*పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల*
హైదరాబాద్: తెలంగాణలో పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
*జనవరి 7న పురపాలిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.*
*జనవరి 10న నామినేషన్లకు చివరి తేదిగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.*
*జనవరి 11న నామినేషన్లను పరిశీలిస్తారు.*
*జనవరి 14 నామినేషన్ల ఉపసంహరణకు గడువు.*
*జనవరి 22న పోలింగ్,*
*జనవరి 25న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.*
మొత్తం 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 30న వార్డుల వారీ ఓట్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ముసాయిదాపై వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన వార్డుల వారీ తుది జాబితాను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Please give your comments....!!!