Guruvu.In

FAQs Frequently Asked Questions సందేహాలు సమాధానాలు

*సందేహాలు - సమాధానాలు*

ప్రశ్న:
*GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా?*
జవాబు:
*ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.*


ప్రశ్న:
*ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి?*

జవాబు:
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*


ప్రశ్న:
*ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు. ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.?*

జవాబు:
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి. ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.*


ప్రశ్న:
*ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.?*

జవాబు:
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*


ప్రశ్న:
*ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?*

జవాబు:
*మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts