Type Here to Get Search Results !

Few details about family pension in Telugu

*As per Old Pension (GPF)*

*కుటుంబ పింఛన్ కొన్ని ముఖ్యాంశాలు:*

☸ *ఉద్యోగిగా ఉంటూ మరణించినా, పదవీ విరమణ చేసిన తర్వాత మరణించినా అతను/ఆమె కుటుంబమునకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.*

☸ *సర్విసులో ఉండి మరణిస్తే మొదటి 7 సంవత్సరాల వరకు,ఉద్యోగి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్ గా చెల్లిస్తారు.తదుపరి చివరినెల జీతంలో 30% పెన్షన్ గా చెల్లిస్తారు.*

☸ *పెన్షనరుగా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా పెన్షన్ ఏది తక్కువైతే అది,పదవీ విరమణ తేది నుండి 7 సంవత్సరాల కాలము లేదా ఉద్యోగికి 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే తేది ఏది ముందు అయితే ఆ తేది వరకు చెల్లించబడును.*

☸ *పెన్షనర్ రిటైరైన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.*

☸ *రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది.*

☸ *అదృశ్యమైన, ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తరువాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.*

☸ *సంపాదనా పరులు కాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది.*

☸ *పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.*

☸ *కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.*

☸  *ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుంటే, ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది*- *Rule 50{(5)(I)*

☸ *50% ఎన్ హన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే కనీసం 7 సంవత్సరాల సర్వీసు కలిగి ఉండాలి. 7 సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు.*

☸ *వితంతువులకు కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులందరికి సమానవాటాలు చెల్లిస్తారు*- *Rule 50(6)(A)(1)*

☸ *చనిపోయిన మొదటి భార్య పిల్లలు, రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్ వాటకు అర్హులు*- *Rule 50(6)(B)*

☸ *రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని పెళ్ళి చేసుకున్న మహిళ కూడా ఫ్యామిలీ పెన్షనర్ కు అర్హులే*- *50(12)(B)(I)* &
*G.O.Ms.No.335 F&P తేది:15.9.1993*

☸ *రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందు సందర్భంలో మొత్తం రూ.27,830 కు పరిమితం*- *50(10)(b)(c)* & *G.O.Ms.No.245 F&P తేది:4.9.2012*

☸ *రిటర్మెంట్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత కలిగి ఉంటారు* - *50(12)(b) Note 2(III)* & *G.O.Ms.No.236 F&P తేది:28.5.1994*

☸ *మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకుంటే, రెండవ భార్య కుటుంబ పెన్షనుకు అర్హురాలు కాదు.*
*Cir.Memo.No.4027/B/26/pension-I/87 Fin తేది:20.8.1991*

☸ *విడాకులు పొందిన భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్ లో వాటకు అర్హులే.*
*G.O.Ms.No.20 F&P తేది:24.1.1981*

☸ *స్పెషల్ టీచరు సర్వీసు పెన్షనుకు లెక్కించబడుతుంది.*
*G.O.Ms.No.92 Edn తేది:8.8.2000*

☸ *అప్రంటీస్ పీరియడ్ పెన్షన్ కు లెక్కించబడదు*
*Rule 16 of A.P Revised Pension Rules-1980*

*సందేహం*

*Cps ఉద్యోగులకు గ్రాడ్యుటీ ఉన్నదా  సర్, డెత్ గ్రాడ్యుటీ వుంది అని తెలుసు కానీ మాములుగా రిటైర్మెంట్ గ్రాడ్యుటీ ఉన్నదా తెలుపగలరు*

*జవాబు*

*సిపిఎస్ ఉద్యోగులకు జిపిఎఫ్ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీ రెండు ఉన్నవి దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు👇👇*

Download

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night