*నులిపురుగుల మాత్రలు*
(తేది : 10-2-2020)
(తేది : 10-2-2020)
అన్ని స్థాయిల ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల హెడ్మాస్టర్లకు, ప్రిన్సిపాల్స్ కు అతి ముఖ్య సూచన : --
తేది : 10-02-2020 న జాతీయ నులి పురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా
(1 నుండి 19) సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు "అల్బెండజోల్" మాత్ర లు అందించబడును.....
(1 నుండి 19) సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు "అల్బెండజోల్" మాత్ర లు అందించబడును.....
అందుకు గానూ కింది సూచనలు తప్పనిసరిగా పాటించగలరు......
1) మాత్రలు అందించటానికి వచ్చిన ఆరోగ్య సిబ్బంది కి సహకరించగలరు.
2) మాత్రలు నేరుగా మింగకూడదు.. తప్పని సరిగా మాత్రలు ముందుగా చప్పరించి తరువాత మిగిలిన మాత్రను నమిలి మింగవలెను. ప్రతీ చోట శుభ్రమైన తాగు నీరు త్రాగడానికి వుంచగలరు.
3) ప్రతీ విద్యార్థి మాత్రను చప్పరించి, నమిలి మింగే విధంగా వ్యక్తిగతం గా గమనించగలరు. ఏ విద్యార్థి మాత్ర ను ఉమ్మి వేయకుండా చూడగలరు.
4) ధీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న విద్యార్థులకు మాత్రలు అందించకూడదు.
5) ముందు రోజున ఇంట్లో ఈ మాత్రలు వాడినప్పటికీ తిరిగి పాఠశాలలో మాత్రలు తప్పనిసరిగా ఇవ్వవలెను.
6) 2 - 19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర, (1 - 2 సంవత్సరాల పిల్లలకు పొడి చేసి నీటిలో కలిపి సగం మాత్ర) అందించవలెను.
7) దగ్గరలో వున్న ఆరోగ్య కేంద్ర ఫోన్ నెంబర్ దగ్గర వుంచుకోగలరు.
8) కడుపులో నులి పురుగులు ఎక్కువగా వున్న విద్యార్థులకు వాంతులు, తల నొప్పి, కడుపు నొప్పి వంటి ప్రతికూల ఘటనలు కనపడవచ్చు. అవి తాత్కాలికమే. అటువంటి పిల్లలకు నీడ లో విశ్రాంతి ఇవ్వగలరు.
9) అల్బెండజోల్ అనేది సులభంగా నమలగలుగు మాత్ర. ఒక వేళ మాత్ర పిల్లల గొంతు లో ఇరుక్కు పోతే వారిని మీ తొడలపై బొర్లా పడుకోబెట్టి ( పిల్లవాడి తల కిందకు వుండాలి) వారి వీపు పై మాత్ర బయటకు వచ్చేవరకు తట్టాలి.
9) అల్బెండజోల్ అనేది సులభంగా నమలగలుగు మాత్ర. ఒక వేళ మాత్ర పిల్లల గొంతు లో ఇరుక్కు పోతే వారిని మీ తొడలపై బొర్లా పడుకోబెట్టి ( పిల్లవాడి తల కిందకు వుండాలి) వారి వీపు పై మాత్ర బయటకు వచ్చేవరకు తట్టాలి.
10) 10వ తారీకున మాత్ర అందించబడని విద్యార్థులకు తిరిగి మాప్ అప్ డే 17-02-2020న మాత్ర తప్పని సరిగా అందించబడేటట్లు చూడవలెను....
Please give your comments....!!!