ప్రతిరోజు ఊ విద్యార్థుల హాజరు ఆన్లైన్ చేయవలసి ఉన్నది ఇది ఇది ఇది త్వరగా తొందరగా ఒక నిమిషం కాలంలో 50 మందిని అటెండెన్స్ ఎలా వేయాలో ఈ క్రింద దశలు చూడండి. హాజరు వేసే సమయంలో ప్రగతి విద్యార్థుల హాజరు రిజిస్టరు దగ్గర ఉంచుకోండి లేదా ఒక్కొక్క తరగతి లో ఎవరెవరు బడికి రాలేదో వారి పేర్లు గుర్తు పెట్టుకున్న సరిపోతుంది. బడికి రాని వారి పేర్లను గుర్తుపెట్టుకున్నట్లు అయితే విద్యార్థుల హాజరు రిజిస్టరు అవసరం లేదు.
సులభంగా మరియు వేగంగా విద్యార్థుల హాజరు ఆన్లైన్ ఎలా చేయాలో ఈ క్రింద చూడండి.
మొదటి స్టెప్:
పైన గల లింక్ మీద క్లిక్ చేస్తే విద్యార్థుల హాజరు ఆన్లైన్ చేసే వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది.
రెండవ దశ:
పైన బొమ్మలో చూపిన విధంగా వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది ఈ క్రింద చూపిన బొమ్మలు విధంగా ఎంటర్ యూజర్నేమ్ అనే మొదటి డబ్బాలో పాఠశాల u dise code నమోదు చేయాలి. రెండవ డబ్బాలో మీ పాఠశాల పాస్వర్డ్ను నమోదు చేయాలి. మూడవ డబ్బాలో అక్కడ కనపడుతున్న నంబర్ను నమోదు చేయాలి తర్వాత సబ్మిట్ ను నొక్కాలి.
గమనిక : పాస్వర్డ్ను మీకు తెలియకపోయినా మీరు మర్చిపోయిన మండల అధికారి ని గాని, లేదా MIS ను గాని, CRP అడగండి వాళ్ళు మీ పాస్వర్డ్ను చెప్పగలరు.
మూడవ దశ:
పైన చెప్పినట్లుగా సబ్మిట్ ను చేయగానే ఈ క్రింది విధంగా గా ఓపెన్ అవుతుంది తర్వాత పసుపు కలర్ లో కనబడుతున్న రెండవ ఆప్షన్ను Student Info క్లిక్ లేదా టచ్ చేయండి.
ఈ రకంగా క్లిక్ చేయగానే మళ్లీ ఒక ఆప్షన్ మెనూ కనపడుతుంది ఈ క్రింది విధంగా...
ఏ ఆప్షన్ మిన్నుల్లో చిట్టచివరి నగల ఆప్షన్ను అనగా Student Attendance Capture క్లిక్ చేయండి లేదా టచ్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది
నాల్గవ దశ:
ఇప్పుడు క్లాస్ అనే చోట పాఠశాలలో గల అన్ని తరగతుల లిస్ట్ కనబడుతుంది. మీరు హాజరు చేయగల క్లాసు ను సెలెక్ట్ చేసి సర్చ్ మీద క్లిక్ లేదా టచ్ చేయండి
ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల పేర్లు అన్ని కూడా మీకు లిస్ట్ రూపంలో కనబడుతుంది.
హాజరు వేయడం వేగంగా త్వరగా సులభంగా జరగాలి అంటే ఆ లిస్టులో ఉన్న రెండవ కాలంలో అటెండెన్స్ చోటా సెలెక్ట్ అల్ ఎంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆ తరగతిలో ఉన్న అందరి ఎస్ అని సెలక్ట్ అవుతుంది అప్పుడు ఈ రోజున ఎవరైతే గైర్హాజరు లేదా బడికి రాలేదు వారి పేరు మీద నో అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
చివరి దశ:
నా ఒక తరగతి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పేజీ మల్లి కనబడుతుంది అప్పుడు ఇంకొక తరగతి ని సెలెక్ట్ చేసుకొని ఇదే రకంగా సబ్మిట్ చేయాలి ఇలా ఒక్కొక్క క్లాసు చేసుకుంటూ వెళితే అన్ని తరగతుల హాజరు ఆన్లైన్ చేయబడుతుంది.
మీ పాఠశాల విద్యార్థుల ఆన్లైన్ హాజరు పూర్తవుతుంది.
ఈ క్రింది వీడియో చూడగలరు
ఈ పనిని అన్ని రకాల ఫోన్ లో ఎలా చేయాలో మా పాఠశాలను మా ఫోన్లో చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేసి ఈ క్రింది వీడియోలో పెట్టాను చూడండి
Please give your comments....!!!