*FAC HMలు... గ్రీన్ ఇంక్ పెన్!*
*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు గత ఆరేళ్లుగా టీచర్లకు ప్రమోషన్లు కల్పించకపోవడంతో ఖాళీగా ఉన్నయ్! స్కూల్ అసిస్టెంట్లే ఇంచార్జి హెడ్మాస్టర్లుగా పని చేస్తున్నారు. ఇంచార్జి హెడ్మాస్టర్లు గ్రీన్ ఇంక్ పెన్ వాడొచ్చా? హెచ్ఎం కుర్చీలో కూర్చోవచ్చా? అని పలువురు అడుగుతుండడంతో ఈ పోస్టింగ్ పెడుతున్నా!*
*గ్రీన్ ఇంక్ పెన్ ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు? అనే విషయం DOMలో కానీ ఇతర ఈ జీవోలో కానీ ఎక్కడా లేదు. గెజెటెడ్ ఆఫీసర్స్ గ్రీన్ ఇంక్ పెన్ వాడొచ్చనే జీవో కానీ, రూలు కానీ ఏం లేదు. సిగ్నచర్ డిఫరెంట్ కోసం మాత్రమే గ్రీన్ ఇంక్ పెన్ వాడడం! హైస్కూల్ హెచ్ఎంలు గ్రీన్ ఇంక్ పెన్ వాడుతున్నారు. కాబట్టి, FAC HM వాడొచ్చు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రశ్న కరీంనగర్ జిల్లాలోని ఒక FAC HM అడిగితే గ్రీన్ ఇంక్ పెన్ నిరభ్యంతరంగా వాడొచ్చని చెప్పాను. దాంతో ఆ FAC HM సాలరీ బిల్లులపై గ్రీన్ ఇంక్ పెన్ తో సంతకాలు చేసి, STOలో సబ్మిట్ చేస్తే సదరు STO గ్రీన్ ఇంక్ పెన్ తో Signature చేశారంటూ బిల్స్ రిజెక్ట్ చేశారు. అప్పుడు FAC HM విషయాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. వెంటనే నేను STOతో మాట్లాడాను. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు పెట్టొద్దు, రెడ్ లేదా బ్లూ ఇంకుతో మాత్రమే సంతకాలు చేయాలంటూ నాతో కూడా సేమ్ అదే వల్లేవేశారు. అప్పుడు నేను ఆ STOకు రెండు ప్రశ్నలు వేశాను.*
*> గెజెటెడ్ ఆఫీసర్స్ గ్రీన్ ఇంక్ పెన్ వాడాలని ఎక్కడ ఉంది?*
*> మీరు STO కదా! మీరు గ్రీన్ ఇంక్ ఇంక్ పెన్ యూజ్ చేస్తున్నారు కదా! ఒక STO గ్రీన్ ఇంక్ పెన్ వాడాలని జీవో, మెమో, ప్రొసీడింగో చూపగలరా?*
*అని సూటిగా అడిగాను. ఆయన సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వలేదనడం కంటే, నేను అడిగిన వాటికి ఆయన దగ్గర జవాబుల్లేవనడం కరెక్టు. అయినా... బిల్స్ పాస్ చెయ్యలేదు. ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ దృష్టికి STO చేస్తున్న కిరికిరి గురించి వివరించి... STOతో బిల్స్ పాస్ చెయ్యాలని చెప్పండని కోరాను. అప్పుడు సమస్య పరిష్కారమైంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. కాబట్టి, FACHMలు ‘హెడ్’ కుర్చీలో కూర్చోవచ్చు. గ్రీన్ ఇంక్ పెన్ బాజాప్తాగా వాడొచ్చు.*
*-మానేటి ప్రతాపరెడ్డి.*
కానీ , ఇన్ ఛార్జ్ హెడ్ మాస్టర్ లు గ్రీన్ పెన్ వాడకూడదు. HM కుర్చీలో కూర్చుని ఉండొద్దు. TC లు ఇవ్వకూడదు.
0 Comments
Please give your comments....!!!