Physical Science
*🔥ఈజీగా ‘పది’ పాసవుదాం!🔥*
*🔥తెలుగు🔥*
*👉తెలుగు 80 మార్కులు ఒకటే పేపర్ సమయం 3 గం.15 నిమిషాలు*
*👉ఇందులో పార్ట్ -ఎ 60 మార్కులు, పార్ట్- బి 20 మార్కులు గా విభజించారు.*
పార్ట్ -ఎ 60 మార్కులు సమయం 2గం.45 ని.
సెక్షన్ -1 (20 మార్కులు)
అ. అపరిచిత గద్యం ఒక పేరా ఇస్తారు. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 5 మార్కులు
ఆ. రెండు పద్యాలు ఇస్తారు. ఒకదాన్ని మాత్రమే పూరించాలి. దీనికి 5 మార్కులు
ఇ. ఒక పేరా ఇస్తారు. దీనిని చదివి 5 ప్రశ్నలను తయారు చేయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 10 మార్కులు కేటాయించారు.
సెక్షన్ -2 (32 మార్కులు)
అ. 4 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు (2x4=8)
ఆ. 4 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు (2x4=8)
ఇ. 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు పది వాక్యాల్లో సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకు 8 మార్కులు (1x8=8)
ఈ. 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు పది వాక్యాల్లో సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకు 8 మార్కులు (1x8=8)
సెక్షన్ -3 (8 మార్కులు)
ఉ. మూడు సృజనాత్మక ప్రశ్నలు ఇస్తారు. అవి ఇంటర్వ్యూ ప్రశ్నావళి, మిత్రునికి లేఖ, చర్చ సంభాషణ వంటి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఒకటి రాయాలి. 8 మార్కులు. (1x8=8)
పార్ట్ - బి 20 మార్కులు. సమయం 30 ని.
దీనిలో రెండు సొంత వాక్యాలు, 8 పదజాలానికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 వ్యాకరణానికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 మార్కులు కేటాయించారు.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
తెలుగులో కనీస అవగాహనతో పార్ట్ బిలో 20 మార్కులు, అపరిచిత గద్యానికి 5 మార్కులు, ప్రశ్నలు చేయడం ద్వారా 5 మార్కులు, సృజనాత్మక ప్రశ్నకు 8 మార్కులు మొత్తం 38 మార్కులు కేవలం విషయ అవగాహనతోనే కష్టపడకుండా సంపాదించుకోవచ్చు.
Thanks a lot for sharing this knowledge. This is really good information. undestanding blog. Sri Sanjeevni Junior College in Hyderabad
ReplyDeletePlease give your comments....!!!