🌈🌈🌈🌈🌈🌈
*ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.*
♦ ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.
♦ APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించారు.
*(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*
♦ నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
*(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)*
*(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*
♦ DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.
♦ ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి.
*(Memo.No.49463 Dt:06-10-1974)*
ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
*Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*
♦ నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.
♦ వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.
*ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము*
-ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.
-అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప)
-డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.
-అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.
-పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.
-ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.
- ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)
*ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం*
-జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
- *జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ:*
-వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది(ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు)
*(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*
- 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సంధర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.
*ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:*
-తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.
*Without Cumulative Effect:*
FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.
*With Cumulative Effect:*
దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి.ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.
*ఇంక్రిమెంట్లు-రకాలు:*
*స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు:*
●●●●●●●●●●●
-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫిక్సేషన్,ప్రమోషన్లు, AAS )లకు పరిగణిస్తారు.
10వ పి.అర్.సి లో 5
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.
*(G.O.Ms.No.152 F&P Dt:04-11-2000)*
*(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)*
*ప్రిపోన్మెం ట్ ఆఫ్ ఇంక్రిమెంట్:*
-ఉద్యోగుల వేతన స్థిరీకరణ సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.
*ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు:*
- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్) నిర్వహించాలి.
- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.
*(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)*
- అర్జిత సెలవు లో(EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్,గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.
- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- *FR 18*
-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నోషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్న్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు.
*(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)*
-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి.
0 Comments
Please give your comments....!!!