Type Here to Get Search Results !

Frequently Asked Questions About Allocation

 *జిల్లాల విభజన ప్రక్రియ ముఖ్యాంశాలు*

👉రేపు మధ్యాహ్నం 2PM లోగా ప్రతి ఉపాధ్యాయుడు modified Option form నింపి MEO కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
👉 Option form లో తప్పనిసరిగా మూడు జిల్లాల పేర్లు రాయాలి
👉 పూర్వ రంగారెడ్డి కు సంబంధించిన సీనియార్టీ లిస్టులు(cadre wise) ఈరోజు రాత్రి వరకు ప్రకటిస్తారు.
👉 ప్రతి ఉపాధ్యాయుడు సీనియార్టీ లిస్టు క్షుణ్నంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రేపు 10-12-2021, ZPHS MALKAJGIRI (B) లో దరఖాస్తు చేయాలి.
👉 అభ్యంతరాల దరఖాస్తుకు Cadre wise counters ఏర్పాటు చేస్తారు.
👉 ప్రస్తుతం ఆప్షన్స్ ఇచ్చిన ప్రకారం జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయిస్తారు
👉 అదే జిల్లాకు కేటాయించబడితే present place మారదు.
👉 ఇతర జిల్లాలకు కేటాయించబడితే నూతనంగా మార్గదర్శకాలు ఇచ్చి schools ని కేటాయిస్తారు.MK



*కొత్త లోకల్ క్యాడర్ (జోనల్ క్యాడర్) - సందేహాలు - సమాధానాలు*

(జి. ఓ 317 ఆధారం )

సందేహం : కొత్త జోనల్ విధానం కేటాయింపు లో స్థానికత ఆధారంగా కేటాయింపు అవకాశం ఉందా?

వివరణ : లేదు. పూర్తిగా పూర్వపు జోన్ మరియు సీనియరిటీ ఆధారంగా ఉంటుంది.

సందేహం : నేను పూర్వపు 5 వ జోన్ ఉద్యోగిని. ఇప్పుడు పూర్వపు 6 వ జోన్ పరిధి లోని కొత్త జోన్ కి ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : పూర్వపు 5 వ జోన్ పరిధిలో ఏర్పడిన కొత్త జోన్ లో మాత్రమే ఆప్షన్ ఇవ్వవలెను.

సందేహం : ఏదైనా ఒకే జోన్ ఆప్షన్ ఇవ్వొవచ్చా?

వివరణ :మన ప్రాధన్యత క్రమం మన పూర్వపు జోన్ లో ఏర్పడిన అన్ని జోన్ లకి ఆప్షన్ ఇవ్వాలి. లేనిచో అపోయింటింగ్ అథారిటీ నిబంధనల క్రమం జోన్ కేటాయింపు చేస్తారు.


సందేహం : నేను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా లొనే ఉండాలి అనుకుంటున్నాను, నేను ఆప్షన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం ఉందా?


వివరణ : కచ్చితంగా ఇవ్వాల్సిందే.. కొత్త లోకల్ క్యాడర్ ప్రకారం అలట్మెంట్ అయ్యేవరకు మనం ప్రస్తుతం పని చేస్తున్న లోకల్ క్యాడర్ కి శాశ్వత ఉద్యోగులం కాదు.

సందేహం : నేను పాత జోనల్ విధానం లో 5 వ జోన్ ఉద్యోగిని, ప్రస్తుతం  ఆప్షన్ ఫారం లో నాకు ఇష్టమైన జిల్లాలు ఇవ్వవొచ్చ?

వివరణ :  కేవలం జోన్ లు మాత్రమే ఆప్షన్ ఇవ్వవలెను. 

సందేహం : జోనల్ అలట్మెంట్ లో వికలాంగులకు అందరికి ప్రాధాన్యత ఉంటుందా ?

వివరణ : అందరికి ఉండదు. వైకల్యం 70% కి పైన ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత. సంబంధిత పత్రాలు ఆప్షన్ ఫారం తో జత పరచ వలసి ఉంటుంది.

సందేహం : జోన్ అలట్మెంట్ లో spouse కేటగిరీ వారికి ప్రాధాన్యత ఉంటుందా?

వివరణ : అలట్మెంట్ కి ప్రాధాన్యత ఉండదు. కేటాయింపు తరువాత మార్చుకునే అవకాశం ఉంది. ఒక వేళ భార్య భర్తలు భిన్న జోన్లు కేటాయింపబడినపుడు ఒకే జోన్ కావాలి అనుకుంటే  ప్రత్యేక కార్యదర్శి కి అర్జీ పెట్టుకొనవలెను. ఖాళీలను బట్టి ఇద్దరికి ఒకే జోన్ కేటాయించే అవకాశం ఉంటుంది.

సందేహం : నేను పాత జోనల్ విధానం లో ఆరవ జోన్ ఉద్యోగిని. ప్రస్తుతం మల్టి జోన్ 1 లోని జోన్ 3 (రాజన్న) జోన్ కి ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : ఇవ్వవొచ్చు. కానీ రాజన్న జోన్ లోని మెదక్, కామారెడ్డి, సిద్దిపేట ( కరీంనగర్, వరంగల్ నుండి కలిపిన మండలాలు తక్కితే)  జిల్లాలోని పోస్టులకు మాత్రమే అర్హత ఉంటుంది. రాజన్న జోన్ లోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకి మరియు సిద్దిపేట జిల్లాలోని కరీంనగర్, వరంగల్ నుండి కలిపిన మండలాలు పోస్టులకి అర్హత ఉండదు.

సందేహం : నేను 5 వ జోన్ ఉద్యోగిని, ఆప్షన్ ఫారం లో ప్రాధాన్యత లు మొదటి ప్రాధాన్యత జోన్ 3 (కరీంనగర్ జిల్లా) రెండవ ప్రాధాన్యత జోన్ 1 (పెద్దపల్లి జిల్లా) మూడవ ప్రాధాన్యత జోన్ 3 (సిరిసిల్ల జిల్లా) ఇ విదంగా ఇవ్వవొచ్చ?

వివరణ: ఇవ్వకూడదు. ఒక జోన్ ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఆ జోన్ లో అన్ని జిల్లాల్లో పనిచేయడానికి సిద్ధం అని అర్థం.

సందేహం: సస్పెన్షన్, లీవ్ లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవల్సిందేనా?

వివరణ : ఇవ్వవలెను. 

సందేహం : డెప్యూటషన్ లేదా ఫారిన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : ఆప్షన్ ఫారం ఇవ్వవలెను.

సందేహం : క్యాడర్ స్ట్రేంత్ కన్న ఎక్కువగా ఉన్న ఉద్యోగుల కేటేయింపు కి ప్రాతిపదిక ఏమిటి?

వివరణ: ఈ అంశం పైన ప్రస్తుత జి.ఓ. లో ఎలాంటి వివరణ లేదు.


సందేహం : HOD లో ఏ ప్రాంత ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వొచ్చు.

వివరణ : HOD కి ప్రత్యేక ఆప్షన్ ఎమీ లేదు. Hod లోని పోస్టులు నూతన జోనల్ విధానం ప్రకారం ఒక్కో జోన్ కి కేటాయింపులు చేసి ఆయా జోన్ లకి జమ చేయబడతాయి.

సందేహం : కొత్త జోనల్ విధానం లో సీనియారిటీ ఎలా లెక్కిస్తారు.

వివరణ : ప్రస్తుత జి. ఓ లో ఈ అంశంలో ఎలాంటి వివరణ లేదు.

సందేహం : ఒక వేళ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జోన్ కె కేటాయింప బడితే ప్రస్తుతం పనిచేస్తున్న మండలం/డివిజన్/జిల్లా కార్యాలయం లొనే ఉండవచ్చా?

వివరణ: బదిలీలకు సంబంధించిన ప్రస్తావన ఈ జి.ఓ లో లేదు. కొనసాగింపుగా తరువాతి ఉత్తర్వులలో వివరణ ఉండవచ్చు.

సందేహం : ఒక జోన్ పరిధిలో సాంక్షన్ పోస్ట్స్ అన్ని కూడా కేటేయింపు కొరకు పరిగణలోకి తీసుకుంటారా?

వివరణ: తీసుకోరు. ఒక జోన్ పరిధిలో సాంక్షన్ పోస్టులు అన్ని కాకుండా పూర్వపు జోన్ లో పనిచేయుచున్న ఉద్యోగుల నిష్పత్తి ఆధారంగా నూతన జోన్ కి కేటాయించిన వర్కింగ్ స్ట్రేంత్ ఆధారంగా కేటాయింపు ఉంటుంది. అనగా ఉదాహరణకు ప్రస్తుతం 5 వ జోన్ లో ఖాళీగా ఉన్న MPSO పోస్టులు 5వ జోన్ పరిధిలోని అన్ని జోన్ లలో సమనంగా ఉండేట్టు చూస్తారు.

సందేహం : ఉద్యోగులు అలట్మెంట్ ఆర్డర్ ఎలా పొందుతారు.

వివరణ : IFMIS వెబ్సైట్ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే అవకాశం ఉంది.

*అధికారిక వివరణ కొరకు జి.ఓ 317 చూడండి

*📡ప్రశ్న: నేను అంతర్ జిల్లా బదిలీల మీద రంగా రెడ్డి జిల్లా కు వచ్చాను.option ఎలా ఇవ్వాలి.✍️*

సమాదానం:
*➡️రంగా రెడ్డి జిల్లా మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది.కావున మీరు మూడు జిల్లాల కు option ఇవ్వాలి.*
*మీరు రంగా రెడ్డి జిల్లా కు వచ్చినప్పటి నుండి మీ seniority లెక్కించ బడుతుంది.*

 *📡ప్రశ్న: కొత్త GO ప్రకారం స్టానికత ను ఎలా నిర్ణయిస్తారు?✍️*

సమాదానం:
    *➡️ప్రభుత్వం విడుదల చేసిన GO 317 ప్రకారం ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వాసులు స్టానికులుగా పరిగణలోకి తీసుకుంటారు. బయటి జిల్లా వారిని స్టానికులు కానివారిగా పరిగణిస్తారు.*

*📡ప్రశ్న: కొత్త GO ప్రకారం seniority ని ఎలా ఎక్కిస్తారు?✍️*

సమాదానం 

*➡️ప్రస్తుతం మీరు పని చేస్తున్న cadre లో seniority ని మాత్రమే లెక్కిస్తారు.*
*అనగా SGT నుండి SA గా పదోన్నతి పొందితే ఆ తేదీ నుండి seniority లెక్కిస్తారు.*
*Appointment తేదీ నుండి లెక్కించరు.*
*అంతర్ జిల్లా బదిలీ ద్వార వస్తే అదే తేదీ నుండి seniority వర్తిస్తుంది*

*📡ప్రశ్న: సిద్దిపేట జిల్లా లో కొన్ని వేరే జిల్లాల కు చెందిన మండలాలు విలీనం అయ్యాయి.option ఎలా ఇవ్వాలి.✍️*

సమాదానం 

*➡️ఉదాహరణకు సిద్దిపేట జిల్లా లో వరంగల్ జిల్లా లో ని కొంత భాగం కలిసిపోయింది.కావున పూర్వపు వరంగల్ జిల్లా కు చెందిన ఉద్యోగులు ఎవరైన సిద్దిపేట కు option ఇవ్వవచ్చు.*
*కానీ పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన ఉద్యోగులు వరంగల్ జిల్లా కు ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదు*


*📡ప్రశ్న: మేము భార్యాభర్తలిద్దరం టీచర్ లుగా ఒకే జిల్లా లో పని చేస్తున్నామ్. మాకు స్పెషల్ category వర్తిస్తుందా?✍️*

సమాదానం:

*➡️ప్రభుత్వం విడుదల చేసిన GO లో spouse వారిని స్పెషల్ category కింద పరిగణనలోకి తీసుకోలేదు.*
*మీరు అందరిలాగె విడివిడిగా option ఇచ్చు కోవాలి.*
*ఒకవేళ మీకు వేరు వేరు జిల్లాలు కేటాయించటం జరిగితే అప్పుడు మీరు spouse category కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.*
*ప్రభుత్వం మీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది*

ప్రశ్న: సిద్దిపేట జిల్లా లో కొన్ని వేరే జిల్లాల కు చెందిన మండలాలు విలీనం అయ్యాయి.option ఎలా ఇవ్వాలి.

సమాదానం 

ఉదాహరణకు సిద్దిపేట జిల్లా లో వరంగల్ జిల్లా లో ని కొంత భాగం కలిసిపోయింది.కావున పూర్వపు వరంగల్ జిల్లా కు చెందిన ఉద్యోగులు ఎవరైన సిద్దిపేట కు option ఇవ్వవచ్చు.
కానీ పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన ఉద్యోగులు వరంగల్ జిల్లా కు ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదు

*G.O 317 ప్రకారం*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
(1) ప్రస్తుత జీఓ లో స్థానికత అనేది లేదు. 

(2) క్యాడర్ సీనియారిటీ ప్రకారం ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ ఇవ్వాలి.

(3) ఉమ్మడి జిల్లా లోని విభక్త జిల్లాల అన్నింటికీ ఆప్షన్ ఇవ్వాలి.

(4) ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చిన వారికి అక్కడ సరిపడా పోస్టులు లేకపోతే జూనియర్ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుంది ( రేషనలైజేషన్ లాగా)

(5) ఇక పదోన్నతుల విషయం కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారం ఇస్తారు. 

(6) GHM పోస్ట్ మల్టీ జోనల్ 
చేశారు కాబట్టి ఏ జిల్లాలో పనిచేసినా సీనియారిటీ వర్తిస్తుంది 

(7) ఇక నిరుద్యోగుల విషయం ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టులు TRT వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు ఇకముందు కూడా ఉండదు కూడా తాత్కాలిక సర్దుబాటు,విద్యా వాలంటీర్లు ,కాంట్రాక్ట్ పద్దతి ద్వారా మాత్రమే.

(8) పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*PO-2018 జిల్లా పోస్టుల ప్రకారం 6వ అంశం ప్రకారం ........*
ప్రస్తుతము పనిచేయు స్థలాన్ని చూసే అవకాశం ఉంది.

Category

Post a Comment

7 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. 2012 DSC లో నాన్ లోకల్ కేటగిరీలో మహబూబ్ నగర్ జిల్లాలో SGT గా విధులు నిర్వహిస్తున్న నేను నా స్తానికత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు వెళ్ళవచ్చా సార్ ??

    ReplyDelete
    Replies
    1. GO 317 ప్రకారం మీరు పనిచేస్తున్న ఉమ్మడి జిల్లాను స్థానికతలోకల్ గా పరిగణిస్తారు.మిమ్మల్ని మొదటి ప్రాధాన్యతగా ఇక్కడే గుర్తిస్తారు
      .ఆప్షన్ ఇవ్వవచ్చు.

      Delete
  2. సీనియారిటీ అంటే ఒకే dsc లో age చూస్తారా లేక ర్యాంక్ చూస్తారా

    ReplyDelete
  3. Sir nenu jagitial district lo chadivanu mariyu jagitial district lo job chestunanu nenu 11 years nundi jagitial district lo ne job chestunanu.nadi 2008 dsc sgt.nenu enni district ku options ivvali.naku jagitial district vastunda.

    ReplyDelete
  4. Gurukul teachers ki ఎలా ఆప్షన్స్ ఉంటాయి

    ReplyDelete
  5. నేను పాత జోన్ ల ప్రకారం 5 వ జోన్ కొత్త జోన్ ప్రకారం భద్రాద్రి జోన్ నాది జోనల్ పోస్ట్. spouse (టీచర్) జోన్ 6 కోత జోన్ యాదాద్రి(సూర్యాపేట జిల్లా) వున్నాడు.ఇప్పుడు నేను యదాద్రిజోనల్ లో రావడానికి అవకాశము ఉంటుందా?

    ReplyDelete

Please give your comments....!!!

Recent Posts