Type Here to Get Search Results !

Duties of Committee and Charts to be displayed in school while re Opening in Telugu

*కమిటీలు*

*మధ్యాహ్న భోజన కమిటి*

*★ప్రతిరోజు వంట వండే ముందు, వంట గది, వంట పాత్రలు, బియ్యం, సరుకులు, శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి*

*★వంటల దగ్గర బయట వ్యక్తులను అనుమతించరాదు*

*★భోజనం సమయంలో గుంపులు గుంపులుగా చేరకుండా "క్యూ" పద్దతిని పాటించేటట్లు చూడాలి*

*★నీటి కుళాయి దగ్గర భౌతిక దూరం పాటించాలి.*

*పరిశుభ్రత కమిటి*

*★పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి.*

*★పాఠశాలలో ఉన్న బెంచీలు, కుర్చీలు, బీరువాలు వంట గది, ప్రయోగశాల, గ్రంథాలయం మొ,, ప్రదేశాలు గాలి, వెలుతురు ఉండేటట్లు గదులు శుభ్రం చేసుకోవాలి*

*★చేతులు శుభ్రం చేసుకొనేటట్టు ఏర్పాటు చేసుకోవాలి.*

*★ ధర్మామీటరు, సబ్బులు, హ్యాండ్ వాష్, శానిటైజర్ ఏర్పాటు చేసుకోవాలి*

*★అత్యవసర పరిస్థితులలో వైద్య సదుపాయం కొరకు విద్యార్ధులను ఆసుపత్రులకు తీసుకవెళ్ళడానికి "టీం" అందుబాటులో ఉండాలి*

*అవసరాల కమిటి*

*★ విద్యార్థులు తప్పక మాస్కు ధరించవలెను*

*★విద్యార్ధులు తప్పక భౌతిక దూరం పాటించవలెను*

*★ ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా కనీసం 6 అడుగుల దూరంలో కూర్చోబెట్టాలి.*

*★ప్రతి విద్యార్థికి ఒక బెంచీని కేటాయించాలి*

*★విద్యార్ధులు ప్రవేశం మరియు బయటకు వెళ్ళు మార్గాలు వేరు వేరుగా ఏర్పాటుచేయాలి.*

*★విద్యార్ధుల పట్ల తీసుకోనే "కరోనా" జాగ్రత్తలు వారి  తల్లిదండ్రులకు తెలియజేయాలి*

*★విద్యార్ధుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి*

*★విద్యార్ధులు పరిసరాలలో, తిరిగే ప్రదేశాలలో ఉమ్మి వేయకుండా నిరోధించాలి*

*★విద్యార్ధులు నీళ్ళు త్రాగే చోట, మధ్యాహ్న భోజనం వద్ద టాయిలెట్ వద్ద సూచించిన వలయంలో మాత్రమే నిలబడాలి.*

*వైద్య సదుపాయ కమిటి*

*★అత్యవసరములో వినియోగించుకొనేందుకు దగ్గరలో గల (ప్రభుత్వ ఆసుపత్రి )డాక్టర్ల ఫోన్ నెంబరుఅందుబాటులో ఉంచుకోవాలి*

*★కరోనా లక్షణాలు ఉన్నట్లయితే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వేరువేరుగా ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేయాలి*

*★ఒక వేళ అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తే రవాణా సౌకర్యాన్ని కల్పించాలి.*

*★విద్యార్ధులకు “కరోనా" లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి*












Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.