SMC ఎన్నికలకు సంబంధించి ఒక మిత్రుడు వెలిబుచ్చిన సందేహాల పై నేనిచ్చిన జవాబులను చర్చ కోసం మీతో షేర్ చేసుకొంటున్నా!
> 1 ఒక తరగతిలో 6కన్నా తక్కువ మంది పిల్లలు ఉన్న సందర్భంలో ఆ తరువాత లేదా ముందు తరగతి నుంచి 6కు కావలసిన మందిని తీసుకోవాలా? మొత్తం తరగతిని తీసుకోవాలా?
A: మొత్తం తీసుకోవాలి.
> 2 వసతి గృహంలో ఉండే పిల్లల తల్లిదండ్రులకు పోటీ చేసే అవకాశం ఉందా?
A: చెయ్యొచ్చు!
>3. 2,3,4,3,5 విద్యార్థుల సంఖ్య....&
5,5,5,3,5 విద్యార్థుల సంఖ్య ఉన్న సందర్భాల్లో సభ్యులను తీసుకోవలసిన విధానం?
A: 2,3,4,3,5 మంది విద్యార్థులు ఉన్న సందర్భంలో....
2+3+4=9 One Class
3+5=8 another Class
5,5,5,3,5 మంది విద్యార్థులు ఉన్న సందర్భంలో ....
5+5=10 one class
5+3+5=13 another class
>4. ఒకవేళ ఆరుమందిలో ఇద్దరు మహిళలు లేని సందర్భంలో పురుష సభ్యులను తీసుకోవచ్చా?
A: No. తీసుకోరాదు.
>5. ౩౦ మంది కన్నా పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తక్కువ అయిన సందర్భంలో మొత్తం ౩౦ మందిని ఎన్నికైన సభ్యులుగా తీసుకోవాలని నిబంధన ఏమైనా ఉందా?
A: అలాంటి నిబంధనేదీ లేదు.
>6. 50శాతం సభ్యులు హాజరు కాకపోతే కమిటీ ఎన్నిక కచ్చితంగా వాయిదా వేయవలసిందేనా?
A: హాజరయ్యేటట్లు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా కనీసం 50 శాతం మంది హాజరు కాకపోతే... ఆ తరగతి SMC సభ్యుల ఎన్నికను, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలనూ వాయిదా వేయాలి. మళ్ళీ నోటీస్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలి.
>7. ఉన్న బడిలోనే తాను పేరెంట్స్ గా ఉంటే వాళ్ళు SMC కి పోటీ చేయవచ్చా ??
చేయరాదు. ఒక వేళ చేయ దలిచితే సభ్యుని గా మాత్రమే పోటీ చేయవచ్చు గాని, చేర్మెన్ గా గాని ఉప చైర్మెన్ గా గాని పోటీ చే యకుడదు.
> 8.పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో సర్పంచ్, వైస్ సర్పంచ్, వార్డు మెంబర్ , mptc మరియు ఇతర ఏదేని ప్రజా ప్రతినిధులు పోటీ చేయవచ్చా?
9. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జోడు పదవుల చట్ట పరిధిలోకి వస్తాయా?
పోటీ చేయకపోవడం మంచిది. పైగా వీరు ఎక్స్ అఫిషియో సభ్యుల గా ఉంటారు.
10. పాఠశాలలో వారి పిల్లలు లేకున్నా ప్రస్తుత సర్పంచ్, ఉపసర్పంచ్ లను పాఠశాలకు ఆహ్వనించవచ్చా?
తప్పకుండా ఆహ్వానించాలి. వీరి సమక్షంలో ఎన్నికలు జరుపాలి. ఎన్నికలు కు వీరు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా వీరి సంతకాలు తీసుకోవాలి.
Please give your comments....!!!