Type Here to Get Search Results !

Amazing Facts ఇవి మీకు తెలుసా ?


1. భూకంపం ను పాములు ముందే గుర్తిస్తాయి ఎందుకంటే భూమి మీద ఏర్పడే ప్రకంపన ద్వారా వినికిడి గ్రహించే శక్తి వీటికి ఉంటాయి.
2. అచ్చం ఆకు లాగా ఉండే ఒక కీటకం ఉంది .దీనిని దగ్గర్నుంచి చూసినా కూడా ఇది కీటకం అని మనము గుర్తుపట్టలేము.
3. మన భూమి మీద ఒక చోట గురుత్వాకర్షణ చాలా తక్కువగా ఉంటుంది ఆ చోటు పేరే హడ్సన్ బే ఇది కెనడా లో ఉన్నది. భూమ్మీద అన్ని ప్రదేశాల కంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమికి ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
4. మన శరీరంలో కనురెప్ప దగ్గర ఒక రంధ్రం ఉంటుంది ఇది కంటి నుండి వచ్చిన కన్నీరు సేకరిస్తూ ఉంటుంది.
5. భూమి మీద దక్షిణ ధృవం వద్ద ఇలాంటి టైమ్ జోన్ అనేది ఉండదు ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోరకమైన సమయాన్ని పాటిస్తారు ఎందుకంటే రేఖాంశాలు అన్నీ కూడా దక్షిణ ధృవం వద్ద చేరుతాయి అందుకే వేరువేరు సమయాల్లో ను కలిగి ఉంటుంది.
6. కరుణ వైరస్ నేపథ్యంలో ప్రపంచ మంతటా లాక్ డౌన్ పాటిస్తున్న ఫలితంగా ఓజోన్ పొర పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుందట దీనికి కారణం వాతావరణ కాలుష్యం తగ్గడమే.
7. ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత రెండు అంగుళాలు పెరుగుతారట . దీనికి కారణము అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేక పోవడమే . గురుత్వాకర్షణ శక్తి తగ్గిన కొద్దీ మనిషి పొడవు పెరగడం గురుత్వాకర్షణ శక్తి పెరుగినప్పుడు మనిషి పొట్టిగ అవడం జరుగుతుంది.
8. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు యాంటీ మ్యాటర్.
9. దాదాపు వంద సంవత్సరాల క్రితం సాధారణ వ్యక్తులు గుర్రం మీద తిరిగితే ధనికులు కార్ల మీద తిరిగే వారు కానీ ఇప్పుడు సాధారణ వ్యక్తులు కార్ల మీద తిరుగుతూ ధనికులు మాత్రం గుర్రాల మీద వెళ్తున్నారు.
10. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ పడుకునే సమయంలో తమని తాము ఒక బ్యాగ్ లో ఉంచుకొని తమను తాము కట్టేసుకుంటారు. ఎందుకంటే గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల నిద్రలో వారు అటు ఇటు వెళ్ళిపోయి దెబ్బలు తగులుతాయి అని.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.