
మెరిట్ సర్టిఫికేట్లు (ధృవ పత్రాలు) అందజేయబడును. పాఠశాల స్థాయిలో (కనీసం 10 మంది విద్యార్థులు ఒక తరగతి నుండి పాల్గొంటే) తరగతి వారీగా మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వబడును.

*♦రాష్ట్ర స్థాయి పరీక్ష పరీక్ష*
రాసిన విద్యార్థులు జిల్లాల నుంచి ప్రతి తరగతిలో ప్రతిభ ఆధారంగా 20 మంది విద్యార్ధులను రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో
నుండి ప్రతి తరగతి లో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి రాష్ట్ర స్థాయి విజేతలుగా మొత్తం
18 మంది) ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి క్యాంప్ కు హాజరైన ధృవపత్రం ప్రదానం, మెమెంటో
*ప్రధాన,నగదు బహుమతి:* మొదటి బహుమతి రూ. 5,000/-లు, రెండవ బహుమతి
రూ. 2,000/-లు, మూడవ బహుమతి రూ.1,000/-లు అందజేయబడుసు.

*♦జాతీయ స్థాయి పరీక్ష:*
ప్రతి తరగతి నుండి మొదటి ఇద్దరు విద్యార్థులు ప్రతి రాష్ర్టం నుండి
ఎంపిక చేసి జాతీయ స్థాయి క్యాంపు ఎంపిక చేస్తారు. ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి  జాతీయ స్థాయి విజేతలుగా (మొత్తం 18 మందిని హిమాలయన్)
ప్రకటిస్తారు. జాతీయ స్థాయి క్యాంపు కి హాజరైన ధృవపత్రం ప్రధానం, జాతీయ స్థాయి
క్యాంపు మెమెంటో ప్రదాసం, *నగదు బహుమతి:* మొదటి బహుమతి రూ. 25,000/
లో, రెండవ బహుమతి రూ. 15,000/-లు, మూడవ బహుమతి రూ.10,000/-లు
అందజేయబడును. అదే విధంగా జాతీయస్థాయి విజేతలకు అదనంగా దేశంలోని 4 జోన్ల
సుండి జోన్ కు 18 మంది చొప్పున ప్రతి తరగతి నుండి ముగ్గురు విజేతలు కూడా పారితోషితాలు ఇస్తారు, *జోనల్ స్థాయిలో* మొదటి విజేత కు రూ. 5,000/-లు, ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు, తృతీయ బహుమతి రూ. 2000/-లు అందివ్వబడును.

*♦ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేయించడం ఎలా?*
- విద్యార్థి విజ్ఞాన మంథన్ (వి.వి.యం, ) అనేది ఒక విలక్షణమైన ఆన్లైన్ పరీక్ష
ఇస్లైస్లో www.vvm.org.in.website వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాలి. ఆన్లైన్లో
వ్యక్తిగతంగా లేదా సంస్థాగతంగా రిజిస్టర్ చేసుకొనవచ్చు.
పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని వి.వి.యం. సమన్వయకులుగా నియమించి, పాఠశాలల
వివరాలు, పిల్లల వివరాలు నమోదు చేయించాలి,
రిజిస్టర్ చేసుకున్న పిల్లలు తమ మొబైల్ నెంబర్ లేదా ఇ-మెయిల్ ఓటిపి వస్తుంది.
*ఈ పరీక్షలు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా* మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.
- వి.వి.యం, 2019-20లో రిజిస్టర్ చేసుకున్న వారు తమ మొబైల్ ఫోన్లో వి.వి.యం. ఆప్
డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి.
- ఫైనల్ పరీక్ష కు ముందు పిల్లలు "మాక్ టెస్ట్" కూడా ఈ ఆప్ ద్వారా సాధన చేసుకోవచ్చు.
*పరీక్ష ఫీజు:* రూ. 100/- (15 సెప్టెంబర్ 2019 వరకు)
లేట్ ఫీజు రూ.120/- (30) సెప్టెంబర్ 2019 వరకు)
*పరీక్ష ఫీజు కేవలం ఆన్లైన్లో (RTGS / NEFT) లేదా చాలాన్ మాత్రమే ఆన్లైన్ ఫీజు ఈ క్రింది అకౌంట్లు పంపాలి:*
అకౌంట్ నెం : 67351214143
అకౌంట్ పేరు : విద్యార్థి విజ్ఞాన మంథన్
IFSC Code: SBIN 0070582 ,SBI - సరోజిని నగర్, న్యూ ఢిల్లీ

*♦ముఖ్యమైన తేదీలు:*
రిజిస్ట్రేషన్ ప్రారంభం :11 జూన్ - 2019 నుండి
రిజిస్ట్రేషన్ ముగింపు: 15 సెప్టెంబర్, 2019
అపరాధ రుసుంతో :30 సెప్టెంబర్, 2019
హాల్ టికెట్లు :పిల్లల ప్రొఫైల్ పేజీ
పరీక్ష తేది :24 నవంబర్ 2015 (సెలవు రోజు) లేదా(30 నవంబర్, 2019 పని దినం)
సమయం ఉ 11.00 నుండి మ 1.00 వరకు (2.00గం||)
పరీక్ష ఫలితాల వెల్లడి: 15వ డిసెంబర్, 2019
రాష్ట్ర స్థాయి క్యాంప్ : 05, 12 & 19 జనవరి, 2020 (ఏదేని ఒక రోజు)
రెండు రోజుల జాతీయ క్యాంప్: 16 & 17 మే, 2020

Download

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.