Type Here to Get Search Results !

Providing Transport Charges to Students Studying 1st to 10th Classes Proceedings and Forms

*🔊విద్యార్థులకు రవాణా భత్యం విడుదల*

*🔶9,10 తరగతుల వారికీ వర్తింపు*

*🔷ఒక్కో విద్యార్థికి రూ.600*



*🍥దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్సరానికిగాను రూ.9.14 కోట్లను మంజూరుచేస్తూ జీవో జారీచేసింది. విద్యా హక్కు చట్టంప్రకారం విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలి లేదా భత్యం అందించాలి. చట్టం ప్రకారం 1-5వ తరగతి వరకు ఒక కిలోమీటర్‌, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకునే వారికి రవాణాభత్యం ఇవ్వాలి. ఇదివరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే భత్యం ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి 9,10 తరగతుల వారికి కూడా వర్తింపజేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని హ్యాబిటేషన్లు 3,150 ఉండగా, వాటిలో 30,488 మంది విద్యార్థులున్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరికీ నెలకు రూ.600 చొప్పున రవాణా భత్యంగా అందజేయనున్నారు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night