*🔊తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి కరోనా వ్యాక్సినేషన్💉💉*
👉💉💉నేడు రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాను టీకా తీసుకుంటానని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
*పంపిణీ కేంద్రాలు: 3006*
*ఎంతమందికి: 3 లక్షల మంది*
*సందేహాల కోసం: 1075 టోల్ ఫ్రీ నెంబరు*
*♦️ఇవి గుర్తుంచుకోవాలి..♦️*
*✡కొవిడ్ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.*
*✡యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్ టీకా ఇవ్వాలి.*
*✡గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.*
*✡కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.*
*✡టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.*
*✡టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.*
*💉💉తొలి దశలో ఎవరికి?*
*🔅ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ కార్యకర్తలు*
*🔅నర్సులు, సూపర్వైజర్లు*
*🔅వైద్య అధికారులు*
*🔅పారామెడికల్ సిబ్బంది*
*🔅సహాయక సిబ్బంది*
*🔅వైద్య విద్యార్థులు*
*✅రెండోదశలో..*
*🔅ఫ్రంట్‌లైన్ వర్కర్లు*
*🔅మున్సిపల్ కార్మికులు*
*✅మూడోదశలో.*
*
*🔅50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు*
*🔅ఇతర వ్యాధులు ఉన్న 50 ఏళ్లలోపు వారికి*
*✅టీకా కోసం రిజిస్టర్ చేశారా?*
*🔅కొ-విన్ వెబ్సైట్లో సొంతంగా పేరు నమోదు చేసుకోవాలి.*
*🔅ఫొటో ఐడీ అప్లోడ్ చేయాలి.*
*🔅ఆధార్ కార్డు వివరాల ద్వారా కొ-విన్లో ఆధార్ అథెంటికేషన్ చేసుకోవచ్చు.*
*🔅జాబితాను అనుసరించి టీకా అందించే తేదీ, సమయాన్ని వెల్లడిస్తారు.*
*🔅రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తారు.*
*🔅కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ సౌలభ్యం లేదు.*
*✅టీకా ఎక్కడ లభిస్తుంది?*
వాక్సిన్ కేంద్రాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
*🔅నియమిత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కేంద్రాలు*
*🔅ఔట్రీచ్ కేంద్రాలు*
*🔅సుదూర ప్రాంత ప్రజలు, అంతర్జాతీయ సరిహద్దులో నివసించే వారికోసం ప్రత్యేక మొబైల్ టీమ్‌ల ద్వారా టీకా పంపిణీ*
*✅వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా.*.
*
*🔅టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లడం*
*🔅గుర్తింపు పత్రాల ధ్రువీకరణ*
*🔅టీకా స్వీకరించడం*
*🔅30 నిమిషాల పాటు పర్యవేక్షణ*
*🔅ప్రతికూల ప్రభావాలు లేకుంటే బయటకు వచ్చేయడం.*
*💁♀️💉💉కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి.. పూర్తి వివరాలివే..*
*
*🔰💉💉దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. కరోనాపై పోరాటానికి ఒక సంజీవిని లాంటింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా అనుమతించబడిందిసిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయి*.
*🍁💉💉వ్యాక్సిన్ పొందాలంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?*
*🔰💉♦️అప్లికేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోవిన్ (CoWin -Covid vaccine Intellignce work) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐదు పద్దతులలో ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ పద్దతి, రిజిస్ట్రేషన్ పద్దతి, వ్యాక్సినేషన్ పద్దతి, బెనిఫిషరీ ఆకానాలెడ్జమెంట్ పద్దతి, రిపోర్టు పద్దతి. ఈ పద్దతుల్లో సులభంగా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషణన్ చేసుకోవచ్చు. అయితే కోవిన్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ దరఖాస్తు పద్దతి ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. సాధారణ ప్రజలు కోవిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోలేరు. ప్రస్తుతానికి అధికారులు మాత్రమే అనుమతి ఉంది. కోవిన్ యాప్ లేదా వెబ్ సైట్ లో మూడు ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ రిజిస్ర్టేషన్, వ్యక్తిగత రిజిస్ట్రేషన్, ఒకేసారి పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
*🍁కోవిడ్ వ్యాక్సిన్ పొందడానికి కావాల్సిన పత్రాలు..*
*🔰కోవిడ్ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఫొటో అప్ లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు దరఖాస్తు చేసుకోగానే మెసెజ్ పొందుతారు. కోవిడ్ వ్యాక్సిన్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నట్లు మెసేజ్ పొందుతారు. రెండో మెసేజ్ లో తేదీ, సమయం, వ్యాక్సినేషన్ కేంద్రం వివరాలను పొందగలరు. మూడో మెసేజ్ లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ గురించి ఉంటుంది*.
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
0 Comments
Please give your comments....!!!