TPTF TOOPRAN :
*అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE)* *సంబంధిత ఉత్తర్వులతో:*
✍ *అర్జితసెలవు(Earned Leave)* ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను *సరెండర్ లీవ్* అందురు.
*(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)*
*(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)*
👉 *ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.*
👉 *ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం(ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.*
*(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)*
👉 *సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.*
*(G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)*
👉 *సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.*
*(G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)*
👉 *సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించబడదు.*
*(Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)*
👉 *సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు.ఈ సెలవుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.*
*(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)*
👉 *ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరుచేయు అధికారం కలిగియుంటాడో, అట్టి అధికారే అర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించవచ్చును.*
*(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)*
👉 *అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.*
*(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)*
👉 *జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదుచేయాలి.*
*(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)*
👉 *అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.*
👉 *సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె(HRA)మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.*
*(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)*
👉 *ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.*
*(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)*
👉 *పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరుచేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువగాకుండా ఉండవలెను.*
*(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)*
👉 *పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతిచెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.*
*(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)*
👉 *సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.* సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.
*(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)*
👉 *అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఏర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.*
👉 *ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలలో భాగంగా ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోని పాఠశాలకు మారినపుడు సరెండర్ అప్లై చేసిన సందర్భంలో పాత STO కార్యాలయం నుండి Fly leap xerox కాపీని STO గారి Attestation to సమర్పించాలి.*
Please give your comments....!!!