Coronavirus transmission, disease symptoms, treatment, prevention details, instructions by government in Telugu
కరోనా వైరస్ వ్యాపించు పద్దతి, వ్యాధి లక్షణాలు, చికిత్స, చేయకూడని పనులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పద్దతులు, ప్రభుత్వ సూచనలు,
1. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనగా,
కరోనా వ్యాధి ఎలా వస్తుందో తెలిస్తే, అది మనకు చేరకుండా మనం జాగ్రత్త పడగలం. ఇది గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే, గుంపుగా జనం ఉన్నా, అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ, ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా, అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే, వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కావున, వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే, మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
కరోనా వైరస్ వచ్చినట్లు కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు.
అవి
తరచుగా తుమ్మడం,
అదే పని గా కారుతున్న ముక్కు,
అలసట,
ఎక్కువ గా దగ్గు రావడం,
అరుదైన సందర్భాల్లో జ్వరం,
గొంతు మండడం,
తీవ్రతరం ఆస్తమా
reverse transcription polymerase chain reaction పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
చికిత్స
ఈ వ్యాధికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు ఆమోదించబడలేదు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే... భయపడాల్సిన పనిలేదు. మనో ధైర్యంతో నాకేంకాదు, కచ్చితంగా రికవరీ అవుతా అని మనసులో మాటిమాటికీ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం పెరిగేకొద్దీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది. కేరళలో ముగ్గురూ అలాగే రికవరీ అయ్యారు.
తీసుకోవలసిన మందులు
acetaminophen,
ibuprofen,
నొప్పులకు, జ్వరానికి naproxen
వైరస్ సోకినప్పుడు చేయకూడని పనులు:
అతిగా ప్రవర్తించకూడదు.
నీరు ఎక్కువ గా తాగాలి.
ధూమపానం మరియు పొగ ప్రాంతాలను నివారించడం
ఆత్మ విశ్వాసం పోగొట్టు కోకుడదు.
వేడి వాతావరణం ఉన్నా ఆగని కరోనా వైరస్ . కాబట్టి కరోనా వైరస్ మనకు రాకుండా ఉండడానికి తీసుకో వలసిన తగిన జాగ్రత్తలు
ఈ వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే... వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే... ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిదే. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి. అలాగే... ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ఇది షాపుల్లో దొరుకుతుంది. ఒక చిన్న 50 గ్రాముల బాటిల్ రూ.70 నుంచీ రూ.100 దాకా ఉంటుంది. అది కొనుక్కొని రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకొని... రెండు చేతులకూ రాసుకోవాలి. అలా ప్రయాణం చేసిన ప్రతిసారీ రాసుకుంటే... వైరస్ మన చేతులకు చేరదు.
వైరస్ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి... మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మనం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్... ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. మంచి ఆహారం తినండి.
ఫుల్ ఆరోగ్యంతో ఉండేవారి కంటే... జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. కాబట్టి... ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయాణాలు మానుకుంటే బెటర్.
ప్రభుత్వం సూచనలు
రాష్ట్రంలో కొవిడ్-19 (కరోనా వైరస్) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవి...
జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.
పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు.
ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.
దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్ కట్టుకోవాలి.
Please give your comments....!!!