*🌳ప్రతి శుక్రవారం దోమల నివారణపై అవగాహన*
🔷ఆర్.సి. నం.100, తేదీ 15.11.2019
🔷ఈ నెల 22 నుంచి 10 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 15నిమిషాలు డ్రైడే(దోమల నివారణ)
♦దోమల నివారణకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధన్‌రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ విభాగాల అదనపు డైరెక్టర్లు, సంయుక్త డైరెక్టర్లతో జరిపిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకొన్నారు. రోజూవారీ తరగతులతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలను తగ్గించడానికి దోమల నివారణ ప్రధానమనే విషయాన్ని విద్యార్థులకు తెలిసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
♦వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడంతోపాటు స్కూళ్లలో తడి లేకుండా చూసే బాధ్యతను విద్యార్థులకు అప్పగించడంపై సమావేశంలో చర్చించారు. అవగాహన పొందిన విద్యార్థుల తమ ఇంటి పరిసరాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే తడి వాతావరణం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులలో పేర్కొన్నారు
Please give your comments....!!!