Type Here to Get Search Results !

Amazing Facts 10 Part 2 in Telugu

Amazing Facts మనకు తెలియని కొన్ని విశేషాలు





1. చాక్లెట్లు తినడం వల్ల పళ్ళకు చాలా మంచిది. ఈ చాక్లెట్లు పళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. పళ్ళ అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చాక్లెట్లు అధికంగా తినడం వల్ల స్థూలకాయం అనగా లావు అవడం జరుగుతుంది. కాబట్టి చాక్లెట్లు అతిగా తినడం మంచిది కాదు.

2. ఇంగ్లీష్ భాష కొంత కఠినం అనిపించవచ్చు , ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో రోజుకు కొన్ని కొత్త పదాలు సృష్టించబడుతుంది. ఉదాహరణకు, సెల్ఫీ

3. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే మెదడు పనిచేయడం తగ్గుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

4. చాలావరకు మానసిక సంఘర్షణకు కారణం, అతిగా ఆలోచించడమే. కాబట్టి మానసిక ఒత్తిడికి గురికాకండి.

5. స్వచ్ఛమైన నీటికి రుచి వాసన ఉండదు. స్వచ్ఛమైన నీటి ద్వారా కరెంటు ప్రయాణించదు. అంటే స్వచ్ఛమైన నీటిలో దానిని మనం ముట్టుకుంటే షాక్ కొట్టదు. స్వచ్ఛమైన నీటికి ఉదాహరణ వర్షపు నీరు. చాలామంది వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అంటారు. కానీ ఇది నిజం కాదు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది కానీ వర్షపు నీటి ద్వారా కాదు . దీనికి కారణం వర్షాకాలంలో ఉష్ణోగ్రత తగ్గి జలుబు చేసే వైరస్ త్వరగా వ్యాపిస్తుంది.

6. చాలామంది మనుషులు నిద్రపోయే ముందు వారు ఏదైతే కావాలని కోరుకుంటారో దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు అంట.

7. ఒకసారి చార్లీ చాప్లిన్ లాగా ఉండే వ్యక్తుల కోసం పోటీ నిర్వహించారు. ఆ పోటీలో చార్లీ చాప్లిన్ కూడా పాల్గొన్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ పోటీలో పాల్గొన్న చార్లీ చాప్లిన్ ప్రైస్ గెలుచుకున్నాడు

8. ఒక రోజుకు సాధారణంగా ఆడవారు ఏడు వేల పదాలు మాట్లాడితే, మగవారు రెండు వేలు మాత్రమే మాట్లాడుతాడు అంట.

9. మామూలు గా చదివిన దానికంటే పాటలు గానీ, సంగీతం గాని, వింటూ చదవడం వల్ల చదివినది ఎక్కువగా గుర్తుంటుంది. దీనికి కారణం మెదడు యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి తక్కువ సౌండ్ తో సంగీతం వింటూ చదువుకోండి.

10. పాటలు పాడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్రేకం తగ్గుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందడం సులభంగా మారుతుంది. కాబట్టి పెద్ద సింగర్ గా కాకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అయినా ఏదో రకంగా పాటలు వాడడం ఆరోగ్యానికి మంచిది.
Category

Top Post Ad

Bottom Post Ad