*🔥ఈజీగా ‘పది’ పాసవుదాం!🔥*
*🖊️ఇంగ్లిష్🖊️*
*👉ఇంగ్లిష్ 80 మార్కులు ఒకటే పేపర్. సమయం 3 గంటల 15 నిమిషాలు*
*👉ఇందులో పార్ట్ -ఎ 40 మార్కులు, పార్ట్- బి 40 మార్కులుగా విభజించారు.*
పార్ట్ -ఎ 40 మార్కులు. సమయం 1గం. 30ని.
ప్ర. (1-5) (10 మార్కులు)
గద్యభాగం ఒక పేరా ఇస్తారు. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 10 మార్కులు
ప్ర. (6-10) (10 మార్కులు)
గద్యభాగం ఒక పేరా ఇస్తారు. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 10 మార్కులు.
ప్ర. (11) (12 మార్కులు)
ఇందులో కొన్ని క్లూస్ ఇస్తారు. వాటి అధారంగా ఊహించి ఒక సంభాషణ రాయాలి (లేదా) ఒక లేఖ (లెటర్ రైటింగ్) రాయమంటారు. ఏదో ఒకటి రాయాలి. దీనికి 12 మార్కులు.
ప్ర. (12) (8 మార్కులు)
ఇందులో ఏదైనా మెసేజ్ (లేదా) పోస్టర్ తయారీ రాయమంటారు. దీనికి 8 మార్కులు.
పార్ట్ - బి 40 మార్కులు. సమయం 1 గం. 45 ని.
ప్ర. (13-17) (5 మార్కులు)
ఇందులో పద్య లేదా గద్య భాగాన్ని ఇస్తారు. దీనిని చదివి (13-17) 5 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటికి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 5 మార్కులు కేటాయించారు.
ప్ర. (18-22) (5 మార్కులు)
ఇందులో (18-22) 5 వాక్యాల్లో కొన్ని పదాలు తప్పుగా ఉంటాయి. వాటిని సరిచేసి వాక్యాలు రాయాలి. వీటికి 5 మార్కులు కేటాయించారు.
ప్ర. (23-27) (10 మార్కులు)
ఇందులో (23-27) ఇచ్చిన గద్యభాగంలో కొన్ని చోట్ల అండర్‌లైన్ చేశారు. వాటిని సూచించిన విధంగా సరిచేసి వాక్యాలు రాయాలి. వీటికి 10 మార్కులు కేటాయించారు.
ప్ర. (28-32) (5 మార్కులు)
దీనిలో (28-32) ఇచ్చిన గద్యభాగంలోని 5 ఖాళీలను సరైన పదాలతో పూరించాలి. ప్రతి ఖాళీకి బహుళైచ్ఛిక సమాధానాలు ఉంటాయి. సరైన పదాన్ని గుర్తించాలి. వీటికి 5 మార్కులు కేటాయించారు.
ప్ర. (33-37) (5 మార్కులు)
దీనిలో (33-37) ఇచ్చిన గద్యభాగంలోని 5 ఖాళీలను సరైన పదాలతో పూరించాలి. ప్రతి ఖాళీకి రెండు పదాలు ఉంటాయి. అందులో సరైన పదాన్ని గుర్తించాలి. వీటికి 5 మార్కులు కేటాయించారు.
ప్ర. (38-42) (5 మార్కులు)
దీనిలో (38-42) ఇచ్చిన గద్యభాగంలోని 5 ఖాళీలను సరైన పదాలతో పూరించాలి. ప్రతి ఖాళీకి ఒక పదం ఇస్తారు. ఆ పదాన్ని సరిచేసి రాయాలి. వీటికి 5 మార్కులు కేటాయించారు.
ప్ర. (43-47) (5 మార్కులు)
దీనిలో (43-47) ఇచ్చిన గద్యభాగంలోని 5 పదాలను అండర్‌లైన్ చేసి ఉంచుతారు. వాటిని సూచించిన విధంగా సరిచేసి రాయాలి. వీటికి 5 మార్కులు కేటాయించారు.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
Telugu guideline and model paper
Telugu model test
Maths TM & EM
*🔥సాంఘిక శాస్త్రం🔥*
*👉సాంఘిక శాస్త్రం 80 మార్కులు ఒకటే పేపర్ సమయం 3 గం.15 ని.*
*👉ఇందులో పార్ట్ -ఎ 60 మార్కులు, పార్ట్ -బి 20 మార్కులుగా విభజించారు.*
*👉పార్ట్ -ఎ మూడు సెక్షన్‌లుగా ఉంటుంది. 60 మార్కులు సమయం 2గం. 45ని.*
సెక్షన్ -1 (12 మార్కులు) ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి 3 ప్రశ్నలు రాయాలి. (6x2=12)
గ్రూపు-ఎ: 6 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు మొత్తం 6 మార్కులు.
గ్రూపు-బి: 6 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2మార్కులు మొత్తం 6 మార్కులు.
సెక్షన్ -2 (16 మార్కులు) ఇందులో 8 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 16 మార్కులు (4x4=16)
సెక్షన్ -3 (32 మార్కులు) ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి 2 ప్రశ్నలు రాయాలి. (4x8=32)
గ్రూపు-ఎ: 4 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు మొత్తం 16 మార్కులు.
గ్రూపు-బి: 4 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు మొత్తం 16 మార్కులు.
పార్ట్ - బి 20 మార్కులు సమయం - 30 ని.
ఇందులో 20 కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
Thanks a lot for sharing this knowledge. This is really good information. undestanding blog. Sri Sanjeevni Junior College in Hyderabad
ReplyDeletePlease give your comments....!!!