Type Here to Get Search Results !

AP Guidelines for preparation of students promotion list in Telugu

ఈ విద్యా సంవత్సరం 2019-20 ప్రమోషన్ లిస్ట్ కట్టుటకు సూచనలు

  నాలుగు ఫార్మేటివ్స్ కలిపి 20 కి రెడ్యూస్ చేసి, దానికి సమ్మేటివ్-I 80 కలిపి 100 కి లెక్కించవలెను. ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.
క్రింద ఇవ్వబడిన విధముగా ప్రమోషన్ లిస్ట్ లు తయారు చేయ వలెను.

ఎ) I నుండి V & VI నుండి IX వరకు తరగతుల   ప్రమోషన్ల జాబితాను సెపరేట్ గా సిద్ధం చేయవలెను
బి) VI నుండి IX వరకు తరగతుల 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు,  మరియు  ఎస్‌.ఏ -1, ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను  కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.
సి) I నుండి V  తరగతులకు 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు,  మరియు  ఎస్‌.ఏ -1, మరియుఎస్‌.ఏ -2 ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను  కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.
డి) 2019-20 విద్యా సంవత్సరానికి చివరి పని దినం 18-03-2020.

  పై విషయాలను  అందరూ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు / మండల విద్యాశాఖాధికారులు / డిఐ / తమ పరిధిలో గలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కు సూచనలను జారీయవలెను.

VI నుండి IX తరగతులకు సమ్మటివ్ అసెస్‌మెంట్- II పరీక్షలు రద్దు కాబడినవి. మరియు VI నుండి IX తరగతుల విద్యార్థులందరినీ "ALL PROMOTED"  గా ప్రకటించవలెను.

★ ★ ★ ★ ★

ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయునది విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని  18-3-2020 వరకు లెక్కించాలి.
గౌరవ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు తెలియ  జేయునది ఏమనగా

చాలామంది ప్రమోషన్ లిస్ట్ ల గురుంచి చాలా  డౌట్స్ అడుగుచున్నారు.

ప్రమోషన్ లిస్ట్స్ అన్ని managements కు ఒక్కటే.

1 నుం డి 5 వ తరగతి వరకు అన్ని exams పూర్తయ్యినవి  కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ మరియు percentage వేస్తారు.
అటెండెన్స్ మాత్రం మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి   percentage వేస్తారు.
అన్ని బాగుంటే లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 ,అయ్యేది .కానీ ఈ అకడమిక్ ఇయర్ లో last వర్కింగ్ day  మార్చ్ 18 గా భావించవలెను.
ప్రమోషన్ లిస్ట్ తయారు చెయ్యటం లో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండకపోవొచ్చు.
ఇక Highschool వారు కూడా  last working day March 18 గానే పరిగణనలోకి తీసుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.
హై స్కూల్స్ వారికి 4 FA లు ,SA-1  పరీక్షలు మాత్రమే  జరిగాయి  కనుక వాటికే  మార్క్స్ వెయ్యాలి.
గమనిక:(హై స్కూల్స్ వారికి)
4 FA =4×50=200/10 చేసినచో FA మార్క్స్ 20 కి రెడ్యూస్ అవుతాయి.వీటికి SA-(1): 80 మార్క్స్ ను కలిపి 100 కి లెక్కించవలెను.
ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.
మరొక గమనిక:
(8TH & 9TH తరగతుల P.S.& N.S. కొరకు)
4 FA మార్కులను 20చే భాగించి గణించవలెను
ఈ సారి Marks పూర్తి గా లేవు కనుక  అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము కనుక అందరకు ప్రమోట్ అని వ్రాయాలి.
పాస్ అని వ్రాయకూడదు.

1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ మరియు PERCENTAGE వేస్తారు.
అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి   PERCENTAGE వేస్తారు.
ఈ అకడమిక్ ఇయర్ లో LAST WORKING DAYమా ర్చ్ 18 గా భావించుకోవాలి.
ప్రమోషన్ లిస్ట్ తయారుచెయ్యడంలో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండబోవు.
ఇక UP వారికి HIGHSCHOOLs వారికి LAST WORKING DAY March 18 గా భావించుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.
ఈ సారి MARKS పూర్తిగా లేవు కనుక  అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము.
కనుక అందరికీ PROMOTED అని వ్రాయాలి.పాస్ అని వ్రాయకూడదు.
(పై విషయాలను కొందరు MEO గార్లు సలహా ఇచ్చారని తెలియజేస్తున్నాను)
C. M   (  20 Marks)
S.A.1  (  80 Marks) (SA 2 నిర్వహించలేదు)
Total  (100 Marks)

Related Forms and Software will be posted Shortly...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.