*కారుణ్య నియామకాలు*
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️
🌀 *ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు.*
🌀 *అయితే ఈ నియామకాలపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు
🛑 *కారుణ్య నియామకాలు :*
🔳 *రెండు రకాలు.*
(1).🔷 *ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.*
(2).🔷 *రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.*
🛑 *కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి*:
🌀 *మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.*
🛑 *జీవోలు:*
🌀 *మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై౬ ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు.*
🌀 *కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు.*
🌀 *వైద్య కారణాల వల్ల రిటైర్ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు.*
🌀 *సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్ నెంబర్ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.*
🛑 *కారుణ్య నియామకాలకు అర్హులెవరు?*
🌀 *మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు.*
🌀 *వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు*.
🌀 *కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.*
🛑 *ఎవరికిస్తారు?*
🌀 *ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.*
🔳(1). *ఉద్యోగి భార్య/భర్త,*
🔳(2). *కుమారుడు/కుమార్తె,*
🔳(3). *ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,*
🔳(4). *ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె,*
🔳(5). *మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు,*
🔳(6). *ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు*.
🛑 *ఏ పోస్టులో నియమిస్తారు?*
🌀 *జూనియర్ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.*
🛑 *నియామక విధానం ఎలా?*
🌀 *ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి*.
🌀 *మైనర్ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది.*
🌀 *వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.*
🛑 *అర్హతలు* :
🔳 *ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి.*
🌀 *అయితే జూనియర్ అసిస్టెంట్‌గా సబార్డినేట్ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు,*
🌀 *శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు.*
🌀 *ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది*.
🌀 *ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు.*
🌀 *చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.*
🛑 *నియామక పరిధి :*
🌀 *మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు.*
🌀 *ఏడిపార్టుమెంట్లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు.*
🌀 *అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.*
🌀 *ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో సిక్స్ పాయింట్
ఫార్మలాకు లోబడి ఇవ్వబడతాయి.*
🌀 *రిజర్వేషన్ నిబంధన (రూల్ 22)ను పాటించాల్సివుంటుంది.*
🌀 *మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంటే ఆమె సొంత జిల్లాలోగానీ, భర్త ఉద్యోగం చేసిన చోటగానీ, ఏ ఇతర జిల్లాలోగానీ నియామకం కోరవచ్చు.*
🛑 *తాజా మెమో*:
🌀 *కారుణ్య నియామకాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం మెమో జారీ చేసింది.*
🌀 *భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, అందులో ఒకరు రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటుండగా, మరొకరు మరణిస్తే వారిపై ఆధారితులకు కారుణ్య నియామకం వర్తించదు.*
🌀 *ఆ ఇంట్లో పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఉన్నందున దాన్ని ఆదాయం ఉన్న కుటుంబంగానే పరిగణించి కారుణ్య నియామకం ఇవ్వరు.*
🌀 *దీనికి సంబంధించి సర్క్యులర్ మెమో నెం.3548/సర్వస్-జి/ఏ2/2010-8, జీఏడీ, తేదీ : 24.03.2012 జారీ చేసింది.*
🛑 *10 పనిదినాలలో కారుణ్య నియామకాలు కల్పించాలిని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది*
*Cir.Memo.No.15456/Ser.E/2016 తేది:24.12.2016*
🛑 *ఎక్స్‌గ్రేషియా* :
🔳 *కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో*
🌀 *నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు, నాన్ గెజిటెట్ వారికి రూ.60 వేలు,* *గెజిటెడ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలి.*
£££££££££££££££
Please give your comments....!!!