*ప్రమోషన్ జీవోల్లో భారీ మార్పులు! *
*GO Ms No 11 మరియు 12 తేదీ: 23.1.2009 సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తేదీ:5.2.2021 నాడు GO 2 మరియు GO 3లను జారీ చేసింది. తాజా జీవోతో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ etc) ప్రమోషన్ల విధానాన్ని సవరించింది. ఇప్పటి వరకు SGTలు సహా అర్హతలు ఉన్న భాషా పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్ కల్పించే వారు. నిన్న జారీ చేసిన 2 మరియు 3 జీవోల ప్రకారం ఇకపై భాషా పండిట్లకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్ కల్పిస్తారు. SGTలు ఇకపై స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్లకు అర్హులు కారు. *
*అదే విధంగా..... మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (మాథ్స్/ఫిజికల్ సైన్స్/బయో సైన్స్/సోషల్/ ఇంగ్లీష్/PD)లను ఇకపై SGT, PET, Art, Drawing, Music etc.. టీచర్లకు ప్రమోషన్ కల్పించి భర్తీ చేస్తారు. ఈ ఆరు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు LPలకు ప్రమోషన్లు ఇవ్వరు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి భారీ మార్పులే. *
Please give your comments....!!!