ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు.
ఈరోజు DEO గారిచే జరిగిన సమావేశం లోని ముఖ్యాంశాలు.
1. 27 . 8 . 2020 నుండి ఉపాధ్యాయులందరూ విధిగా హాజరు కావాలి .27.8.2020 నుండి నూతన అకాడమిక్ ఇయర్ గా బావిస్తూ రిజిస్టర్ వ్రాసి సంతకాలు చేయాలి.
2. 22.3 .2020 నుండి 26. 8 .2020 వరకు అటెండెన్స్ రిజిస్టర్ యందు పేర్లు వ్రాసి lock down period గా నమోదు చేయాలి.
3. తరగతి వారి అటెండెంట్ రిజిస్టర్ లో పేర్లు వ్రాసి సిద్ధం చేసుకోవాలి
4. 27. 8 .2020 నుండి admissions ఈ ప్రక్రియ ప్రారంభించాలి. అడ్మిషన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించాలి .
5.తాము బోధించే తరగతి వారీగా వర్క్ షీట్ SCERT Website నుండి download చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. లెవెల్ వన్ బేస్ లైన్ మదింపు ఒకటి నుంచి నాలుగు వారాలు ,లెవెల్ టు బోధన అనంతరం మదింపు.
6. విద్యార్థులందరూ 1.8 .2020 నుండి TSAT మరియు దూరదర్శన్ చానల్ లో ప్రసారమయ్యే ఆన్లైన్ తరగతులు 100% హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి ,TV లేని విద్యార్థులను తోటి విద్యార్థుల ఇండ్ల లో కానీ సర్పంచ్ సహకారంతో గ్రామ పంచాయతీలలో టీవీ ఏర్పాటు చేసి COVID నిబంధనలు పాటిస్తూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి , కేబుల్ ఆపరేటర్స్ ని సంప్రదించి TSAT దూరదర్శన్ చానల్ అంతరాయం లేకుండా ప్రసారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
7.కాంప్లెక్స్ HMs ,సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ తరగతులు పై నిరంతర పర్యవేక్షణ చేయాలి.
8. తరగతి వారీగా విషయవారిగా e content తయారు చేసుకోవాలి.
9. ఉపాధ్యాయులందరూ 27. 8 .2020 రోజు తమ మాతృ పాఠశాలల్లోనే హాజరు కావాలి తదనంతరము మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయబడతాయి.
10. అందరూ covid19 నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా పాఠశాలలకు హాజరుకావాలని సూచించడమైనది .
Please give your comments....!!!