*🌳ఉద్యోగినులకు ఒకపూట విరామం*
🔷అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెసులుబాటు
🔷చర్చలు, సదస్సులు, ఆటల పోటీల్లో పాల్గొనేవారికి అవకాశం
♦అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించే ఆటల పోటీలు, సదస్సులు, చర్చల్లో పాల్గొనేందుకు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ఒక పూట అనుమతినిచ్చింది. శనివారం ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు. ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనేవారికి కార్యాలయాల్లోని విధుల నుంచి ఒకపూట మినహాయింపు ఇవ్వాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆయా రోజుల్లో వాస్తవంగా క్రీడలు, సదస్సులు, చర్చల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ఒక పూట అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.
Please give your comments....!!!