బ్లాక్ అండ్ వైట్ ID కార్డు కేవలం మూడు రూపాయలకు, కలర్ ID కార్డు నాలుగు రూపాయలకు సులభంగా మనమే తయారు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు
దీని కొరకు మొదట గా అందరివీ ID కార్డ్స్ తయారు చేయాలి. అదీ ఎలాగో చూద్దాం.
ఇది రెండు రకాలుగా చేయవచ్చు
మొదట గా మాన్యువల్ గా మన ఫోన్ లోనే ఎలా చేసుకోవచ్చు తెలుసుకుందాం.
పైన క్లిక్ చేసి డిజైన్ ను డౌన్ లోడ్ చేసుకోండి. తర్వాత దీనిని WPS ద్వారా ఓపెన్ చేయండి. అందులో పిల్లల వివరాలు రాసి ఫోటో ఇన్సర్ట్ చేయండి. అలా ఒక పేజీ లో పది మందివి చేశాక PDF సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తూ పోవాలి.
WPS ఆఫీస్ ను ఈ క్రింద క్లిక్ చేసి ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
పై డిజైన్ లో కంప్యూటర్ కూడా పై లాగే మాన్యువెల్ గా చేసుకోవచ్చు. కానీ కంప్యూటర్ లో కంటే ఫోన్ లో చేయడం చాలా సులభం.
▶️ రెండవ పద్దతి : పూర్తిగా ఆటోమేటిక్ గా వస్తాయి
ఇది కేవలం కంప్యూటర్ లో మాత్రమే చేయవచ్చు. ఫోన్ లో చేయరాదు.
మొదట గా మీ స్కూల్ వివరాలతో Child ఇన్ఫో ( Schooledu.telangana.gov.in ) నుండి రిపోర్ట్స్ కాలం నుండి మీ విద్యార్థుల వివరాల షీట్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఆ షీట్ లో సుమారు 36 కాలం లు ఉంటాయి. ఐడెంటిటీ కార్డు లో ఏదైతే ఉండాలి అనుకుంటున్నారో వాటిని తప్ప మిగతా వాటిని హైడ్ చేయండి. లేదా ఈ క్రింద ఉన్న డాటా షీట్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో కాపీ చేసి నుండి ఇందులోకి పేస్ట్ చేయండి.
మాన్యూవల్ గా చేయాలంటే ఈ డాటా షీట్ ను డౌన్ లోడ్ చేసుకోండి. అందులో పిల్లల వివరాలు నమోదు చేసి వారి ఫోటో లు ఇన్సర్ట్ చేయండి.
పిల్లల ఫోటో లు తీసేటప్పుడు మీ కెమరా క్వాలిటీ ను పూర్తిగా తగ్గించండి. దీనికొరకు మీ ఫోన్ లో కెమరా ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి కెమరా resulotion తగ్గించండి. ఈ పని చేయకపోయినా పర్వాలేదు
పై డిజైన్ కు డౌన్ లోడ్ చేసుకోండి. మేల్ మెర్జ్ అనే పద్దతి ద్వారా పూర్తిగా ఆటోమేటిక్ గా అందరి పిల్లలకు ఐడెంటిటీ కార్డు రెడీ మేడ్ గా వస్తాయి. ఏది రాయాల్సిన పని లేదు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింద గల వీడియోలు చూడండి.
డిజైన్ పూర్తి అయిన తర్వాత ప్రింట్ ఎలా తీసుకోవాలి. దాదాపు అన్ని ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్ లు ప్రింటర్ లు ఉన్నాయి. కావున బయట మార్కెట్ లో గల అన్ని బుక్ షాప్ లలో ఫోటో పేపర్ దొరుకుతాయి ఒక్కోటి అయిదు రూపాయలు మాత్రమే దీని మీద ప్రింట్ తీస్తే బాగుంటుంది. ఇలా తీసిన ప్రింట్ లను కట్ చేసి అదే బుక్ షాప్ లలో దొరికే ID కార్డు పెట్టే కవర్స్ లలో పెట్టి పిల్లలకు ఇస్తే సరి. ఒకవేళ కలర్ ప్రింట్ కావాలంటే నెట్ సెంటర్ లలో ఒక్కో పేజీ కి పది రూపాయలు తీసుకుంటారు.
ఒక్క పేజీలో 10 కార్డు లు వస్తాయి.
Paper 5 రూ ఒక్కరికీ అయ్యే ఖర్చు 0.5 రూ
ప్రింట్ 10 రూ ఒక్కరికీ అయ్యే ఖర్చు 1 రూ
కవర్ 3 రూ
మొత్తం ఒక్క విద్యార్థికి అయ్యే ఖర్చు బ్లాక్ అండ్ వైట్ 3 రూ, కలర్ 4 రూ మాత్రమే..
ఇవి మీరు ఊహించినంత గొప్పగా ఉండవు. కానీ చాలా బాగుంటాయి. మా బడి పిల్లలు చేసి ఇచ్చాను. గొప్పగా ఉండాలి అంతే లామినేషన్ అయ్యే ఖర్చు చాలా ఎక్కువ . మార్కెట్ లో ఫోటో గ్రాఫర్స్ ఒక్కదానికే 80 రూ తీసుకుంటున్నారు.
మా బడి లో నేను ప్రింట్ తీసి ఇచ్చిన కార్డు
మేల్ మెర్జ్ ఎలా చేయాలో తెలిపే వీడియో తెలుగు లో...
ఇది చూస్తే గుర్తింపు కార్డు ల తో పాటు ఒకేసారి ఎక్కువ ప్రింట్ లు ఎలా తీయాలో తెలుస్తుంది. ఉదా ఒకేసారి వందల కొద్ది విద్యార్థుల హాల్ టికెట్ లు ప్రింట్ తీయడం..
ఈ క్రింది వీడియో లో ఆటోమేటి క్ గా చైల్డ్ ఇన్ఫో లోని మన విద్యార్థుల డాటా తో ఎలా identity కార్డు తయారు చేసుకోవాలో చాలా వివరంగా చూపించారు. ఒక సారి చూస్తే చాలా సులభమా మనమే తయారు చేసుకోవచ్చు.
0 Comments
Please give your comments....!!!