Type Here to Get Search Results !

Instructions to SSC exam invigilator in Telugu

*🔊పదవ తరగతి పరీక్షలు ఇన్విజిలేటర్ కు సూచనలు*

*1. బార్ కోడింగు పరీక్షప్రారంభానికి ముందురోజు ప్రధాన పర్యవేక్షకులు ఏర్పాటు చేసినసమావేశానికి విధిగాహాజరుకావలెను.*

*2. బార్ కోడింగ్ విధానములో జరుగు పరీక్ష రోజులలో ఇన్విజిలేటర్లు 45 నిమిషములు ముందుగానే తమకుకేటాయించిన పరీక్షా హాలుకి వెళ్లి విద్యార్థులకు ప్రధాన సమాధాన పత్రములు, ఓ.యం.ఆర్.ఓటులు ఇచ్చిముందుగా చేయించవలసిన పనులు పరీక్షా సమయానికి 5 నిమిషాలు ముందుగానే పూర్తి చేయవలెను.*

*3. ఏ విధ్యార్థి యొక్క ఓ.యం.ఆర్.సీటు ఆ విద్యార్థికే ఇవ్వవలెను. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించవలెను.*
*తప్పులు జరుగరాదు.*

*4. విద్యార్థి రోలు నెంబరు. ఎచ్చటా వేయరాదు. విద్యార్థి సంతకముకు కేటాయించిన బాక్సు వద్ద మాత్రమే సంతకము చేయవలెను. ఇంక ఎచ్చటనూ సంతకముగాని, పేరుగాని వ్రాయరాదు.*

*5. ప్రధాన జవాబు పత్రము యొక్క మూడు అంకెల సీరియల్ నెంబరును ఓ.యం.ఆర్. షీటులో వేయించవలెను.*
*ఇన్విజిలేటరు మొత్తం వివరాలు చెక్ చేసి సంతృప్తి చెందిన తరువాత మాత్రమే పూర్తి సంతకమును నిర్దేశించిన బాక్సులో పెట్టవలెను.*

*6. ఇన్విజిలేటర్లు ఓ.యం.ఆర్.సీటు పార్టు 1 నందు సూచించబడిన బాక్సునందు, ప్రధాన జవాబు పత్రము, మరియుఅదనపు జవాబు పత్రము నందు తమ పూర్తి సంతకమును చేయవలెను.* *పార్టు-బి, గ్రాఫ్ మరియు మ్యాపునందు ఇన్విజిలేటర్లు తమ ఇనీసియల్ వేయవలెను.*
*1. Answer Booklets Serial Number వరుస క్రమంలో అందరు విద్యార్థులకు అందచేయవలెను. Absent అయిన విద్యార్థి స్థానములో కూడా ప్రధాన సమాధాన పత్రము ఉంచవలెను.*

*8. ప్రధాన సమాధాన పత్రము పై విద్యార్థి చేత పబక్టు, పేపరు వివరాలు పూర్తి చేయించాలి.*
*పరీక్ష అనంతరముఅదనపు సమాధానములు ఉపయోగించిన వాటి సంఖ్యను వేయించవలెను.*

*9. ఏ విద్యాధి యొక్క జ.యం.ఆర్.సీటు ప్రింటెడ్ ది రాకపోతే భాంకుఓ.యం.ఆర్.షీటు తీసుకొని వివరాలుప్రొఫార్మా-11లోపూర్తిచేయవలెను.*

*10. ప్రధాన సమాధానపత్రములు, అదనపు సమాధాన పత్రములు పై ఇన్విజిలేటరు ముందుగా సంతకముచేయరాదు. వాడని బుక్ లెట్స్ తిరిగి ప్రధానపర్యవేక్షకులకు అంద చేయవలసి ఉంటుంది.* *సంతకముతో ప్రధానసమాధాన పత్రములు, అదనపు సమాధాన పత్రములు మిగిలి యుండరాదు.*

*11. ఓ.యం.ఆర్.షీట్స్ ను ప్రధాన సమాధాన పత్రముపైన పెట్టి మార్కు చేయబడిన రెండు చోట్ల సిన్ వేయవలెను.*

పిన్నులపై పేపరు సీల్స్ అంటించవలెను. OMR Sheet Lower Edge, Answer Book Lower Edge కంటే 4
మి.మీ. పైన ఉండేలాగున పిప్ చేయవలెను. ఈ కార్యక్రమము పరీక్షా సమయానికి 5నిమిషముల ముందుగానే పూర్తి
కావలెను.

*12. విద్యార్థులు అదనపు సమాధాన పత్రములు తీసుకున్నప్పుడు ఆ షీటు యొక్క సీరియల్ నెంబరును ప్రాఫార్మా,*
*III లో నమోదు చేసి విద్యార్థి యొక్కసంతకముతీసుకొనవలెను . ప్రొఫార్మా, III రెండు కాపీలు తీసుకొని ఒక కాపీపోస్టు ఎగ్జామినేషన్ మెటీరియల్ తో ప్రభుత్వ పరీక్షల పంచాలకులు, హైదరాబాదు వారికి పంపవలసి ఉంటుంది.ఒక కాపీ సెంటరులో ఉంచవలెను.*

*13. ఓ.యం.ఆర్.ఓటు పై బార్ కోడింగు ప్రాంతములో వ్రాయుటగాని, చెరుపుట గాని చేయరాదని, షీటునలగకుండా పరీక్ష వ్రాయమని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.*

*14. మ్యాప్, గ్రాఫ్. బిట్ పేపరు లపై కూడ విద్యార్థి రోలు నెంబరు, పేరు వ్రాయరాదు. వీటిపై ప్రధాన సమాధానపత్రము పై ఉన్న మూడు అంకల క్రమ సంఖ్యను విద్యార్థిచే వ్రాయించవలెను.*

*15. నా పంబంధీకులు ఎవరు ఈ సెంటరు నందు పరీక్ష వ్రాయుట లేదని ధృవీకరణ పత్రమును ఇవ్వవలెను.*

*16. ఇన్విజిలేటర్లు తమకు కేటాయించిన పరీక్ష హాలుకు వెళ్లినపుడు తమతోసెల్ఫోనులుగాని మరి ఏ ఇతరసమాచారమును తెలియజేయు సాధనములనుగాని తీసుకొనివెళ్లరాదు.*

*17. పరీక్ష పూర్తయిన పిదప విద్యార్ధులనుండి వరుసక్రమములో మీడియం వారీగా తీసుకొనవలెను.*

*♦️ప్రధాన సమాధాన పత్రముతో పాటు విద్యార్థి / విద్యార్థిని బిట్ పేపరు / గ్రాఫ్ / మ్యాప్ ఉన్నచో వాటిని జతచేసినదిలేనిది తప్పక గమనించవలెను.*




Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.