▶️ *2003-డీఎస్సీ టీచర్లకు గుడ్ న్యూస్!*
2003-డీఎస్సీ టీచర్లకు బిగ్ గుడ్ న్యూస్! ఇప్పటివరకు వారంతా కొత్త పెన్షన్ పథకం(CPS)లో కొనసాగుతున్నారు. ఈ రోజు Government of India, Department of Pension and PM Memorandum No 57/04/2019-P&PW(B) తేదీ 17.02.2020 ద్వారా ఒక విష్పష్టమైన వివరణ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ పథకం ఫస్ట్ జనవరి, 2004 నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఈ రోజు GOI జారీచేసిన క్లారిఫికేషన్ ప్రకారం.... ఫస్ట్ జనవరి, 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకూ ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తించనుంది. అయితే, దీనికి కండిషన్ ఏంటంటే.... సదరు నియామకాలకు సంబంధించిన టెస్ట్/ఎక్జామ్ ఫలితాలు ఫస్ట్ జనవరి, 2004 కి ముందే ప్రకటించబడి ఉండాలి. సదరు ఉద్యోగులు ఈ ఏడాది మే 31లోగా CPSలోకి మారడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఆప్షన్ ఇవ్వని పక్షంలో CPSలోనే కొనసాగుతారు.
ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వద్దాం! మన రాష్ట్రంలో తేదీ 1-9-2004 నుంచి CPS విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఫస్ట్ సెప్టెంబర్ 2004న లేదా ఆ తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు CPS వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! అయితే, 2003 డీఎస్సీ నియామకాలు నవంబర్, 2005లో జరిగినప్పటికీ, ఫలితాలు మాత్రం జూన్, 2004 (Subject to correction) లోనే ప్రకటించారు. అంటే, రాష్ట్రంలో CPS విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు OPS అమలు కావడం తథ్యం. 💐💐🌹🌹
✍మానేటి ప్రతాపరెడ్డి.
Rtd GHM
Karimnagar
Please give your comments....!!!