Fundamental Duties chart to be displayed in all the schools. In Telugu, English
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
(అధికరణ 51-ఏ ప్రకారం)
భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాథమిక విధులు :
1. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
2. భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
3. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
4. అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
5. భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి.
6. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
7. ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
8. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
9. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
10. భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
0 Comments
Please give your comments....!!!